For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖ చర్మం మెరవాలంటే... !

By B N Sharma
|
Super foods for great Skin!
మీ చర్మం రంగు మెరిసిపోవాలంటే మీ చేతుల్లోనే వుంది. పార్లర్ లకుపోయి సొమ్ము పోయాల్సిన అవసరం కూడా లేదు. చర్మ పోషణకవసరమైన కొన్ని ప్రధానమైన పానీయాలు పరిశీలించండి.

కోకో - ఈ గింజలలో ఎండ నుండి చర్మాన్ని రక్షించే ఫ్లేవనాల్స్ అధికంగా వుంటాయి. ఉదయం, సాయంత్రం తాగటమే కాక, స్నానపు నీటిలో కోకో పౌడర్ (కప్పులో ఎనిమిదో భాగం) కొవ్వు లేని పాలు(కప్పులో 3 వంతులు) స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి.

పెరుగు - పెరుగులో వుండే పోషకాలు మీ చర్మం లేతగా వుండేలా చేస్తాయి. ముఖానికి బాగా పట్టించి కొద్ది నిమిషాలుంచి కడిగేయండి. కాంతులీనే ముఖం మీ సొంతమవుతుంది.

స్ట్రా బెర్రీలు - వీటిలో వుండే విటమిన్ సి ఎండనుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. బెర్రీ లను బాగా నలిపి చల్లటి పెరుగులో కలిపి దానికి అర చెంచా నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించండి. మొటిమలు, నల్లని మచ్చలు కూడా పోతాయి. చర్మం మంచి నిగారింపు పొందుతుంది.

గ్రీన్ టీ - దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని బయటి వాతావరణం నుండి సంరక్షించి మంచి రంగు కలిగేలా చేస్తాయి.

కాఫీ - రోజూ ఒక కప్పు కాఫీ తాగితే చర్మం ముడతలు పడకుండా, వేలాడకుండా వుంటుంది. ఎండకు చర్మం రంగు మారకుండా కాపాడుతుంది. ఒక కప్పు మాత్రమే తాగాలి సుమా!

English summary

Super foods for great Skin! | ముఖ చర్మం మెరవాలంటే... !

Strawberries: The vitamin C in strawberries help protect skin from environmental damage. Puree the berries in a blender and mix in chilled curd and add a half of lemon juice. This will help lighten dark spots. Strawberries have high dosage of vitamin C and ellagic acid which is essential for the production of collagen and acts as an antioxidant.
Story first published:Thursday, November 17, 2011, 12:02 [IST]
Desktop Bottom Promotion