For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీర బరువును పెంచే 5 మ్యాజిక్ ఫ్రూట్స్

|

కొన్ని రకాల పండ్లు బరువును కూడా పెంచుతాయి. ఈ పండ్లు బరువును తగ్గించవు కానీ, బరువు పెంచడంలో బాగా సహాయపడుతాయి. మరీ సన్నగా ఉండే వారు, బరువు పెరగాలంటే ఈ పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల క్రమంగా బరువు పెరగడానికి సహాయపడుతాయి.

అదేవిధంగా సిట్రస్ పండ్లు, మెలోన్స్ మరియు బెర్రీస్ వంటి పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం యొక్క మెటబాలిజంను పెంచుతుంది అయితే ఈ పండ్లతో బరువు పెరుగుతారని భావించలేదు. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు ఈ పండ్లను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోకపోవడం మంచిది. అలాగే కొన్ని పండ్లు అదనపు బరువు తగ్గించడానికి బదులు బరువు పెరగడంలో సహాయపడుతాయి. కాబట్టి బరువు పెంచుకోవలనుకొనే వారు, వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, వారి రెగ్యులర్ డైట్ ను వీటిని మినహాయించి నాజుగ్గా మారండి.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

మీరు బరువు తగ్గించే డైట్ ను అనుసరిస్తున్నట్లైతే, మీరు ఖచ్చితంగా అరపండ్లకు దూరంగా ఉండాలి . అరటిపండ్లు శరీరక బరువును పెచండంలో సహాయపడుతాయి. అరటిపండ్లు అధిక కాలరీలున్న పండు. ఒక అరటిపండులో 105కాలరీలున్నాయి. ఈ హై క్యాలరీ కంటెంట్ వల్ల మీరు బరువుతగ్గించేకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు, మీరు నివారించాల్సిన ఆహారాల్లో అరటిపండ్లు కూడా ఒకటి. అయితే ఎవరైతే బరువు పెంచుకోవాలని చూస్తున్నారో అటువంటి వారు హెల్తీ క్యాలరీలు కలిగిన అరటి పండ్లును వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

డ్రైడ్ నట్స్:

డ్రైడ్ నట్స్:

డ్రై నట్స్(ఎండు ఫలాలు)ఎండు ద్రాక్ష, జీడిపప్పు, నట్స్ మరియు బాదంలు సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలను కలిగి ఉంటాయి. ఈ డ్రైఫ్రూట్స్ శరీరం యొక్కబరువును క్రమంగా పెంచుతాయా. వెయిట్ లాస్ ప్లానర్ ఈ డ్రైఫ్రూట్ ను వారి డైట్ లో చేర్చుకోకూడదని సలహా. కానీ బరువు పెరగాలనుకొనే వారు మాత్రం నిరభ్యంతరంగా ఈ మై రిచ్ కాలరీ కంటెంట్ డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మామిడి పండ్లు:

మామిడి పండ్లు:

పండ్లలో రారాజు మరియు అద్భుతమైన రుచికలిగి, ఎల్లప్పుడు టెంప్ట్ చేసే పండు మామిడి పండ్లు ఇందులో అధిక కాలరీలుండటం వల్ల బరువును శరీరం యొక్క బరువును పెంచుతుంది. అందువల్ల మామిడిపండ్లను తీసుకొనేటప్పుడు తగిన మోతాదలు మాత్రమే తీసుకోవాలి. మామిడి పండ్లు ప్రతిఒక్క పండులో వంద క్యాలరీల కంటెంట్ ఉంటుంది. కాబట్టి, బరువు పెంచడంలో మామిడిపండ్లు కూడా ఒకటి. బరువు తగ్గించుకోవాలనుకొనే వారు వారి టిప్స్ లేదా డైట్ నుండి మామిడిపండ్లను మినహాయించండి.

సపోటా:

సపోటా:

సపోటాలో అధిక కాలరీలుండటం వల్ల, శరీర బరువు పెరుగుతారు. ఈ చిన్న బ్రౌన్ కలర్ లోఉండే రుచికరమైన పండ్లలో క్యాలరీలకంటెంట్ అధికంగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు . ఎప్పుడో ఒకసారి ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యత్యాసం ఉండదు, కానీ రెగ్యులర్ గా లేదా ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడం కాయం. అందువల్ల బరువు తగ్గాలనుకొనే వారు, చాలా తక్కువ మోతాదులో ఈ పండ్లను తీసుకోవాలి.

ఫిగ్స్:

ఫిగ్స్:

ఫిగ్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక ఫిగ్ లో 111కాలరీలు కలిగి ఉంటుంది. అందువల్ల మీరు వీటిని తినాలని ఎంత టెంప్ట్ అయినా వీటిని తీసుకోవడంలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి . బరువు తగ్గించుకోవాలనుకొనే వాళ్ళు వీటికి బదులుగా బెర్రీస్, ఆరెంజ్, ఆపిల్స్, మరియు వాటర్ మెలో వంటి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

English summary

5 Fruits That Increase Weight

There are some fruits that increase weight and not aid in weight loss. The sugar content of these fruits is high enough to increase weight contrary to the common belief that fruits help to lose weight.
Desktop Bottom Promotion