For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి పండుగ సమయంలో పొంగల్ ని ఎందుకు తయారు చేస్తారు?

పండుగలకు భారతదేశం పుట్టినిల్లు వంటిది. ప్రతి పండుగ దాని యొక్క సొంత ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక డజను కన్నా ఎక్కువ పండుగలను ఏడాది పొడవునా భారతదేశంలో జరుపుకుంటారు, ఆ పండుగల యొక్క ప్రాముఖ్య

|

పండుగలకు భారతదేశం పుట్టినిల్లు వంటిది.

ప్రతి పండుగ దాని యొక్క సొంత ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక డజను కన్నా ఎక్కువ పండుగలను ఏడాది పొడవునా భారతదేశంలో జరుపుకుంటారు, ఆ పండుగల యొక్క ప్రాముఖ్యతను కోల్పోకూడదనేదే దాని యొక్క ప్రధాన ఉద్దేశం.

ప్రతి పండుగ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆహారపదార్థమును వేరొక పండగకు కేటాయించరు అనే విషయాన్ని మనము చాలా సులభంగా నిర్ధారించవచ్చు. అలా మన పూర్వీకులు అనుసరించిన మార్గాన్నే - ఈనాటికీ మనలాంటి వాళ్ళు చాలామంది కలసి అనుసరిస్తూ జరుపుకునే భారతీయ పండుగలకు (మన చిన్నతనం నుండి ప్రత్యేకంగా జరుపుతున్న) ప్రత్యేకమైన రుచిని, అభిరుచిని ఏర్పరిచాయి.

pongal on sankranti

ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రత్యేకతలని "మకర సంక్రాంతి" విషయంలో మరింత ఖచ్చితంగా పాటించబడుతున్నాయి. దేశంలోనే దాదాపుగా 16 రాష్ట్రాలలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో "మకర సంక్రాంతి" ఒకటి.

అస్సాం వంటి తూర్పు రాష్ట్రంలో 'బీహూ' అని, - ఉత్తరాదిన ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో 'లోహ్రి' అని, - తమిళనాడులో 'పొంగల్' అని, - గుజరాత్ లోని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క ప్రధాన పండుగలలో ఒకటని చెప్పడం చాలా సమంజసమైనది.

ఈ పండుగను చాలా విస్తృతంగా జరుపుకుంటారు, దానితో సంబంధించిన ఉన్న ఆహారపు అలవాట్లు అనేవి రాష్ట్రాల మధ్య చాలా భిన్నమైనవిగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలలో, ఈ పండుగ వేడుకల కోసం ఆచారబద్ధమైన "పొంగల్" అనే ప్రసాదంగాని ఉంచకపోతే అది పండుగలాగ కనపడదు.

కాబట్టి, అలాంటి ప్రాముఖ్యతలను గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ క్రింది విషయాలను చదవండి.

మనిషి జీవితం సుఖ-దుఃఖముల కలయిక :

మనిషి జీవితం సుఖ-దుఃఖముల కలయిక :

మకర సంక్రాంతి అనేది పంటకోతకు సంబంధించిన పండుగ మరియు భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత క్షేత్రం కనుక మన జీవితాలు చాలా మటుకు విత్తనాలు మరియు పంటల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ప్రాథమికంగా గుర్తించబడిన పొంగల్ అనేది రెండు రకాలుగా ఉంది, అది 1) సక్కెర పొంగల్ మరియు 2) వెన్ పోంగల్ అనే వంటకాల నుండి మీ నాలుక రుచి మొగ్గలకు అన్ని రకాలైన సువాసనలను కలిపి ఉన్న రుచిని ఇవ్వటానికే వీటిని ఉపయోగిస్తారు. ( ఒక రైతు విత్తును వేసిన దగ్గరనుంచి పంటకోతకు వచ్చే వరకు అతను పడే ఆరాటంతో పాటు, అలసట - నిరాశల నుండి ఆనందం - సాధించటం వరకు ఉన్న అన్ని రకాల భావాల కలయిక).

అత్యంత రుచికరమైన "వెన్ పోంగల్ను" సంప్రదాయమైన మార్గంలో నేటికీ తయారు చేయటం జరుగుతుంది.

ఆర్ధిక స్థిరత్వం :

ఆర్ధిక స్థిరత్వం :

పంటకోతకు వచ్చే సీజన్లో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. కాబట్టి, చాలామంది ఆర్థికంగా బాగా ఉండగలగటం వల్ల, ఇలాంటి ప్రత్యేకమైన వంటకాల తయారీలో అవసరమైన ఉత్తమమైన పదార్ధాలను కొనుగోలు చేయవచ్చు. సక్కెర పొగలుకు మంచి నాణ్యమైన బియ్యం, పెసరపప్పు, బెల్లం పాకం మరియు పాలను వేసి కలుపుతూ మృదువుగా ఉంటూ, క్రీముతో కూడిన రూపాన్ని కలిగి ఉండేలా తయారుచేస్తారు. చివరగా అందులో యాలకులు, లవంగాలు మరియు నేయ్యను వేసి అందరికీ వడ్డిస్తారు.

అందుబాటులో ఉండి సులభంగా దొరికే ఆహార పదార్థాలు :

అందుబాటులో ఉండి సులభంగా దొరికే ఆహార పదార్థాలు :

ఈ పండుగను పంటకోత ప్రారంభ కాలంలో జరుపుకుంటారు కాబట్టి, పొంగల్ తయారీకి అవసరమైన అన్ని రకాల పదార్ధాలు మార్కెట్ లో చాలా సులభంగా లభిస్తాయి.

