బరువు పెరగడం ఒత్తిడి వలన జరుగుతుందా? సైంటిస్ట్లు ఏమంటున్నారు.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఒత్తిడి అనేది ప్రస్తుతకాలంలో సాధారణ అంశమైపోయింది. కొందరు చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం వలన అధిక భారాలను మోస్తున్న అనుభూతికి లోనవడం కారణంగా ఒత్తిడికి గురవుతుంటారు. అధిక పని, కార్యక్రమాలు, పరీక్షలు మొదలైనవి ఒత్తిడికి అనేక ప్రతికూల ప్రభావిత అంశాలుగా ఉన్నాయి.

అసలు ఒత్తిడి అంటే ఏమిటి?

ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, కొన్ని ప్రతికూల అంశాలు మానసికంగా చిత్రవధకు గురి చేస్తుంటాయి. ఎవరో మన మీద దాడి చేస్తున్నట్లు, అభద్రతాభావాలకు గురవుతూ ఉంటారు. కానీ అంతర్గతంగా హార్మోనులు కూడా ఒత్తిడితో యుద్ధం చేస్తుంటాయి.

చుట్టుపక్కల పరిసరాల ఒత్తిళ్ళ వల్లనే, మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ ఈ ఒత్తిళ్ళు పెరుగుతున్నకొలదీ, నెమ్మదిగా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలే కాకుండా, అనేక ఆరోగ్య సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకాలుగా పరిణమిస్తుంటాయి కూడా.

Stress Is Linked With Weight Gain, Scientists Reveal

ఒత్తిళ్ళ గురించి హాన్స్ సేల్యేస్ చెప్పిన గాస్ మోడల్ ప్రకారం, ఒత్తిడి బరువు పెరగడం వలన కూడా వస్తుంది.

ఒత్తిడి పెరగడం వలన కలిగే అనారోగ్యాలలో బరువు పెరగడం అన్నిటికన్నా ప్రధానమైనది. అంతేకాకుండా మధుమేహానికి కూడా ప్రధాన కారణంగా ఈ ఒత్తిడి ఉన్నది. నిజానికి బరువు ఒత్తిడి వలెనే కాకుండా అనేక కారణాలవలన కూడా కలుగుతుంది, కాని ఒత్తిడి వలన పెరిగిన బరువును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకొనరాదు. ఒత్తిడి వలన పెరిగే బరువు గుండెపోటుకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కాన్సర్, మధుమేహం, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది.

ఈ ఒత్తిడులపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న అనేకమంది పరిశోధకుల అభిప్రాయాల ప్రకారం., ఒత్తిడి అనేది బరుపు పెరగడానికి మూలకారకంగా ఉంది.

ఒక వ్యక్తి అధిక ఒత్తిడితో భాదపడుతున్న ఎడల, ఆకలి దప్పికలను కోల్పోవడం జరుగుతుంది. కానీ ఆ ఒత్తిడి కాలంతో సంబంధం లేకుండా కొనసాగుతూ ఉన్న పరిస్తితుల్లో, అనగా నెలల వ్యవదిగా కొనసాగుతున్న ఎడల దీనిని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడులు అతిగా తినడానికి మొగ్గు చూపడం, అతిగా ఆకలికి గురవ్వడం వంటి అంశాలతో నిండి ఉంటాయి. తద్వారా మనసుకు తోచిన ఆహారాన్ని తమ ఆరోగ్యంతో సంబంధం లేకుండా తినుటకు మొగ్గు చూపుతుంటారు. తద్వారా ఊబకాయం సర్వసాధారణంగా వస్తుంది. దీనికి ఒత్తిడులు, హార్మోనుల హెచ్చుతగ్గులను అస్తవ్యస్తం చేయడమే కారణం.

ఒకవేళ వ్యక్తి దీర్ఘకాలిక ఒత్తిడులకు గురైన పక్షంలో, ఆ ఒత్తిడులను నియంత్రించుకునే పక్షంలో మనసు మనుగడ దిశగా ఆలోచనలు కొనసాగిస్తుంది. తద్వారా ఆహారం మీదకు మనసు వెళ్తుంది. తద్వారా వికారమైన ఆకలికి గురవ్వడం, తద్వారా ఆలోచన స్థాయిని కోల్పోయి తిండి మీద ఇష్టం ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఆహారం ద్వారా వచ్చే కాలరీలో మీ ఒత్తిడిని జయిస్తుంది అని మీ శరీరం బలంగా నమ్మడమే దీనికి కారణం. తద్వారా తమకే తెలీకుండా నెమ్మదిగా ఊబకాయానికి గురవుతుంటారు.

కడుపు ఆకలిని తీర్చుకోకుండా, నోటి దురదని తీర్చుకోవాలి అనుకోవడం జరుగుతుంది, ఎందుకని?

