మాటలతో కాకుండా చేతలతో ప్రేమను చూపే పద్దతులు మీకు తెలుసా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చేతలు మాటలకన్నా ఎక్కువ మాట్లాడతాయి! మీరు ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తుంటే, మీ పదాల కన్నా చేతలు ఎక్కువ ప్రేమను వ్యక్తం చేస్తాయి. ఇది ముఖ్యంగా పెళ్ళితర్వాత ఎక్కువ నిజమవుతుంది.

మీరు ఎవరినైనా డేటింగ్ చేస్తుంటే, మీ శరీరం,మెదడులో తెలియని ఆనందంతో అన్నీ అందంగా,ప్రేమగానే కన్పిస్తాయి. కానీ అసలు కథ ఆ ఉత్సాహం తగ్గాక, హనీమూన్ దశ దాటాక మొదలవుతుంది.

బాయ్ ఫ్రెండ్ ప్రేమను ప్రదర్శించటానికి 10 మార్గాలు

అప్పుడే మీ చేతలు ఎక్కువ వ్యక్తీకరిస్తాయి. మీరు మీ భాగస్వామి అందాన్ని పొగుడుతూ కవిత్వం రాయాల్సిన అవసరం ఏం ఉండదు, కానీ ఆమె పనివత్తిడిలో ఉన్నప్పుడు కొంచెం మసాజ్ చేయండి. అలాంటి పనులు ఉట్టి పదాలకన్నా ఎక్కువ ప్రేమను వ్యక్తీకరిస్తాయి.

చేతలు పదాలకన్నా ఎక్కువ మాట్లాడే మరికొన్ని సంఘటనలు.

ఇది ఒకసారి ప్రయత్నించండి..

ఇది ఒకసారి ప్రయత్నించండి..

అతను ఇంటికి రాగానే, మీరు చేయాలసిన పనుల లిస్టు (షాపింగ్, ఇల్లు శుభ్రపర్చటం వంటివి) చదవడం మొదలుపెడితే, అతనికి చిరాకు రావచ్చు. దానికన్నా అతనికో గ్లాసు నీళ్ళు ఇచ్చి,కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి. అప్పుడు మీ పనుల లిస్టు చదవవచ్చు.అతని గురించి శ్రద్ధ తీసుకుంటున్నారనటానికి ఇది ఒక పద్ధతి.

ప్రేమగా వినండి

ప్రేమగా వినండి

కొన్నిసార్లు, మనుషులు అనేక పనికిరాని విషయాల గురించి మాట్లాడుతూనే ఉండాలనుకుంటారు. మీ భార్య ఆమె ఆఫీసు రాజకీయాలు, లక్ష్యాలు,వత్తిడి లేదా ఆమె స్నేహితురాలు ప్రెగ్నెన్సీ సమస్యల గురించి మాట్లాడుతూ ఉండటం ఊహించుకోండి.

మీకు బోర్ కొట్టడం సహజం.మీ బుర్ర తినవద్దని అనాలని కూడా అన్పిస్తుంది. కానీ సహనంగా వింటూ ఆమె చెప్పేది మీరు కూడా ఫీలైతే ఆమెపై ప్రేమను చేతలద్వారా చూపించినట్టు.

మీ మనసు బాలేనప్పుడు కూడా ఇతరులను సంతోషపడనివ్వటం

మీ మనసు బాలేనప్పుడు కూడా ఇతరులను సంతోషపడనివ్వటం

మీరు చాలా తలనొప్పితో ఇల్లు చేరుకుంటారు, మీ భార్యని తలపట్టమని అడుగుదాం అనుకుంటారు. కానీ మీరేదైనా అనేలోగానే, ఆమె తన తల్లిదండ్రులను కలవబోతున్నానని చెప్తుంది. మీరు మీ తలనొప్పి గూర్చి చెప్తే ఆమె ఆగిపోవచ్చు. కానీ మీరు ఆమెని వెళ్ళనిచ్చి తన కుటుంబంతో ఆమె సమయం గడిపేలా చేయాలనుకోవచ్చు. అది కూడా మౌనంగా మీ ప్రేమను చూపే ఒక పద్ధతి.

మీ భాగస్వామి అవసరాలకు మీవాటికన్నా ప్రాధాన్యతనివ్వటం

మీ భాగస్వామి అవసరాలకు మీవాటికన్నా ప్రాధాన్యతనివ్వటం

అన్ని బట్టలు మేడమీద ఆరేసారు, సడెన్ గా వర్షం మొదలైంది. పైకి పరిగెత్తి బట్టలు తేవాలనుకుంటారు. మీ బట్టలు తీసుకోకుండా మొదట మీ భార్య బట్టలు తడిసిపోకుండా తీసుకొస్తారు.

ఇది మీ ప్రేమను చూపే పద్ధతి మరియు దీన్ని మీ భార్య తప్పక గమనిస్తారు.మీ భార్యకి కావాల్సిన విషయాలు మీ వాటికన్నా ముందు పెట్టుకోవటం మాటలతో కాకుండా ప్రేమను ప్రదర్శించటం.

కఠినంగా మీ అభిప్రాయాలు చెప్పకుండా ఒక ప్రశంసనివ్వటం

కఠినంగా మీ అభిప్రాయాలు చెప్పకుండా ఒక ప్రశంసనివ్వటం

ఆమె ఎంతో ఆనందంగా, గర్వంగా తన కొత్త,ఖరీదైన హ్యాండ్ బాగ్ చూపించగానే, మీకు ‘దేశానికే పెద్ద చెత్త' వంటి కామెంట్లు చేయాలనిపించవచ్చు.కానీ మీ అభిప్రాయాలు పక్కన పెట్టి, కొంచెం ప్రశంసించడం చేతల ద్వారా ప్రేమను తెలపడానికి పెద్ద గుర్తు.

ఎవరైనా నిరుత్సాహపరుస్తుంటే ఉత్సాహపర్చడం

ఎవరైనా నిరుత్సాహపరుస్తుంటే ఉత్సాహపర్చడం

మీ భర్త వాషింగ్ మెషీన్ బాగుచేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆయన మరింత పనిని పెంచుతున్నారని తెలిసినా, ‘మీరు ఇది తప్పక ఎలాగోఅలాగ బాగుచేసేస్తారు' వంటి మాటలు మాట్లాడితే అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.

మీ భాగస్వామి అస్సలు ఊహించనప్పుడు వారిని థ్రిల్ చేయటం

మీ భాగస్వామి అస్సలు ఊహించనప్పుడు వారిని థ్రిల్ చేయటం

ఆమె తల్లిదండ్రులు ఇంటికి వస్తారు మరియు తను వారితో కబుర్లలో మునిగిపోతుంది. వారి సంభాషణని మధ్యలో ఆపటం కన్నా, మీరు అందరికీ కాఫీ కలిపి వెళ్ళి ఇస్తే ఏమీ చెప్పకుండా మీ ప్రేమను చూపించినట్టు. అది వారికి తప్పక నచ్చుతుంది.

English summary

Ways To Show Love Without Words

Can you show love without saying it? Well, actions speak louder than words! If you love someone deeply, your actions can convey love better than words
Story first published: Sunday, October 29, 2017, 14:00 [IST]
Subscribe Newsletter