Latest Updates
-
Rama Navami 2026: శ్రీరాముడి గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఇవే! -
డీప్ ఫ్రై లేదు,రుచిలో తగ్గేదే లేదు..చుక్క నూనె లేకుండానే కరకరలాడే పొటాటో కట్లెట్స్ -
ఈరోజు రాశి ఫలాలు (25.03.26): బుధవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ -
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా! -
ఈరోజు రాశి ఫలాలు (24.03.26): మంగళవారం నాడు ఈ రాశుల వారికి ధనయోగం! -
కామద ఏకాదశి 2026 తేదీ, పూజా ముహూర్తం, విష్ణుమూర్తి ఆశీస్సులు పొందే శక్తివంతమైన మంత్రం -
అన్నంలోకి అమృతంలా ఉండే పెరుగు వంకాయ గ్రేవీ.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ! -
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
భారత్ లో పెరుగుతున్న రెండో పెళ్లి ధోరణి..జీవన్ సాథి సర్వేలో ఆసక్తికర నిజాలు
పామిస్ట్రీ: మీ అరచేతులలో ఈ రేఖలు ఉంటే మీరు ధనికులు అలాగే సంపన్నులు అయ్యే అవకాశాలున్నాయి
హార్డ్ వర్క్ కి ఏదీ సాటిరాదన్న విషయం తెలిసిందే. అయితే, సక్సెస్ సాధించడం అలాగే ధనికులవడం అనేది మాత్రం డెస్టినీపై ఆధారపడిలేదని చెప్పలేము.

మీ ఫేట్ ని మీ అరచేతులే డిసైడ్ చేస్తాయి. మీ అరచేతులతో కొన్ని రేఖలు ఉంటాయి. ఇవి మీరు మిలియనీర్ అవుతారో లేదో తప్పక చెబుతాయి. ఈ విషయం గురించి ఈ ఆర్టికల్ ని చదివి తెలుసుకోండి మరి.

స్ట్రైట్ లైన్
మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీ అరచేతులలో కనబడే లైన్స్ చాలా మటుకు అస్తవ్యస్తంగా దర్శనమిస్తాయి. వీటి మధ్యలో ఏవైనా స్ట్రైట్ లైన్స్ మీకు తారసపడితే మీరు జీవితంలో సంపన్నులుగా అలాగే గొప్పవారిగా మారే అవకాశాలున్నాయి.

మౌంట్స్
మీ అరచేతులలోని అన్ని మౌంట్స్ (మౌంట్ ఆఫ్ వీనస్, మౌంట్ ఆఫ్ సాటర్న్) అనేవి కాస్త ఎత్తుగా ఉంటె, మీరు జీవితంలో విజయం సాధిస్తారు. ఆలాగే సంపన్నులుగా మారతారు.

టార్టాయిస్:
మీ చేతిలో టార్టాయిస్ సైన్ గనక ఉన్నట్టయితే, మీరు అదృష్టవంతులని అర్థం. మీరు లైఫ్ లో సక్సెస్ సాధించి గొప్ప సంపన్నుడిగా పేరొందుతారు

స్వస్తిక్:
స్వస్తిక్ చిహ్నం మీ అరచేతులతో దర్శనమిస్తే మీరు అదృష్టవంతులనే అర్థం. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గొప్ప ఉన్నతిని పొందుతారు.

వైట్ మోల్:
మీ అరచేతులతో వైట్ మోల్ ఉన్నట్టయితే, అదృష్టం మీ వైపే ఉందని తెలుసుకోండి. మీరు లైఫ్ లో మంచి సక్సెస్ ను చూస్తారు.

గిర్డిల్స్
మీ అరచేతులతో గిర్డిల్స్ అనేవి కాస్త ఎత్తుగా ఉండి వాటిమీద లైన్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తూ మధ్యలో ఎటువంటి బ్రేక్ లేనట్టయితే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అర్థం.

రెండు ఫేట్ లైన్స్
మీకు రెండు ఫేట్ లైన్స్ ఉండి ఒక దానితో ఒకటి పారలెల్ గా ఉన్నట్లయితే, మీరు చాలా అదృష్టవంతులని తెలుస్తుంది. అలాగే, మీరు ధనాన్ని కూడా బాగా సంపాదిస్తారు.

మౌంట్ ఆఫ్ సాటర్న్
మౌంట్ ఆఫ్ సాటర్న్ వద్ద చక్ర సైన్ ఉంటే మీరు చాలా లక్కీ అని అర్థం. మీరు మీ జీవితంలో చాలా ధనాన్ని సంపాదిస్తారు.

లక్ లైన్:
మీ లక్ లైన్ అనేది రిస్ట్ వరకు ఎక్స్టెండ్ అయితే మీరు అదృష్టంతో పుట్టారని అర్థం. మీరు ఎక్కువ డబ్బును అలాగే ఎక్కువ మంది స్నేహితులను పొందుతారు. జీవితంలో సక్సెస్ ని ఆస్వాదిస్తూ ఉంటారు.

సక్సెస్ ఫుల్ పీపుల్:
ఇప్పుడు, జీవితంలో మీరు సక్సెస్ ను సాధిస్తారో లేదో అరచేతులలోని గీతల ద్వారా తెలుసుకుందాం. ఈ లైన్స్ మీ చేతులలో ఉంటే మీరు ఫేమస్ అవుతారు.

ఫేట్ లైన్ ప్రాముఖ్యత
ప్రతి మనిషి తనతోపాటు తన లక్ ని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తాడు. అరచేతులలోని గీతల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. చదివి తెలుసుకోండి మరి.