దీర్ఘకాలిక ఒత్తిడుల దృష్ట్యా, శరీరంలో కార్టిసాల్ హార్మోను శాతం పెరగడం ప్రారంభిస్తుంది. దీనిని ఒత్తిడి హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) అని కూడా పిలుస్తారు. ఈ హార్మోను రహస్యంగా శరీరంలో ఇన్సులిన్ నిల్వలను అసాధారణ రీతిలో పెంచడం ప్రారంభిస్తుంది. ఇన్సులిన్ అధికంగా పెరగడం వలన, రక్తంలో చక్కర నిల్వలు అమాంతం పడిపోవడం, తద్వారా అధికంగా ఆకలికి గురవడం జరుగుతాయి. క్రమంగా అధిక క్రొవ్వు కలిగిన పదార్ధాలు, లేదా అధిక చక్కెరలు కలిగిన పదార్ధాల వైపుకు తెలీకుండానే మొగ్గు చూపుతారు. మనసు కూడా ఆరోగ్యం కన్నా, రుచికే ప్రాధాన్యతను ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారాలు, కూరగాయలు, సలాడ్ల మీదకు కాకుండా ఐస్ క్రీం, కేక్స్ వంటి అధిక చక్కెరలు, క్రొవ్వు పదార్ధాలు కలిగిన వాటి వైపుకు మనసు వెళ్ళడం జరుగుతుంది. ఇది నాలిక రుచిని కోరుకోవడం వలెనే కాదు, మీకు తెలీకుండా మీ మనసు అలా తయారవుతుంది. కానీ ఈ సౌకర్యవంతమైన ఆహారాల వలన, శరీరంలో షుగర్ మరియు క్రొవ్వు పదార్ధాలు అధికంగా చేరడం జరుగుతుంది.

కావున, అధిక ఒత్తిడి వలన, కలిగే ఆకలిని సంతృప్తి పరచే క్రమంలో అధిక బరువుకు గురవుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ క్రొవ్వు చేరడం ప్రధాన అంశంగా ఉంటుంది.

బరువు తప్పనిసరిగా తనిఖీ చేస్తుండాలి అంటారు, ఎందుకలా?

శరీర బరువు పెరగడం, శరీరాకృతి పైన ప్రభావం చూపడమే కాకుండా, మానసికంగా అనేక సమస్యలను కూడా తెస్తుంది. ఇలా ఒత్తిడికి గురై, బరువు పెరిగిన వారిలో అధికశాతం గుండెపోటుకు , టైప్ 2 మధుమేహానికి లేదా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. కావున సమస్య ప్రారంభంలో గుర్తించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకునే క్రమంగా అడుగులు వేయవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా బరువును తనిఖీ చేయడం వలన, బరువు పై ఒక అవగాహన ఉంటుంది.

ఈ మద్య మార్కెట్లో బాడీ మాస్ ఇండెక్స్ లతో పాటు, శరీరంలో నీటి నిల్వలు, క్రొవ్వుల పరిమాణాలు, శరీర స్థాయిలను కూడా అంచనా వేసేలా సెన్సార్లతో బరువు తూచే పరికరాలు దొరుకుతున్నాయి కూడా. ఆరోగ్యం గురించిన ఆలోచన ఉన్నవారు అటువంటి పరికాలను కూడా ప్రయత్నించడం మంచిది. అవి ఖచ్చితత్వాన్ని ఇవ్వలేకపోయినా, మీ శరీర పరిస్థితిపై మీకొక అవగాహనను తీసుకుని రాగలవు. తద్వారా వ్యాయామలకు సమయాన్ని కేటాయించడం, పండ్లు, కూరగాయలు, సలాడ్లు వంటి ఆరోగ్యకర ఆహారాలపై దృష్టి పెట్టడం, అనారోగ్య అలవాట్లను నెమ్మదిగా దూరం చేయడం వంటి చర్యలను పాటించగలుగుతారు.

అంతే కాకుండా ఇది శరీరాకృతి పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, ఉత్తమంగా కనిపించడం ద్వారా ఆత్మ స్థైర్యాన్ని పొందవచ్చు అన్న భావన కలిగిన వారు ఇలా బరువు పెరగడాన్ని అస్సలు సహించలేరు. నెమ్మదిగా ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. కావున బరువును తూచా తప్పకుండా తనిఖీ చేసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం.

English summary

Stress Is Linked With Weight Gain, Scientists Reveal

Stress is nothing but a physical, bodily response to stressors around us. When under a lot of pressure or feeling stressed, our body thinks that we are going under attack and therefore secretes a lot of hormones to deal with the stress or to fight back. If this mental state is prolonged, it could lead to some awful effects on health and in some cases - death, as explained by the Hans Selye's GAS Model of Stress.
Story first published: Saturday, April 21, 2018, 7:00 [IST]