For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం పెళ్లి అయ్యింది.. సాయంత్రం పెళ్లి కూతురు తల్లి అయ్యింది

పెళ్లికూతురు, పెళ్లికొడుకు అప్పుడప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని కాస్త తొందరపడ్డారు. ఇద్దరూ చాలా సార్లు అందులో పాల్గొన్నారు. దీంతో అమ్మాయి గర్భం దాల్చింది.

|

పెళ్లయిన తర్వాత అన్నీ కలిసొస్తే ఒక తొమ్మిది నెలల తర్వాత ఎవరైనా బిడ్డకు జన్మనిస్తారు కానీ ఆమె మాత్రం పెళ్లి అయిన రోజు సాయంత్రమే బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు తండ్రి ఆ పెళ్లి కొడుకేనని డాక్టర్లు కూడా నిర్దారించారు. అంటే పెళ్లి కొడుకు ఎంత స్పీడ్ ఉన్నాడో అర్థం చేసుకోండి. ఉదయం పెళ్లి చేసుకున్నాడు. రాత్రికల్లా తండ్రి అయ్యాడు.

అంబాలో పెళ్లి

అంబాలో పెళ్లి

ఇదంతా హర్యాణలోని జలంధర్ లో జరిగింది. పెళ్లికొడుకుది రాజస్థాన్‌లోని భరత్‌పూర్. ఇక పెళ్లి కూతురిది హర్యాణలోని జలంధర్. వీరిద్దరీ పెళ్లి హర్యాణలోని అంబాలో వీరిద్ధరి పెళ్లి ఘనంగా జరిగింది.

అందరూ సంబరపడ్డారు

అందరూ సంబరపడ్డారు

ఇక పెళ్లికి అమ్మాయి, అబ్బాయి తరఫున బంధువులు చాలా మంది వచ్చారు. అందరూ ఇద్దరినీ ఆశీర్వదించారు. వచ్చినవాళ్లంతా పెళ్లికూతురు, పెళ్లి కొడుకుని చూసి సంబరపడ్డారు. అందరికీ చూడముచ్చటగా అనిపించింది ఆ జంట.

అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో

అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో

పెళ్లి అయిపోయిన తర్వాత బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్లిపోవడానికి సిద్ధం అయ్యారు. పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కూతురి బంధువులు కూడా ఒకటికి పదిసార్లు పెళ్లికొడుకుకి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమ్మని చెప్పి వెళ్లిపోయారు.

పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని

పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని

మొత్తానికి అప్పగింతలు అయిపోయాయి. అంతా బాగానే జరిగింది. పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని తన సొంత ఇంటికి బయల్దేరారు పెళ్లికొడుకు అతని కుటుంబసభ్యులు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

ఇంతలో పెళ్లి కూతురికి నొప్పులు వచ్చాయి. పక్కనున్న వారికి అర్థం కాలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పండంటి బడ్డకు పెళ్లి రోజే పెళ్లి కూతురు జన్మనిచ్చింది. పెళ్లి కొడుకు ఆ బిడ్డను చూసుకుంటూ తెగ మురిసిపోయాడు.

పెళ్లి కొడుకు తండ్రి అయ్యాడు

పెళ్లి కొడుకు తండ్రి అయ్యాడు

మిగతావారికి కథ అర్థం కాలేదు. ఉదయం పెళ్లి అయ్యింది. సాయంత్రం ఇలా పెళ్లి కొడుకు తండ్రి అయ్యాడు. అందులో పెళ్లి కొడుకు తెగ ఆనందపడిపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ తెలిస్తే పెళ్లి కొడుకు సంతోషపడడంతో తప్పులేదని అనిపిస్తుంది.

హద్దుల్లో ఉండలేకపోయారు

హద్దుల్లో ఉండలేకపోయారు

వీళ్లిద్ధరికి రెండేళ్ల కిందటే పెళ్లి నిశ్చిర్థార్తం పూర్తయ్యింది. పెద్దలే పెళ్లి కుదిర్చారు. కాని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. పెళ్లి వాయిదా పడ్డా.. అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండలేకపోయారు.

అమ్మాయి గర్భం దాల్చింది

అమ్మాయి గర్భం దాల్చింది

ఇద్దరికీ సమయం చిక్కినప్పుడల్లా పర్సనల్ గా కలిసేవారు. ఇక అప్పుడప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని కాస్త తొందరపడ్డారు. ఇద్దరూ చాలా సార్లు అందులో పాల్గొన్నారు. దీంతో అమ్మాయి గర్భం దాల్చింది.

పెళ్లి కొడుకుకు తెలుసు

పెళ్లి కొడుకుకు తెలుసు

తనకు కాబోయే భార్య గర్భం దాల్చిన విషయం ఆ పెళ్లి కొడుకుకు కూడా తెలుసు. అప్పుడప్పుడు టెస్ట్ లు చేయించేవాడట. బేబీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ లో సూచనలు కూడా ఇచ్చేవాడంట.

బంధువులకు కాస్త షాక్

బంధువులకు కాస్త షాక్

ఇక పెళ్లి తంతు ముగిసిన అనంతరం అత్తారింటికి చేరేలోగానే ఆ నవవధువు బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి అయిపోయి జలంధర్ నుంచి కారులో వెళుతుండగా లుధియానా-రాజ్‌పురా రహదారిలో వధువుకు పురిటి నొప్పులు రావడం.. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అక్కడ ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఇవన్నీ పెళ్లి కొడుకు బంధువులకు కాస్త షాక్ కలిగించాయి.

పెళ్లి, తొట్లె ఒకేసారి

పెళ్లి, తొట్లె ఒకేసారి

అబ్బాయి, అమ్మాయి పెళ్లికి ముందు హద్దుల్లో ఉండకపోతే ఇలాంటి షాక్ లే తగులుతాయి. ఇక బంధువులు చివరకు అసలు విషయం తెలుసుకుని ఆ పెళ్లి+తొట్లె (బిడ్డను ఊయలలో వేసే కార్యక్రమం) కార్యక్రమాలున్నాయంటే ఇంకో రెండు రోజులు సెలవులు పెట్టుకుని వచ్చే వాళ్లం కదా అనుకున్నారంట.

English summary

after few hours marriage newly married bride gave baby birth

after few hours marriage newly married bride gave baby birth
Desktop Bottom Promotion