For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసరపప్పు హల్వా తయారీ : పెసరపప్పు షీరా ఎలా తయారుచేయాలి

పెసరపప్పు హల్వా రాజస్థాన్ వారి ప్రత్యేక వంటకం. ఇది శీతాకాలాల్లో, పండగల సమయాల్లో ముఖ్యంగా చేసుకుంటారు. పండగల కోసం మీరు కూడా హెసరు బేలే హల్వా తయారు చేయటం నేర్చుకోండి. బొమ్మలు, వీడియోల సాయంతో మీరు కూడా ప

Posted By: Deepthi
|

పెసరపప్పు హల్వా సంప్రదాయ రాజస్థానీ వంటకం. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ వండుకుంటారు. ప్రతి ఉత్తరాది భోజనంలో ఇది భాగం. పెసరపప్పు పొడి, నెయ్యి, చక్కెర, అనేకంగా డ్రైఫ్లూట్లను వేసి దీన్ని తయారుచేస్తారు.

కర్ణాటకలో ఈ వంటకాన్ని హెసరు బెలె హల్వా అని కూడా అంటారు. పండగల సమయాల్లో ప్రత్యేకంగా వండుకునే ఈ స్వీటులో ప్రొటీన్లు అధికం, అందువల్ల ఆరోగ్యకరం కూడా. ఇది ప్రతిరోజూ భోజనంలో కూడా తీసుకోవచ్చు.

సాధారణంగా ఈ పెసరపప్పు షీరాను పాలతో చేస్తారు కానీ మేము ఇక్కడ పాలు లేకుండా చేస్తున్నాం. వండేటప్పుడు పూర్తి ధ్యాసతో దీన్ని కలుపుతూనే ఉండాలి. గంట వరకూ సమయం పట్టినా చేయడానికి, నిజానికి రుచితో పోల్చుకుంటే అంత టైం కూడా వృధా ఏం కాదు.

మీరు ఈ స్వీట్ ను ఇంట్లో తయారుచేయాలనుకుంటే, కింద ఇచ్చిన తయారీ విధానంలోని వరుస పాయింట్ల ప్రకారం చేయండి. బొమ్మలు, వీడియోల సాయంతొ కూడా ఈ పెసరపప్పు హల్వా తయారుచేయండి.

పెసరపప్పు హల్వా తయారీ వీడియో

పెసరపప్పు హల్వా తయరీ । రాజస్థానీ పెసరపప్పు హల్వా తయారీ ఎలా । పెసరపప్పు షీరా తయారీ
పెసరపప్పు హల్వా తయారీ । రాజస్థానీ పెసరపప్పు హల్వా తయారీ ఎలా । పెసరపప్పు షీరా తయారీ
Prep Time
4 Hours
Cook Time
45M
Total Time
4 Hours45 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: ఇద్దరికి

Ingredients
  • పసుపుపచ్చ పెసరపప్పు - 1 కప్పు

    నీరు - 1/2 కప్పు

    నెయ్యి - 3/4వ కప్పు

    పంచదార -1 కప్పు

    ఏలకుల పొడి - చిటికెడు

    బాదం ముక్కలు- 3-4 (అలంకరణకి)

    కుంకుమపువ్వు రేకులు - 3-4 ( అలంకరణకి )

How to Prepare
  • 1. పెసరపప్పును గిన్నెలో తీసుకుని , 3-4 గంటలపాటు నానబెట్టి, మిగతానీరును తీసెయ్యండి.

    2. పప్పును మిక్సీలో వేసి, 1 చెంచా నీరు వేయండి.

    3. మిక్సీలో బాగా రుబ్బండి.

    4. దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకుని అరకప్పు నెయ్యిని జతచేయండి.

    5. బాగా కలపండి.

    6. ఈ మిశ్రమాన్ని వేడిచేసిన కడాయిలో పోయండి.

    7. మధ్యని మంటపై దీన్ని ఆపకుండా కలుపుతూ, ఉండలు కట్టకుండా చూసుకోండి.

    8. బంగారు రంగులోకి మారేవరకు ఈ మిశ్రమాన్ని అలానే ఉంచండి. మిశ్రమం రంగు, రూపం రెండూ మారతాయి.

