For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రపోయేటప్పుడు చెమట పట్టే శిశువు గురించి జాగ్రత్తగా ఉండండి!

|

ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంటే, దాని కొంటె చేష్టలు పిల్లల ఆటలో మన జీవితాల యొక్క దు:ఖకరమైన దుస్థితిని మనం మరచిపోతాము - వారి మాటలు, పాటలు, నవ్వులు మరియు ఏడుపు, నిర్మలమైన మరియు అందమైన ముఖం మనలను పెద్దలను కూడా శిశువుగా మారుస్తుంది.

మన చిన్న అందగత్తె నిద్రపోవడం చూడటం ఎంత అందమైనది? మన స్వంత పద్ధతిలో, బయటి ప్రపంచం తన సొంత ప్రపంచం గురించి స్పృహలో లేనట్లుగా, దానిపై హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది మరియు మన కళ్ళు ఇప్పటికే వారి వైపుకు ఆకర్షించబడ్డాయి.

శిశువు నిద్రపోయే సమయం మనం నిద్రపోయే సమయానికి చాలా తేడా ఉంటుంది. అంటే మనం నిద్రపోయేటప్పుడు బిడ్డ మేల్కొంటారు. మనం మేల్కొన్నప్పుడు, శిశువు నిద్రపోతోంది. శిశువు నిద్రలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది. మన అందమైన శిశువు నిద్రపోయి చాలా చెమట పట్టడం చూస్తే, మన మనస్సు ఎంత బాధ కలిగిస్తుంది?

చిన్నారి నిద్రపోతుంటే అలా చూస్తూ ఉన్న మన మనసు ఆనందంలో ఉయ్యాలలూగుతుంది. అయితే, పాపాయి విపరీతంగా చెమటలతో అర్థరాత్రి నిద్రలోంచి మేలుకొంటే మాత్రం ఆందోళనే కదా? ఇటువంటి, సందర్భాలు మీకు పరిచయమేనా? అయితే, ఈ పోస్ట్ మీ కోసమే. నిద్రలో పాపాయికి విపరీతమైన చెమట పడుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆందోళన కలగడం సహజమే.

తమ చిన్నారులు ఏమాత్రం అసౌకర్యానికి గురైన కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఆందోళన అధికమవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా పాపాయికి నిద్రలో చెమటపట్టే విషయంలో అనేక సందేహాలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారు. చిన్నారులలో రాత్రి పూట చెమటపట్టడం సాధారణమేనా లేదా అసాధారణమా? ఈ పోస్ట్ ను చదివి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. తద్వారా, మీ ఆందోళనను తగ్గించుకుని చిన్నారులతో పాటు హాయిగా నిద్రించండి.

 నైట్ స్వెట్స్ అంటే?

నైట్ స్వెట్స్ అంటే?

రాత్రిపూట చిన్నారులకు అధికంగా చెమట పెట్టడాన్ని నైట్ స్వెట్స్ అనంటారు.

నిద్రిస్తున్న సమయంలో చిన్నారులకు అధికంగా చెమట కలగటానికి గల కొన్ని కారణాలు:

కొన్ని ఆరోగ్యసమస్యల వలన చిన్నారులకు నిద్రలో అధికంగా చెమట కలుగుతుంది. వాటి గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.

పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు:

పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు:

పుట్టుకతో గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులలో చెమట అనేది అధికంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి, రాత్రిపూట వీరికి ఎక్కువగా చెమట పడుతుంది. అలాగే, వీరు ఆటలాడే సమయంలో అలాగే ఆహారాన్ని స్వీకరించే సమయంలో కూడా ఎక్కువగా చెమటను చిందిస్తారు. నూట ఇరవై మందిలో ఒకరికి ఇటువంటి సమస్య ఎదురవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలోనున్న సమయంలో గుండె ఎదుగుదల సవ్యంగా లేనప్పుడు ఇలా జరుగుతుంది.

