For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసే బెస్ట్ హో రెమడీస్

|

ముఖం మీద సన్నని వెంట్రుకలుంటే చూడటానికి చాలా అసహ్యాంగా ఉంటుంది. ఫేషియల్ హెయిర్ ను తాత్కాలికంగా తొలగించుకోవడానికి చాలా మార్గాలున్నాయి, కానీ ఎన్ని సార్లని బ్యూటీ పార్లర్ల చుట్టు తిరుగుతారు? వ్యాక్సింగ్ చేయించుకోవడం, త్రెడ్డింగ్ మరియు ప్లక్కింగ్ ఈ మూడూ కూడా హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా సాధరణ పద్దతులు. ఇలా హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత తిరిగి కొద్ది రోజులకు ప్రారంభమవుతుంది.

ముఖంలో హెయిర్ ఉండటం వల్ల మిమ్మల్ని నల్లగా కనబడేలా చేస్తుంది, అసహ్యంగా మరియు శుభ్రంగా లేనట్లు చేస్తుంది. అందువల్ల, కొన్ని హోం మేడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్స్ ను ఉపయోగించడం చాలా మంచిది. హోం మేడ్ ఫేషియల్ రిమూవర్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు అవాంచిత బాడీ హెయిర్ మరియు పెదవుల మీద, చెంపల మీద ఉన్న అవాంచిత రోమాలను తొలగించడానికి ఈ హోం మేడ్ ఫేషియల్ రిమూవర్స్ బాగా సహాయపడుతాయి.

ముఖం మీద హెయిర్ తొలగించుకోవడానికి బ్లీచింగ్ చేసుకోవడం అంత మంచి పద్దతి కాదు, ముఖం మీద ఉన్న వెంట్రుకలను తొలగించడానికి బదులు, ముఖం మీద ఉన్న వెంట్రుకల రంగు(గోల్డెన్ హెయిర్ రంగు) మారుతుంది మరియు సన్ లైట్ గురైనప్పుడు చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది. మహిళల్లో అధిక టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఫెషియల్ హెయిర్ గ్రోత్ అధికంగా ఉంటుంది. మరి ఈ అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి కొన్ని పద్దతులను పాటిస్తే సులభంగా తొలగించుకోవచ్చు.

అప్టాన్:

అప్టాన్:

ఇది పాపులర్ హోం మేడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్, దీన్ని శెనగపిండి, పసుపు మరియు మస్టర్డ్ ఆయిల్ తో తయారు చేస్తారు. ఈ చిక్కటి పేస్ట్ ను ముఖానికి మసాజ్ చేయాలి. ఇది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడంతో పాటు చర్మం శుభ్రపరుస్తుంది మరియు చర్మంలో మంచి మెరుపును తీసుకొస్తుంది.

తేనె:

తేనె:

తేనె చాలా చిక్కగా ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి, కొద్ది సేపటి తర్వాత స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవాంచిత రోమాలు తొలగిపోతాయి. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి తేనెను డైరెక్ట్ గా అప్లై చేయవచ్చు. లేదా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు.

షుగర్:

షుగర్:

పంచదారను ముఖానికి స్ర్కబ్బింగ్ చేయడం వల్ల, ముఖం మీద ఉన్న అవాంచిత రోమాలు నేచురల్ గా తొలగిపోతాయి. పంచదార కూడా బంకగా చర్మానికి అతుక్కుంటుంది కాబట్టి, ఫేషియల్ హెయిర్ రిమూవ్ కు చాలా బాగా సహాయపడుతుంది.

లెమన్:

లెమన్:

నిమ్మ బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్, దీన్ని సరిగా ఉపయోగించడం వల్ల అలాగే ఫేషియల్ హెయిర్ కలర్ ను లైట్ చేస్తుంది. లెమన్ ను ఫర్ ఫెక్ట్ గా ఉపయోగించడం వల్ల ఫేషియల్ హెయిర్ ను క్లియర్ గా తొలగిస్తుంది.

 కార్న్ ఫ్లోర్:

కార్న్ ఫ్లోర్:

ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్ ను, షుగర్ మరియు ఎగ్ వైట్ వేసి బాగా గిలకొట్టి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది హోం మేడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్. దీని వల్ల ముఖం మీద హెయిర్ తొలగిపోవడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి.

 పసుపు:

పసుపు:

హెయిర్ గ్రోత్ ను తగ్గించడంలో దశాబ్దాల కాలం నంుడి వస్తున్న హోం రెమడీ. ఈ పసుపు పొడిని ముఖం కడుక్కోనేందుకు అరగంట ముందుగానే అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదా పసుపు, పెరుగు మరియు మస్టర్డ్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసి అప్లై చేయవచ్చు.

 మస్టర్డ్ ఆయిల్:

మస్టర్డ్ ఆయిల్:

ఆవనూనె మరో సాంప్రదాయకరమైన ఫేషియల్ హెయిర్ రిమూవర్. ఇది శరీరంలో అవాంఛిత రోమాను తొలగిస్తుంది. గోరువెచ్చని మస్టర్డ్ ఆయిల్ తో ముఖానికి మసాజ్ చేయాలి. డెడ్ స్కిన్ సెల్స్ ను రిమూవ్ చేస్తుంది మరియు ఫేషియల్ హెయిర్ ను నేచురల్ గా తొలగిస్తుంది.

 బ్రెడ్:

బ్రెడ్:

పాలలో బ్రెడ్ ను నానబెట్టి, దీన్ని ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఇది హెయిర్ ను రిమూవ్ చేయడంతో పాటు మిల్కీ వైట్ స్కిన్ ను పొందేలా చేస్తుంది.

English summary

Homemade Facial Hair Removers

Facial hair can look really embarrassing and can be a huge turn off. There are many ways of getting rid of facial hair temporarily, but for how long will you visit parlours? Getting waxed, threading and plucking are the three most common methods of hair removal.
Desktop Bottom Promotion