For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన గర్భం పొందాలంటే...ఇవి పాటించాల్సిందే!

By Madhavi Lagishetty
|

గర్భం...స్త్రీలకు మరొక జన్మ. గర్భం చాలా సంక్లిష్ట సమస్యలతో కూడిన దశ. గర్భం దాల్చాలంటే సరైన సమయం ఉంటుంది...అంటే సరైన వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, మానసిక పరిస్థితులు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని బిడ్డను కనేందుకు సిద్ధంకావాలి. అయితే మీరు ఆరోగ్యవంతమైన గర్భాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటే...మీరు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే గర్భంలోని శిశువు ఆరోగ్యంగా బయటకు వస్తుంది. గర్భవతి అయిన ప్రతి స్త్రీకి ఒక మ్యాజికల్ ఫీలింగ్ ఉంటుంది.

కానీ మీరు గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన దశలను పాటించకపోతే...మీ సంతోషంగా ఉండలేరు. గర్బాన్ని ధరించిన రోజుల్లో ఒత్తిడి మరియు టెన్షన్స్ ను దరికి చేరనీయకండి. వాటిని దూరంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం సంతోషంగా గడపండి.

గర్భదారణ సమయంలో గర్భిణీ కొరకు టాప్ 10 హెల్తీ స్నాక్స్గర్భదారణ సమయంలో గర్భిణీ కొరకు టాప్ 10 హెల్తీ స్నాక్స్

మీతోపాట మీ శిశువు కూడా ఆరోగ్యంగా ఉండటం మంచిది. మీ గర్భవతిగా ఉన్నప్పుడు పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే...మీ బిడ్డ యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తాయి.

గర్భంలో ఉన్నప్పుడు మీ బిడ్డకు అవసరమైన పోషకాలు అందించాలి. మీ ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నట్లయితే..మీ గర్భంలోని శిశువు కూడా ఎలాంటి సంఘర్షణలు లేకుండా పెరుగుతుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు మీరు అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. మీ గర్భాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. అంతేకాదు మీ బిడ్డ యొక్క ఆరోగ్యం, మానసిక, శారీరక అభివ్రుద్ధికి దోహదం చేస్తాయి.

గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

అయితే మీరు ఆరోగ్యవంతమైన గర్భం గురించి తెలుసుకోవల్సిన అంశాలను చదవండి.

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోండి...

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోండి...

మీరు గర్భధారణ సమయంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు మీ శిశువు పెరుగుదలకు దోహదం చేస్తాయి. వీటిల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తాయి.

డైట్ లో ఐరన్ ఉండేలా చూసుకోండి...

డైట్ లో ఐరన్ ఉండేలా చూసుకోండి...

గర్భవతిగా ఉన్నప్పుడు ఐరన్ అనేది చాలా ముఖ్యం. ఐరన్ తక్కువ స్థాయిలో ఉంటే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు మీ పుట్టబోయే బిడ్డమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ డాక్టర్లు ఇచ్చిన ఐరెన్ సప్లిమెంట్లను నిరంతరం వాడుతుండాలి. ఐరెన్ ట్యాబ్లెట్లతోపాటు కాయధ్యానాలు, మాంసం ఎక్కువగా తీసుకోండి. విటమిన్ సి, ఎక్కువగా ఉన్న నారింజ, నిమ్మకాయలను ఆహారంలో తీసుకోండి వీటి వల్ల ఐరెన్ ఎక్కువగా ఉంచేందుకు సహాయం చేస్తాయి.

ఎక్కువ నీరు తాగాలి....

ఎక్కువ నీరు తాగాలి....

గర్బవతిగా ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. మీరు ఎక్కడికి వెళ్లినా..మీతో ఓ బాటిల్ వాటర్ ను వెంటబెట్టుకోవడం మంచిది. మీరు మరింత రిఫ్రెష్ కావడానికి నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ లు మరియు హెర్బల్ టీలు కూడా డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుతాయి. అయితే గర్భధారణ సమయంలో కెఫిన్ తయారు చేసిన డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.

ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి...

ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి...

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు ఫోలిక్ ఆసిడ్ ట్యాబ్లెట్లు చాలా ముఖ్యమైన పోషక పదార్థంగా పనిచేస్తాయి. గర్భం పొందాలనుకున్న ఆరు నెలల ముందు నుంచే ఫోలిక్ ఆసిడ్ ట్యాబ్లెట్లు వాడాలని మీ డాక్టర్ సూచిస్తారు.

ఆరోగ్యకరమైన ఫుడ్ ను తినండి...

ఆరోగ్యకరమైన ఫుడ్ ను తినండి...

గర్భవతిగా ఉన్నప్పుడు తయారు చేయబడిన ఆహారం కంటే...తాజా పండ్లను తీసుకోవడం ఎంతో మేలు. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ను ఒక జార్ లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఆకలి వేసినప్పుడు వాటిని తినడం బెట్టర్. ఇక రాత్రిపూట వికారం మరియు వాంతులు కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. అల్పాహారంగా బిస్కెట్లు, బ్రెడ్ లాంటివి తీసుకోవడం మంచిది.

కావాల్సినంతగా పడుకోండి...

కావాల్సినంతగా పడుకోండి...

గర్భధారణ సమయంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో నిద్ర చాలా తక్కువగా వస్తుంది. గర్భం పెరుగుతున్నా కొద్ది నిద్ర సరిగ్గా రాదు. పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. స్లీపింగ్ పిల్లోపై పడుకోవడానికి ప్రయత్నించండి.

వ్యాయామం....

వ్యాయామం....

మీ రోజు చేసే వ్యాయామాన్ని కొనసాగించడం కష్టంగా ఉంటుంది. చురుకుగా ఉండటానికి నెమ్మదిగా నడవడం ప్రారంభించండి. మీ శరీరం సహాకరిస్తే...జాగ్ చేయండి. మీ డాక్టర్ ను అడిగి వ్యాయామాన్ని గురించి సలహాలు తీసుకోండి.

English summary

Steps For A Healthy Pregnancy

If you are trying to get pregnant, then these are the best steps for a healthy pregnancy. Read to know what are the steps for a healthy pregnancy.
Desktop Bottom Promotion