ఎక్స్టెండెడ్ లక్ లైన్
ఫేట్ లైన్ అనేది సాధారణం కంటే పొడుగ్గా ఉన్నప్పుడు మీరు జీవితంలో అదృష్టాన్ని పొందుతూ ఉంటారు. మీరు మీ లక్ష్యాలను అలాగే టార్గెట్స్ ను అఛీవ్ చేస్తూ ఉంటారు. జీవితంలో సక్సెస్ ను ఆస్వాదిస్తూ ఉంటారు.

ఇండెక్స్ ఫింగర్
మీ ఫేట్ లైన్ మౌంట్ ఆఫ్ సాటర్న్ వరకు ఎక్స్టెండ్ అయి ఆ తరువాత బ్రేక్ అయి ఇండెక్స్ ఫింగర్ వద్ద రీజైన్ అయి ఉంటే మీరు సక్సెస్ఫుల్ పెర్సన్ గా మారతారని అర్థం. మీ కలలన్నీ నిజమవుతాయి.

థంబ్ లైన్
థంబ్ కింద ప్రారంభమయిన లైన్ మౌంట్ ఆఫ్ సాటర్న్ వరకు ఎక్స్టెండ్ అయితే, మీరు లక్కీ పెర్సన్ అని అర్థం.

ఆర్ట్ మరియు కల్చర్:
ఇటువంటి వ్యక్తులు క్రియేటివిటీ ఎక్కువగా కలిగి ఉండే వారు. వీరు జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. అలాగే, ధనాన్ని బాగా సంపాదిస్తారు. ఆధ్యాత్మిక భావాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి.

అరచేతుల మధ్యలో:
అరచేతుల మధ్యలోంచి ఏదైనా లైన్ ఉద్భవిస్తే మిమ్మల్ని ఉన్నట్టుండి అపారమైన సంపద వరిస్తుంది. వేరే వ్యక్తుల ద్వారానో లేదా మీకు సంబంధించినదో అకస్మాత్తుగా మిమ్మల్ని వరిస్తుంది. జీవితంలో ఎంతో సక్సెస్ ను పొందుతారు.

ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
పామిస్ట్ ల ప్రకారం, అటువంటి వ్యక్తులు సాధారణ కుటుంబంలో జన్మించినా తన హార్డ్ వర్క్ ద్వారా వారు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

ఫేట్ లైన్ లో స్ప్లిట్స్
మీ ఫేట్ లైన్ లో స్ప్లిట్స్ అనేవి మౌంట్ అఫ్ సాటర్న్ వద్దకి చేరితే మీరు చాలా అదృష్టవంతులని అర్థం. జీవితంలోని అన్ని యాస్పెక్ట్స్ లో మీరు సక్సెస్ ని సాధిస్తారు.

వారసత్వ సంపద
అపోలో ఫింగర్ బేస్ వద్ద మెర్కురీ ఫింగర్ సైడ్ న కలిగిన కర్వింగ్ లైన్ ద్వారా వారసత్వ సంపద గురించి తెలుస్తుంది. ఈ లైన్ ద్వారా జీవితం మొత్తానికి సరిపడే అంత వారసత్వ సంపద మిమ్మల్ని వరిస్తుందని తెలుస్తుంది. అయితే, ఈ లైన్ అనేది ఏ సమయంలో మీకు వారసత్వ సంపద కలుగుతుందో ఖచ్చితంగా చెప్పలేదు. ఒక్కొక్క వ్యక్తుల్ని బట్టి ఫలితం అటుఇటుగా ఉంటుంది.

సంపాదించుకున్న ధనం
డెస్టినీ మరియు హెడ్ లైన్స్ కి ఇరువైపులా కనెక్ట్ చేస్తున్న ట్రయాంగులర్ స్ట్రక్చర్ ద్వారా సంపాదించుకున్న ధనం గురించి తెలుసుకోవచ్చు.ఈ స్ట్రక్చర్ అనేది పూర్తిగా క్లోస్ చేసుకున్న ట్రయాంగిల్ లా ఉండాలి. ఇలా ఉంటే ఆ వ్యక్తికి కష్టించి సంపాదించిన ధనం వర్షంలా కురుస్తుందని పామిస్ట్ల అభిప్రాయం. ట్రయాంగిల్ ఎంత పెద్దగా ఉంటే అంత సామర్థ్యంతో ధనాన్ని సంపాదించుకుంటారు.

సంపాదించుకున్న ధనం
లైఫ్ లైన్ నుంచి ఫింగర్ మౌంట్స్ వరకు సాగుతున్న ఫైన్ లైన్ ని జాగ్రత్తగా గమనించడం ద్వారా ఒక వ్యక్తి ఎంత సులభంగా డబ్బును సంపాదించగలడో చెప్పవచ్చు. జూపిటర్ మౌంట్ అనేది కెరీర్ లో సక్సెస్ ని తెలియచేస్తే, సాటర్న్ మౌంట్ అనేది హార్డ్ వర్క్ ద్వారా సమకూరిన ధనం గురించి తెలియచేస్తుంది. మరోవైపు అపోలో మౌంట్ అనేది కీర్తి ప్రతిష్టలను అలాగే డబ్బు గురించి తెలియచేస్తే, మెర్క్యూరీ మౌంట్ అనేది బిజినెస్ అలాగే సైంటిఫిక్ పనుల ద్వారా సమకూరిన సంపదను తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications










![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)