స్లీప్ అప్నియా:

స్లీప్ అప్నియా:

స్లీప్ అప్నియా అనే ఒకరకమైన స్థితి వలన కూడా చిన్నారులకు నిద్రలో విపరీతమైన చెమటలు పడతాయి. ఈ స్థితి వలన చిన్నారి కనీసం ఇరవై సెకండ్ల పాటు శ్వాస తీసుకోలేకపోతుంది. అందువలన, చిన్నారి శరీరం శ్వాస తీసుకోవడం కోసం విపరీతంగా కష్టపడుతుంది. స్లీప్ అప్నియా అనే ఈ సమస్య ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ స్లీప్ అప్నియా సమస్యతో సతమతమవుతూ మీ పాపాయి శరీరం నీలంగా మారినా అలాగే వాటికి గురక కూడా తోడైనా మీరు తక్షణమే వైద్యుల సలహాను స్వీకరించాలి.

సడెన్ ఇంఫాన్ట్ డెత్ సిండ్రోమ్:

సడెన్ ఇంఫాన్ట్ డెత్ సిండ్రోమ్:

ఈ కండిషన్ ని SIDS అని కూడా పిలుస్తారు. ఈ సమస్య అనేది రాత్రిపూట శరీరంలో ఓవర్ హీట్ ను కలిగిస్తుంది. తద్వారా, చిన్నారి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. చిన్నారికి మేల్కోవడం కష్టతరంగా మారుతుంది.

హైపర్ హైడ్రసిస్:

హైపర్ హైడ్రసిస్:

చల్లని వాతావరణం వద్ద ఉన్నా కూడా మీ పాపాయికి విపరీతమైన చెమట పడుతూ ఉందంటే హైపర్ హైడ్రసిస్ అనే సమస్య ఎదురైందని అర్థం. చెమటతో తడిసిన తల, చేతులు అలాగే పాదాల వంటివి ఈ సమస్య యొక్క లక్షణాలు. ఇది, తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదు. కొన్నిసులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

చిన్నారులలో నైట్ స్వెట్స్ సమస్యను నిర్మూలించడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలు

చిన్నారులలో నైట్ స్వెట్స్ సమస్యను నిర్మూలించడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలు

రూమ్ టెంపరేచర్ విషయంలో శ్రద్ధ వహించండి:

పిల్లల్లో నైట్ స్వెట్స్ ను నిర్మూలించడానికి గది ఉష్ణోగ్రతపై శ్రద్ధ వహించడం ముఖ్యమైన విషయం. మీకు గనక గది ఉష్ణోగ్రత వేడిగా ఉన్నట్టనిపిస్తే మీ పాపాయికి కూడా వేడిగానే ఉంటుంది. కాబట్టి, గది ఉష్ణోగ్రత అనేది సాధారణంగా కాస్తంత చల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన దుప్పట్లను మీ పాపాయి ఉయ్యాలలోంచి తొలగించి మీ పాపాయి హాయిగా నిద్రించేందుకు ఏర్పాట్లు చేయండి.

మీ పాపాయికి తగినన్ని ఫ్లూయిడ్స్ ను అందించండి:

మీ పాపాయికి తగినన్ని ఫ్లూయిడ్స్ ను అందించండి:

మీ పాపాయి డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉండేందుకు తగినన్ని ఫ్లూయిడ్స్ ను ఎప్పటికప్పుడు తాగిస్తూ ఉండండి. అలాగే, మీ పాపాయి నిద్రకుపక్రమించే ముందు కూడా శరీరంలోని తగినన్ని ద్రవాలు లేకపోవడం చేత ఎక్కువగా చెమటలు పడతాయి. అందుచేత, పాపాయికి ద్రవాలను అందించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

 సరైన విధంగా డ్రెస్ చేయండి:

సరైన విధంగా డ్రెస్ చేయండి:

రాత్రిపూట మీ పాపాయికి సౌకర్యవంతమైన దుస్తులను తొడగండి. బ్రీతబుల్ మెటీరియల్ తో తయారైన మృదువైన గవున్లను మీ పాపాయికి తొడగండి. పాపాయి బెడ్ టైమ్ లోని వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్దని కనబరచండి.

English summary

Baby Sweating while Sleeping You Must Know This Things

If your baby sweating while sleeping, you must know the reason behind baby sweating.
Story first published: Monday, April 13, 2020, 16:16 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more