Just In
- 36 min ago
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- 2 hrs ago
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- 2 hrs ago
మహిళల లైంగిక భావాలను సహజంగా ప్రేరేపించే ఆహారాలు మీకు తెలుసా?
- 3 hrs ago
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఉదయం ఈ విషయాలు పాటిస్తే చాలు ..!
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తీసుకోవల్సిన హెల్తీ స్నాక్స్
వ్యాయామం అనేది దినచర్యలో ఒక భాగం. ఎందుకంటే, మనం శారీరకంగా మరియు మానసింగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలిలో వ్యాయామం చాలా అవసరం. అయితే వ్యాయామం చేయడానికి కొన్ని టెక్నిక్స్ తెలుసుకొనే ఉండాలి. అదే విధంగా తీసుకొనే ఆహారం మీద అవగాహాన కలిగి ఉండాలి. వ్యాయామానికి ముందు, వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుండాలి.
జిమ్ కు వెళ్ళినప్పుడు మీ శరీరానికి తగినంత ఎనర్జీ అవసరం అవుతుంది. ఆ ఎనర్జీని తక్షణం పొందాలంటో జిమ్ కు వెళ్ళడానికి ముందు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ుండే కొన్ని ఆహారాలను తప్పని సరిగా తీసుకోవాలి. అదే విధంగా వ్యాయామం తర్వాత కూడా మన
శరీరంలో ఎనర్జీలోపిస్తుంది కాబట్టి, జీవక్రియలు తిరిగి ఉత్తేజం అవ్వాలంటే వ్యాయామం తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకుంటే, త్వరగా కోలుకుంటారు. వ్యాయామం తర్వాత ఆరోగ్యకరమైన మరియు ప్రోటీనులను పుష్కలంగా అందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆ పోస్ట్ వర్కౌట్ స్నాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. పీనట్ బట్టర్ టోస్ట్ :
పీనట్ బటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పోస్ట్ వర్కౌట్ స్నాక్ లో దీన్ని తీసుకోవడం ఒక ఉత్తమ ఎంపిక. అందుకోసం త్రుణధాన్యాలతో తయారుచేసిన టోస్ట్ మరియు పీనట్ బట్టర్ రెండింటి కాంబినేషన్ పూర్తి పోషకాలను మరియు టేస్ట్ ను అందిస్తుంది.

2. చాక్లెట్ స్మూతీ:
రుచికరమైన చాక్లెట్ స్మూతీని ఒక గ్లాసు పాలలో మిక్స్ చేసి బాగా షేక్ చేయాలి. పొట్ట ఫుల్ గా ఉండాలనుకుంటే అరటిపండు ముక్కలను మిక్స్ చేయవచ్చు.

3. ఫ్రూట్ స్మూతీ:
కొన్ని రకాల పండ్లు, అరటి, స్ట్రాబెర్రీ విత్ మిల్క్ స్మూతీలు ఆరోగ్యానికి చాలా మంచిది మరియు టేస్టీగా ఉంటాయి. బెర్రీ స్మూతీస్ మరియు గ్రీన్ స్మూతీస్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రూట్ స్మూతీలో క్రాన్ బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, అవొకాడో, కివి, పైనాపిల్ వంటివాటిని ఎంపిక చేసుకోవాలి.

4. పీనట్ బటర్ స్మూతీ:
ప్రోటీనులు అధికంగా ఉండే మరో స్మూతీ పీనట్ బటర్ స్మూతీ. ఇది ఒక హెల్తీ వర్కౌట్ స్నాక్ రిసిపి. తగినన్ని ప్రోటీలు కలిగి ఉన్న పీనట్ బటర్ ను పాలలో మిక్స్ చేసి తీసుకవోాలి.

5. ఉడకించిన గుడ్డు:
న్యూట్రీషియన్స్ ను షుష్కలంగా ఉండే గుడ్డుకు మరేవీ సాటి రావు. ఈ చిన్న గుడ్డులో మనకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మొత్తం పుష్కలంగా ఉన్నాయి. ఎగ్ వైట్ ఎక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను మితంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవ్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

6. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్:
నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీనుల మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి.

7.చీజ్ మరియు త్రుణధాన్యాలతో తయారుచేసిన క్రాకర్స్:
చీజ్ ప్రోటీనలు అధికంగా ఉండే ఒక మంచి పోషకాహారం. ఇవన్నీ పాలలో కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి, దీన్ని స్నాక్ గా తీసుకోవచ్చు .