అందువల్ల, రోజువారీ మెనులో ఈ పొంగల్ను కలిగి ఉండటం వల్ల ఇంటిలో ఉన్న స్త్రీలు దానికి అవసరమైన వస్తువులను కొనేందుకు అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తవలసిన అవసరము లేదు.

కాబట్టి, వారు భోజన పట్టికలో ఈ పొంగల్ను మాత్రమే కాకుండా వేరే రుచికరమైన భోజనములను చేర్చుకోవడం వల్ల విందును మరింత బాగా ఆస్వాదించడానికి ఎక్కువ సమయము మిగిలి ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు :

ఆరోగ్య ప్రయోజనాలు :

శీతాకాలం చిట్టచివరి దశలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు, ఈ కాలంలోనే ప్రజలందరిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది.

అందువల్ల ఈ కాలంలోనే వ్యాధులు మరియు అనారోగ్యాల వంటివి బాగా పెరుగుతున్నాయి. పొంగల్ తయారీలో వాడబడిన లవంగాలు, ఏలకులు వంటి పదార్థాలు ఒక వ్యక్తిలో రోగనిరోధకతను పెంచడానికి మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారి తీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి.

మంచి మానవ సంబంధాలు :

మంచి మానవ సంబంధాలు :

పొంగల్ తయారీ అనేది సుదీర్ఘమైన ప్రక్రియ, కాబట్టి ఇళ్లల్లో ఉన్న మహిళలందరూ తామే ఈ వంటకాన్ని అత్యుత్తముగా తయారు చేశామని, వారి ప్రాంతవాసులకు తెలియజేసేలా నిర్ధారించడానికి కలిసి కట్టుగా పనిచేస్తారు.

ఈ వంటకం ఇంట్లో ఉన్న మహిళలందరిలో మంచి ఐక్యతను పెంపొందిస్తుంది, నిజంగా ఇది ఒక సంతోషకరమైన ఇంటికి దారి తీస్తుంది.

మన ఆచార-సంప్రదాయాలను పాటించేలా :

మన ఆచార-సంప్రదాయాలను పాటించేలా :

ఈరోజుల్లో తల్లిదండ్రులిద్దరూ బాగా సంపాదించడం వల్ల, పిల్లలు వారికి కావాల్సిన జంక్ ఫుడ్స్ ను చాలా త్వరగా ఆస్వాదించగలుగుతున్నారు. మనము తీసుకునే ఆహారము విషయంలో చాలా కుటుంబాలు - పాశ్చ్యాత దేశాలలో తినేందుకు రుచిగా ఉన్నా ఆహారపదార్థాలనే, వారి ప్లేట్లలో కలిగి ఉంటున్నారు.

ప్రతీ మకర సంక్రాంతి పండుగ రోజు పోంగల్ను తయారు చేయడం ద్వారా, ఇంట్లో ఉన్న పిల్లలకు వారి సంస్కృతి, సంప్రదాయాల యొక్క కొత్త రుచిని తెలియజేసేలా చేస్తారు.

పరిపూర్ణమైన ఆహారం :

పరిపూర్ణమైన ఆహారం :

పోంగల్ తయారీకి అవసరమైన పదార్ధాలను మీరు లెక్కలోనికి తీసుకున్నట్లయితే, అది ఆరోగ్యాన్ని కలుగజేసే స్వచ్చమైన ఆహారమని మీరు గ్రహించవచ్చు. అందువలన, మకర సంక్రాంతికి పోంగల్ను తినడం ద్వారా, ఆ పవిత్రమైన రోజున మీ శరీరానికి కావలసిన పోషకాలను అన్నింటినీ కలిగి ఉంటారు.

అన్ని కుటుంబాలు ఒక చోట కలిసి, పండుగను ఆస్వాదించేదిగా :

అన్ని కుటుంబాలు ఒక చోట కలిసి, పండుగను ఆస్వాదించేదిగా :

ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న పిల్లలు పిజ్జాలను మరియు బర్గర్లను ఇష్టపడినంతగా వేరే వాటికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. వృద్ధుల్లాంటి వాళ్ళు అంత కారంగా ఉన్న ఆహారాలను తినలేరు, అలాంటి వారు మృదువుగా ఉన్న ఆహార పదార్ధాలను ఎక్కువగా ఇష్టపడతారు.

అందువల్ల, కుటుంబంలోని సభ్యులందరూ ఒకే రకమైన ఆహారాన్ని కలిగి ఉండటమనేది చాలా అరుదు. ఇలాంటి పరిస్థితిని మార్చడం కోసం పోంగల్ అనేది మన మధ్యలోకి వచ్చింది. ఇది ఆరోగ్యవంతమైనది మరియు రుచికరమైనది అనే అద్భుతమైన భావనను కలిగి ఉన్న కారణంగా దీనిని అన్ని రకాల వయస్సుల వారు తినడానికి ఇష్టపడతారు.

English summary

Why Is Pongal Prepared In Sankranti?

On the day of sankranti, the pongal recipe is prepared. But have you ever wondered why pongal is given at most importance, especially on the day of Makara Sankranti?
Story first published:Saturday, January 13, 2018, 12:54 [IST]
Desktop Bottom Promotion