For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేసన్ హల్వా తయారీ ః ఇంటి వద్దనే సెనగపిండి హల్వా తయారీ ఎలా

సెనగపిండి హల్వా సులువైనది మరియు ఇంటి వద్దనే పండగలప్పుడు చేసుకోవచ్చు. ఈ పిండితో చేసుకునే హల్వా ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకోండి. వీడియోలో సెనగపిండి హల్వా ఇంటివద్దనే ఎలా తయారుచేసుకోవచ్చో చిత్రాల సాయంతో క

Posted By: Deepthi
|

పండగలకి చేసుకునే ఈ పంజాబీ స్వీటు వంటకం సెనగపిండి హల్వా మరింత రుచికరంగా దానిలో వేసే అధిక జీడిపప్పులు, కిస్మిస్ లు, దేశవాళీ నెయ్యితో మారుతుంది. కస్టర్డ్ కి, గట్టి హల్వాకి మధ్యరకంగా ఈ స్వీటు ఉంటుంది.

ఇది ఇంట్లోనే ఎక్కువ శ్రమలేకుండా తయారుచేసుకోవచ్చు. ఇది వండుతున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు తప్పక నోరూరించేలా చేస్తాయి. మీ స్వీట్లు తినాలనే కోరిక తీర్చుకోడానికి ఇది మంచి పద్ధతి కూడా.ఇంట్లోనే సెనగపిండి హల్వా తయారీని వీడియోలు, చిత్రాలతో నేర్చుకోండి.

సెనగపిండి హల్వా తయారీ వీడియో

సెనగపిండి హల్వా తయారీ । సెనగహల్వా ఎలా చేయాలి । ఇంటివద్దనే హల్వా తయారీ పద్ధతి । పిండితో హల్వా తయారీ
సెనగపిండి హల్వా తయారీ । సెనగహల్వా ఎలా చేయాలి । ఇంటివద్దనే హల్వా తయారీ పద్ధతి । పిండితో హల్వా తయారీ
Prep Time
5 Mins
Cook Time
30M
Total Time
35 Mins

Recipe By: రీతా త్యాగి

Recipe Type: స్వీట్లు

Serves: 3కి

Ingredients
  • సెనగపిండి - 1 చిన్న కప్పులో

    నెయ్యి - 1/2 చిన్న కప్పు

    పంచదార - 1 చిన్న కప్పు

    నీళ్ళు - 2 1/2 చిన్న కప్పులు

    ఏలకులు - 2లేదా 3

    జీడిపప్పులు - 1 చెంచా

    కిస్మిస్ లు - అలంకరణకి

How to Prepare
  • 1. వేడిచేసిన కడాయిలో సెనగపిండి వేసి అది బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ ఉండండి.

    2. నెయ్యి, పంచదార, వేసి బాగా కలపండి.

    3. అయ్యాక నీళ్ళు కూడా పోసి కలపండి.

    4. ఉడకనివ్వండి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న సమయంలో, ముద్దలు రాకుండా బాగా కలుపుతూనే ఉండండి.

    5. కడాయిని స్టవ్ మీదనుంచి దించేసి చల్లబడనివ్వండి.

    6. అదే సమయంలో, ఏలకులను పొడిచేయండి.

    7. హల్వాపై ఆ పొడిని చల్లండి.

    8. జీడిపప్పులు, కిస్మిస్ లతో అలంకరించండి.

Instructions
  • 1. నీళ్ళు పోసేముందే పంచదార వేయండి. దానివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది.
  • 2. సెనగపిండి, నెయ్యి, పంచదార ఎంత ఉన్నాయో అంత నీరు మాత్రమే ఉండేట్లా చూసుకోండి.
  • 3. పంచదార బదులు బెల్లం వేసినా కొత్త రుచి వస్తుంది.
  • 4. దీన్ని ఇతర పిండిలతో కూడా చేసుకోవచ్చు.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1చిన్న కప్పు
  • క్యాలరీలు - 210
  • కొవ్వు - 9.0 గ్రాములు
  • ప్రొటీన్ - 5.2 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 27.3 గ్రాములు
  • చక్కెర - 26.62 గ్రాములు
  • ఫైబర్ - 2.1 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - సెనగపిండి హల్వా తయారీ ఎలా

1. వేడిచేసిన కడాయిలో సెనగపిండి వేసి అది బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ ఉండండి.

2. నెయ్యి, పంచదార, వేసి బాగా కలపండి.

3. అయ్యాక నీళ్ళు కూడా పోసి కలపండి.

4. ఉడకనివ్వండి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న సమయంలో, ముద్దలు రాకుండా బాగా కలుపుతూనే ఉండండి.

5. కడాయిని స్టవ్ మీదనుంచి దించేసి చల్లబడనివ్వండి.

6. అదే సమయంలో, ఏలకులను పొడిచేయండి.

7. హల్వాపై ఆ పొడిని చల్లండి.

8. జీడిపప్పులు, కిస్మిస్ లతో అలంకరించండి.

[ 4.5 of 5 - 100 Users]
English summary

సెనగపిండి హల్వా తయారీ । సెనగపిండి హల్వా ఎలా వండాలి । ఇంట్లో తయారుచేసుకునే సెనగపిండి హల్వా తయారీ । పిండితో హల్వా వంటక పద్ధతి

Besan ka halwa recipe is a festive Indian sweet that can easily be made at home. Learn how to prepare this homemade gram flour halwa.
Desktop Bottom Promotion