For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ వైట్ రైస్ తింటే పిల్లలు లావుగా పుడతారా?

By Ashwini Pappireddy
|

తెల్ల బియ్యం వంటి శుద్ధి చేయబడిన ధాన్యాలతో తయారుచేసిన ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల, వారి పిల్లలకు ఏడు సంవత్సరాల వయసులో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం ప్రకారం రుజువైంది. అలాగే మధుమేహం ఉన్నటువంటి మహిళలకు జన్మించిన పిల్లలు కూడా ఊబకాయం రిస్క్ లో పడుతారు.

పొట్టు తొలగించిన(శుద్ధి చేసిన) ధాన్యాలు మరియు అవసరమైన పిండి పదార్థాలు టైప్ 2 మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బులతో సంబంధం కలిగి ఉన్నాయి.

rice during pregnancy

మీరు తినే బియ్యంలో కల్తీ వుందా? సాధారణ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలి?

గర్భధారణ సమయంలో మధుమేహం లేదా అధిక బ్లడ్ షుగర్ కలిగిన స్త్రీలకు జన్మించిన పిల్లలు రిఫైండ్ రైస్ లేదా శుద్ధి చేసిన ధాన్యం (రోజుకు 37 గ్రాముల కన్నా తక్కువ)ని తీసుకున్న తల్లులతో పోల్చినప్పుడు, శుద్ధి చేయబడిన (రోజుకు 156 గ్రాముల కంటే ఎక్కువ ) ధాన్యంను తీసుకున్న వారి పిల్లలు 7 ఏళ్ల వయస్సులో ఊబకాయం కలిగి ఉంటారని పరిశోధనల లో వెల్లడైంది.

rice during pregnancy

వైట్ రైస్ తినకపోవడం వల్ల పొందే 8గొప్ప ప్రయోజనాలు

తల్లి గర్భానికి, పిల్లల ఊబకాయంకు మధ్య ఉన్న సంబంధం ఏంటో, పిల్లల బరువును ప్రభావితం చేసే కారకాల నియంత్రణ 7 ఏళ్ళుగా కొనసాగుతోంది. శారీరక శ్రమతో పాటు కూరగాయలు, పండ్లు, తీపి పదార్థాలు వంటి వాటిని తినడం వలన అవి పిల్లల బరువు మీద ప్రభావితం చేస్తాయని US లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్లో చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ యునిస్ కెన్నెడీ షిర్వర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లోని క్యులీన్ జాంగ్ అనే అతడు తెలియజేసాడు.

rice during pregnancy

బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ లో ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువ!

జంతువులపై జరిపిన ప్రయోగాల ఆధారంగా, కార్బోహైడ్రేట్లు గర్భాశయంలో విడుదల చేయడం వలన సంతానానికి ఊబకాయం వచ్చే ప్రమాదముందని సూచిస్తోంది. పోషక ప్రోగ్రామింగ్ అనేది ఊబకాయం రావడంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, 918 తల-శిశువు జంటలను రికార్డులను బృందం పోల్చింది.

IANS ద్వారా సేకరించబడినది.

English summary

Eating White Rice During Pregnancy Could Up The Risk OF Obesity In Kids!

Children born to women with gestational diabetes and whose diet included high proportions of refined grains, may have a higher risk of obesity.
Desktop Bottom Promotion