For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బిడ్డని మీతో కలిసి పడుకోనివ్వచ్చా?

|

ఆసియాలో చాలా దేశాలు మరియు సంస్కృతులు, మధ్య అమెరికా,దక్షిణ అమెరికా,ఆఫ్రికా మరియు ఇతర దక్షిణ ఐరోపా దేశాలలో కలిసి పడుకోవడం అనేది చాలా సాధారణ విషయంగా పరిగణిస్తాయి.పశ్చిమ దేశాలలో కొన్ని ఉద్యమాలలో కలిసి నిద్రించే పద్ధతి ని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కుటుంబాల దగ్గరకి తీసుకెళ్ళాలని ప్రాకృతిక పిల్లల ప్రాజెక్ట్ వంటివి కూడా కలిసి పనిచేస్తున్నాయి.

అయితే, కలిసి పడుకుంటే ఊపిరి ఆడదనే భయము మరియు వేరే ప్రమాదాలు కొంత మంది తల్లిదండ్రులని వెనకడుగు వేసేలా చేస్తుంది.విడివిడిగా పడుకున్న దానికి , కలిసి పడుకునేదానికి, రెండిటికి దేనికి ఉండే అనుచరులు దానికి ఉన్నారు.కానీ నిపుణులు ఏ వైపు ఉన్నారు?

Should You Let Your Child Sleep With You

కలిసి పడుకోవడం వల్లని ప్రయోజనాలు

కలిసి పడుకోవడం వల్ల పిల్లలకి బాగా నిద్ర పడుతుందని, ప్రత్యేకంగా పసిపిల్లలకి మంచిగా మరియు గాఢమైన నిద్ర పడుతుందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఉద్యోగాలు చేస్తూ రోజంతా దూరంగా ఉండే తల్లిదండ్రులకి పిల్లలకు దగ్గరగా ఉండటానికి ఇది మంచి అవకాశం.కలిసి పడుకోవడం వల్ల పిల్లకు ఉన్న నిద్రకు సంబంధించిన సమస్యలు తాత్కాలికంగా తీరిపోతాయి.

ఇది పిల్లలని పెంచే తల్లికి కూడా, తమ నిద్రని పిల్లల నిద్రతో సమన్వయం చేసుకొని , పిల్లలకి తల్లి పాలిచ్చే పద్ధతిని తేలిక చేస్తుంది మరియు నిద్ర పోవటానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, కలిసి పడుకోవడం తల్లి పాలు తాగే పిల్లలకి ,తల్లులకి ఎక్కువ నిద్ర ఇవ్వడంలో సహాయ పడుతుంది కానీ, డబ్బా పాలు తాగే పిల్లలు మరియు తల్లులకి కాదని చెప్తుంది.ఈ అధ్యయనంలో, బిడ్డ, పాలిచ్చే తల్లులు కలిసి పడుకోవడం వల్ల ఎక్కువసేపు పడుకుంటున్నారు. కానీ డబ్బా పాలిచ్చే తల్లుల నిద్ర వాళ్ళ పిల్లలు ఎక్కడ పడుకుంటున్నారన్న దాని మీద ప్రభావితమై లేదు.

Should You Let Your Child Sleep With You

కలిసి పడుకోవడం వలన వచ్చే ప్రమాదాలు

జాతీయ ప్రజా రేడియో లో వచ్చిన యేల్ మెడిసిన్ విశ్వవిద్యాలయం యొక్క పిల్లల డాక్టర్ ఇంటర్వ్యూ ప్రకారం, నిపుణుల భయపడేది ప్రమాదవశాత్తు జరిగే ఊపిరి ఆడకపోవడం వంటివి జరిగే అవకాశాల గురించి.ఒకసారి పడుకున్నాక , తల్లికి లేదా తండ్రికి స్పృహ లేకపోవడం వల్ల రాత్రి ఎంత కదులుతారో అవగాహన ఉండదు.

తల్లిదండ్రులు సోయ తెలీకుండా పడుకోవడం

పిల్లలు మంచం మీద ఒక్కోసారి పరుపు, దిండ్లూ లేక వేరే వస్తువుల మధ్యలో పడి ఇరుక్కుపోతారు.ఒక్కోసారి పిల్లల తల మంచపు రైలింగ్స్ మధ్య ఇరుక్కుపోవచ్చు, ఎందుకంటే మంచాలు పిల్లల జాగ్రత్తని దృష్టిలో పెట్టుకొని తయారు చేయరు కాబట్టి.

Should You Let Your Child Sleep With You

నీటి మంచాలతో ఊపిరి ఆడకపోవడం

పిల్లలు మంచపు దుప్పట్లలో అల్లుకుపోయి చిక్కుకుపోవడం..ఇలాంటి అకారణమైన భయపెట్టే సంఘటనలు అంతులేనివి.ఆకస్మికంగా పిల్లలు చనిపోయే సిండ్రోం (సిడ్స్) పిల్లల మరణాలకి ప్రధాన కారణం.కానీ ఈ మధ్య కాలంలో, సిడ్స్ సిండ్రోం వల్ల చావులు తగ్గి, ప్రమాదవశాత్తు ఊపిరి ఆడకపోవడం వంటి వాటివలన కలిగే చావులు ఎక్కువ అయ్యాయి.

24 రాష్ట్రాలలో 2004 నుంచి 2012 వరకు చేసిన ఒక అధ్యయనం ప్రకారం (జాతీయ శిశు మరణాల సమీక్షా మరియు నివారణా కేంద్రం ఆధారంగా)మంచం పంచుకోవడం లేక కలిసి పడుకోవడం వల్ల 6 ఏళ్ళ లోపు పిల్లలలో నిద్రకు సంబంధించిన మరణాలు ఎక్కువ జరుగుతున్నట్టు ధృవీకరించింది.ఒకవేళ కలిసి పడుకుంటున్న ఆ పెద్ద మనిషి తాగుడూ, ధూమపానం లేదా మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నవారైనా లేదా మందుల ప్రభావంతో నియంత్రణ కోల్పోయిన వాడైనా అయితే ప్రమాదం మరింత ఎక్కువ.

English summary

Should You Let Your Child Sleep With You?

Should You Let Your Child Sleep With You?Many countries and cultures in Asia, Central America, South America, Africa, and even southern Europe consider co-sleeping as perfectly natural. Some movements in the West like the Natural Child Project are also working to bring co-sleeping to more families worldwide.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more