8. ప్రోటీన్ బార్స్:
ప్రోటీన్ బార్స్ పేరులోనే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ వర్కౌట్ తర్వాత వీటిని తీసుకోవడం షుగర్ ఫ్రీ వన్స్ లేదా వీటిలో చాలా తక్కువ మోతాదులో షుగర్స్ కలిగి ఉంటాయి.

9.పెరుగు మరియు బెర్రీస్:
ప్రోటీనులు పుష్కలంగా ఉండే పెరుగు ఒక మిల్క్ ప్రొడక్ట్. దీనికి కొన్ని బెర్రీస్ ను జోడిస్తే నిముషాల్లో ఒక రుచికరమైన స్నాక్ రెడీ అవుతుంది.

10. హమ్స్ అండ్ టోస్ట్స్:
హమ్స్ చిక్ పీస్ తో తయారుచేస్తారు. వీటిలో క్యాల్షియం మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకోవచ్చు.

11. తున మరియు బ్రౌన్ బ్రెడ్:
చేపల్లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. కాబట్టి, చేపల్లో ఒకరకమైన తున ఫిష్ ను మరియు బ్రౌడ్ బ్రెడ్ తో ఒక సాండ్విచ్ తయారుచేసి తీసుకోవడం ద్వారా హెల్తీ స్నాక్ అవుతుంది.

12.సెరల్స్ మరియు పాలు:
పోస్ట్ వర్కౌట్ స్నాక్ పొట్టనింపుతుంది మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. సెరల్స్ పొట్టనింపితే, పాలు ప్రోటీనులను అందిస్తుంది. మరింత హెల్తీగా తీసుకోవాలనుకుంటే, అందులో రోస్ట్ చేసిన మరియు ముక్కలుగా చేసిన బాదం, అరటిపండ్లు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి తీసుకోవచ్చు.

13. వెజ్ ఆమ్లెట్:
ప్రోటీన్, మినిరల్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండే వెజిటేబుల్స్ తో ఆమ్లెట్ తయారుచేసుకుంటే, మనకు తక్షణ ఎనర్జీని అందిస్తుంది. దీనికి క్యాప్సికమ్, టమోటో, బ్రొకోలీ, ఉల్లిపాయ, వెల్లుల్లి, మష్రుమ్ లేదా క్యాబేజ్ మరియు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ను ఎంపిక చేసుకొని తీసుకోవాలి.

14. హోల్ వీట్ పిజ్జా:
సరైన పద్దతిలో తయారుచేస్తే పిజ్జా ఆరోగ్యకరమే. చీజ్ తో తయారుచేసే ఈ స్నాక్ రిసిపి, వర్కౌట్ తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

15. రైస్ బార్స్ :
పీనట్ బటర్ తగినంత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అందిస్తే, బియ్యం తగినంత ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి, వర్కౌట్ తర్వాత వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం.

16.జ్యూస్ మరియు ప్రోటీన్ పౌడర్:
జ్యూస్ వర్కౌట్ తర్వాత తీసుకొనే ఒక స్నాక్ రిసిపి. ఇది రిఫ్రెష్ చేస్తుంది మరియు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది కాబట్టి, దీన్ని హెల్తీ డ్రింక్ గా తీసుకోవాలి.

17. ఓట్ మీల్స్:
ఒక బౌల్ ఓట్ మీల్ తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హెల్తీగా మరియు ప్రశాంతంగా ఉంచుతుంది. దీన్ని పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకోవడం చాలా అవసరం.

18. కాటేజ్ చీజ్:
క్యాటేజ్ చీజ్ ప్రోటీన్స్ మరియు క్యాల్షియం కాంబినేషన్ కాబట్టి, ఇది రుచికరమైనది మరియు హెల్తీ కూడా . మీకు స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే, మీరు పంచదార లేదా తేనెను మిక్స్ చేసి తీసుకోవచ్చు.

19. బనానా పాన్ కేక్స్:
పాన్ కేక్స్ ను ఎక్కువ పంచడార మరియు మాప్లే సిరఫ్ తో తయారుచేస్తే, ఇది ఆరోగ్యానికి హాని కలుగుతుంది. హెల్తీగా తీసుకోవాలంటే, అరటిపండ్లు మరియు మాప్లే సిరప్ కు ప్రత్యామ్నాయంగా తేనెను వాడుకోవచ్చు.

20. స్టైర్ ఫ్రైస్:
బ్రైట్ గ్రీన్, ఎల్లో, మరియు రెడ్ వెజిటేబుల్స్ తో ఉడికించిన చికెన్ ఫ్రై చేసి తీసుకోవచడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చికెన్ కు ప్రత్యామ్నాయంగా టోఫును ఉపయోగించుకోవచ్చు.