    9. పావు కప్పు నెయ్యి వేసి బాగా కలపండి.

    10. మిశ్రమం పూసల లాగా వచ్చేంతవరకూ, నెయ్యి బయటకి కారుతోందని అన్పించేవరకూ కలపండి. సన్నని మంటపై ఉడకనివ్వండి.

    11. అదే సమయంలో, పంచదారను ఒక పాన్ లో వేసి వెంటనే నీరు పోయండి. కేవలం పంచదార మునిగేంత నీరు మాత్రమే.

    12. పంచదార కరిగి, పాకం మరీ గట్టిగా లేదా జారుగా లేకుండా చూసుకోండి.

    13. పప్పు మిశ్రమంలో దీన్ని పోయండి.

    14. కొన్ని నిమిషాలు కలిపి, హల్వా కడాయి అంచులను దాటి పోతున్నప్పుడు ఆపండి.

    15. ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపండి.

    16. తరిగిన బాదం పప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించి, అందరికీ పెట్టండి.

Instructions
  • 1. పెసరపప్పును నానబెట్టేముందు బాగా కడగాలి.
  • 2. నెయ్యిని చల్లగా ఉన్న పెసరపప్పు పిండిలో వేయాలి. వేడి కడాయిలో కూడా వేయచ్చు కానీ మాడిపోయే అవకాశాలు ఎక్కువ.
  • 3. వండేటప్పుడు కొబ్బరి పొడి లేదా పాలను మిశ్రమానికి జతచేయవచ్చు.
  • 4. పంచదారపాకం సన్నని తీగలుగా రావాలి.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 320 కాలరీలు
  • కొవ్వు - 14 గ్రాములు
  • ప్రోటీన్లు - 7 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 40 గ్రాములు
  • పంచదార - 25 గ్రాములు
  • ఫైబర్ - 4 గ్రాములు

పెసరపప్పు హల్వా తయారీ విధానం - వరుస పాయింట్లతో.

1. పెసరపప్పును గిన్నెలో తీసుకుని , 3-4 గంటలపాటు నానబెట్టి, మిగతానీరును తీసెయ్యండి.

2. పప్పును మిక్సీలో వేసి, 1 చెంచా నీరు వేయండి.

3. మిక్సీలో బాగా రుబ్బండి.

4. దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకుని అరకప్పు నెయ్యిని జతచేయండి.

5. బాగా కలపండి.

6. ఈ మిశ్రమాన్ని వేడిచేసిన కడాయిలో పోయండి.

7. మధ్యని మంటపై దీన్ని ఆపకుండా కలుపుతూ, ఉండలు కట్టకుండా చూసుకోండి.

8. బంగారు రంగులోకి మారేవరకు ఈ మిశ్రమాన్ని అలానే ఉంచండి. మిశ్రమం రంగు, రూపం రెండూ మారతాయి.

9. పావు కప్పు నెయ్యి వేసి బాగా కలపండి.

10. మిశ్రమం పూసల లాగా వచ్చేంతవరకూ, నెయ్యి బయటకి కారుతోందని అన్పించేవరకూ కలపండి. సన్నని మంటపై ఉడకనివ్వండి.

11. అదే సమయంలో, పంచదారను ఒక పాన్ లో వేసి వెంటనే నీరు పోయండి. కేవలం పంచదార మునిగేంత నీరు మాత్రమే.

12. పంచదార కరిగి, పాకం మరీ గట్టిగా లేదా జారుగా లేకుండా చూసుకోండి.

13. పప్పు మిశ్రమంలో దీన్ని పోయండి.

14. కొన్ని నిమిషాలు కలిపి, హల్వా కడాయి అంచులను దాటి పోతున్నప్పుడు ఆపండి.

15. ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపండి.

16. తరిగిన బాదం పప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించి, అందరికీ పెట్టండి.

[ 3.5 of 5 - 36 Users]
English summary

Moong Dal Halwa Recipe | How To Make Rajasthani Moong Dal Ka Halwa | Moong Dal Sheera Recipe | Hesaru Bele Halwa

Moong dal halwa is an authentic Rajasthani sweet that is prepared mainly during festivals and is a winter favourite. Learn to make the hesaru bele halwa
Desktop Bottom Promotion