Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రంజాన్‌లో మాసంలో మటన్ హలీమ్ వేరీ స్పెషల్: ఘుమఘుమలాడిస్తూ..నోరూరించే మటన్ హలీమ్ ఒక్కసారైనా టేస్ట్ చూడాల్సిందే.
Mattun Haleem Recipe: రంజాన్ ఉపవాస మాసం మాత్రమే కాదు, ఈ మాసంలో అనేక రుచికరమైన మరియు నోరూరించే వంటకాలు కూడా తయారుచేస్తారు. నాన్ వెజ్ లో చాలా వంటలు తయారు చేస్తారు. అటువంటి పాత మరియు సాంప్రదాయ వంటకంలో హలీమ్ ఒకటి.
ఈ వంటకం రంజాన్‌లో రాత్రి భోజనం మరియు సెహ్రీ సమయంలో చాలా ఉత్సాహంగా తింటారు, అయితే ఈ వంటకం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హలీమ్ గురించి తెలియని లేదా రుచి చూడని వారిలో మీరు కూడా ఉన్నారు, కాబట్టి, ఈ రోజు మీకోసం మటన్ హలీంను పరిచయం చేస్తున్నాం.
హలీమ్ అంటే ఏమిటి
హరీస్ అనే ప్రసిద్ధ అరబిక్ వంటకం నుండి హలీమ్ ఉద్భవించింది...ఇది
భారతదేశంలోని నిజాం సైన్యానికి చెందిన అరబ్ సైనికులు హైదరాబాద్
నగరానికి పరిచయం చేయబడింది.ఇది మాంసం మరియు తృణధాన్యాల గంజితో తయారు
చేయబడింది. ఇది కనిపించేంత రుచికరమైనది . కానీ దీన్ని తయారు చేయడం
అస్సలు సులభం కాదు. తక్కువ చెక్క మంటపై గంటల తరబడి ఉడికించాలి.
పూర్తిగా సిద్ధం కావడానికి సాధారణంగా 10 నుండి 12 గంటలు పడుతుంది.
దీన్ని నిరంతరం కలబెడుతుండాలి, అప్పుడే రుచికరమైన హలీమ్ రెడీ
అవుతుంది.. అయితే ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్లో త్వరగా తయారవుతుంది..
మనం ప్రెజర్ కుక్కర్ లో సులభంగా తయారుచేసుకోగల మటన్ హలీగురించి
తెలుసుకుందాం. మీరు కూడా ట్రై చేసి, రుచి చూసీ మీ అభిప్రాయన్ని మాతో
పంచుకోండి.
కావలసిన పదార్థాలు
మటన్ : 1kg
గోధుమ రవ్వ: 1/2kg
చనా పప్పు(శెనగపప్పు) ; 1/2cup
పెసర పప్పు; 1/2cup
మూంగ్ పప్పు; 1/2cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
ఎర్ర మిరపకాయ పొడి: 3tsp
పసుపు పొడి: 3tsp
ధనియాల పొడి: 3tsp
పెద్ద ఏలకులు: 3
తరిగిన ఉల్లిపాయలు: 5
జీలకర్ర: 1 tsp
నల్ల మిరియాలు : 8 నుండి 10
గరం మసాలా పొడి: 1tsp
పుదీనా ఆకులు: అవసరం మేరకు
కొత్తిమీర తరుగు: అవసరం మేరకు
నిమ్మకాయ
ఉప్పు: రుచికి సరిపడా
ఒక కప్పు నూనె
హలీమ్ తయారుచేయు విధానం:
1. హలీమ్ చేయడానికి, రవ్వని(పెద్ద రవ్వ) నీటిలో 8 గంటలు
నానబెట్టండి.
2. పప్పులన్నీ మరో పాత్రలో 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి.
3. ప్రెజర్ కుక్కర్‌ను గ్యాస్‌పై ఉంచి, నానబెట్టిన పప్పు మరియు
గోధుమరవ్వను వేయండి.
4. తర్వాత అందులోనే కాస్త నీళ్లు, ఉప్పు వేసి కుక్కర్లో
మూతపెట్టాలి.
5. 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక
కలపాలి.
6. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్, కొంచెం నీళ్ళు, ఉప్పు, ఎర్ర
కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లవంగం, యాలకులు వేసి మూడు
విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
7. ఇప్పుడు ఒక పెద్ద బాణలిలో నూనె వేసి, ఉల్లిపాయను ముక్కలు వేసి, లేత
గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
8. అదే నూనెలో మసాలాలు మరియు సిద్ధం చేసిన మటన్ వేసి 10 నుండి 15
నిమిషాలు వేయించాలి.
9. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి.
10. ఈ మిశ్రమం మొతం 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.
11. 10 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి పోయాక మూత తీసి రుచి
చూసి, ఉప్పుకారసం సరిచూసుకోవాలి.
12. గరం మసాలా పొడి చల్లి, నిమ్మకాయ చాట్ మసాలా, ఉల్లిపాయ మరియు పచ్చి
కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మటన్ హలీమ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













