మేటి 10 అద్భుత మరియు అసాధారణ ఫోటోగ్రాఫ్స్

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రతి సంవత్సరం ఎక్కడో అక్కడ జరిగే విచిత్ర విషయాలు ప్రజలలో మరింత వింతలకోసం ఆసక్తిని పెంచుతాయి. ఇదిగో ఇక్కడ మేము ఈ సంవత్సరపు మేటి 10 అద్భుత మరియు విచిత్ర ఫోటోల లిస్టును అందించాం. ఈ ఫోటోలన్నిటినీ చూడండి.మీరూ తప్పక ఆనందిస్తారు!

మేటి 10 అద్భుత మరియు అసాధారణ ఫోటోలను చూడండిః

మరో మెట్టులో నిశ్చితార్థపు ఫోటోగ్రఫీ

All Image Source: Wonderlist

1. హింసింపబడుతున్న స్త్రీ

1. హింసింపబడుతున్న స్త్రీ

చిలీ,సాంటియాగోలో లేటు. జనరల్. అగస్టో పినోచెట్ గూర్చి తీసిన డాక్యుమెంటరీ ప్రీమియర్ షోకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో ఒక స్త్రీ హింసింపబడుతున్నట్లు, నటుల బృందం బాగా పోజు పెట్టారు.

2. గాడిదపై తిరుగుతూ ఒక పర్యాటకురాలు ఐపాడ్ వాడటం

2. గాడిదపై తిరుగుతూ ఒక పర్యాటకురాలు ఐపాడ్ వాడటం

అమెరికన్ పర్యాటకురాలు ఎల్లా వైఫై సౌకర్యం ఉన్న గాడిదపై తిరుగుతూ, ఐపాడ్ వాడటాన్ని, ఉత్తర ఇజ్రాయెల్ గెలీలీలో హోషాయా అనే గ్రామంలోని క్ఫార్ కేదేమ్ అనే పార్కులో చూడటం జరిగింది. ఆమె సోదరుడు ఆరోన్ కూడా ఆమెతో గాడిద పక్కన నడుస్తూ ఉన్నారు. బైబిల్ జన్మస్థలం అయిన ఈ పాత టెస్టామెంట్ పార్కులో పర్యాటకులు ఇప్పుడు గాడిదలపై రైడ్ మాత్రమే కాక ఇంటర్నెట్ ను కూడా వినియోగించుకోవచ్చు.

3. స్త్రీ బట్టల్లో ఒక ఉగ్రవాది అరెస్ట్

3. స్త్రీ బట్టల్లో ఒక ఉగ్రవాది అరెస్ట్

ఆఫ్ఘనిస్తాన్ లోని తూర్పు కాబూల్ లోని లఘ్మాన్ ప్రావిన్స్ లోని మెహ్తెర్లామ్ లో ఉన్న ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ విభాగం ఎదుట సమావేశమైన మీడియా ముందు, ఆఫ్ఘన్ స్త్రీల వేషాల్లో పట్టుబడిన తాలిబన్ ఉగ్రవాదులను అఫ్ఘన్ సెక్యూరిటీ అధికారులు ప్రవేశపెట్టడం ఈ చిత్రం.

4.ఇజ్రాయెలీ మహిళా సైనికులు ఆనందించటం

4.ఇజ్రాయెలీ మహిళా సైనికులు ఆనందించటం

ముగ్గురు ఇజ్రాయెలీ మహిళా సైనికులు తెల్ అవివ్, ఇజ్రాయెల్లో బీచ్ లో సూర్యకాంతిని ఆస్వాదిస్తున్నారు .

5.ప్లాస్టిక్ వర్షంలో క్యాట్ వాక్

5.ప్లాస్టిక్ వర్షంలో క్యాట్ వాక్

లండన్ ఫ్యాషన్ వీక్ లో భాగంగా బర్బెర్రీ ప్రోర్సమ్ లండన్ 2012 ఆటం/వింటర్ కలెక్షన్ క్యాట్ వాక్ షో ఫినాలే సమయంలో మోడల్స్ ప్లాస్టిక్ వర్షంలో గొడుగులు ధరించి ర్యాంప్ పై నడిచారు.

హిస్టరీలోని కొన్ని అరుదైన మైండ్ బ్లోయింగ్ పిక్స్!

6.ప్రపంచంలోనే పొట్టి అయిన వ్యక్తి

6.ప్రపంచంలోనే పొట్టి అయిన వ్యక్తి

చంద్ర బహుదూర్ డంగీ అనే ఈ 72ఏళ్ళ నేపాలీ వ్యక్తి, ఖాట్మండుకి 540 కిమీలు నైరుతి దిశలో ఉన్న డంగ్ జిల్లాలోని రీంఖోలీ గ్రామంలో తన ఇంటి వద్ద నిల్చున్నాడు. ఈయన 22 అంగుళాల ఎత్తుతో,ప్రపంచంలోనే పొట్టి అయిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. >>ప్రపంచం చూసిన అతిపొట్టి క్రీడాకారులు

7. ఒక మహిళా రన్నర్ పై జోంబీల దాడి

7. ఒక మహిళా రన్నర్ పై జోంబీల దాడి

మాడ్రిడ్, స్పెయిన్ లో ఒక 5కె జాంబీస్ రేసులో పాల్గొంటున్న ఒక మహిళపై జాంబీల దాడి.

8. ఒక పాప ఒక వ్యక్తిని గుచ్చిలేపింది.

8. ఒక పాప ఒక వ్యక్తిని గుచ్చిలేపింది.

ఒక చిన్న పాప మధ్య ఏథెన్స్ లోని సిన్టాగ్మా స్క్వేర్ వద్ద ఉన్న ఆరెంజ్ చెట్టు కింద పడుకుంటున్న ఇల్లులేని వ్యక్తిని గుచ్చి లేపింది.

9.వీల్ ఛైర్ రొమాన్స్

9.వీల్ ఛైర్ రొమాన్స్

కాన్కన్ లో వీల్ చెయిర్ పై మొదటి స్థానిక డ్యాన్స్ పోటీలలో భాగంగా జాజ్మిన్ లోపెజ్ మరియు మిగెల్ ఒసోరియోల డ్యాన్స్ ప్రదర్శన.

10.యుద్ధ విమానాలు నీరు మోసుకురావటం

10.యుద్ధ విమానాలు నీరు మోసుకురావటం

అలికాంటే,స్పెయిన్ వద్ద ఉన్న సియెర్రా మేరియోలా నేచర్ పార్క్ కీ సమీపంలో అంటుకున్న దావాగ్నిని చల్లార్చడానికి యుద్ధవిమానాలు బెనియారెస్ రిజర్వాయర్ నుంచి నీరు మోసుకొచ్చాయి.

మీరు ఈ మేటి 10 అద్భుత మరియు అసాధారణ ఫోటోలను ఆనందించారని ఆశిస్తున్నాం, మీ ఆలోచనలను మాతో కామెంట్'స్ లో పంచుకోండి.

English summary

Top 10: Astonishing and Unusual Photographs!

Top 10: Astonishing and Unusual Photographs, Read to know more about...
Story first published: Thursday, November 16, 2017, 14:30 [IST]
Subscribe Newsletter