For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ జర్నీలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ?

By Swathi
|

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. డైట్ ఫాలో అవుతున్నారు. మరీ ఎక్కువగా నిద్రపోకుండా జాగ్రత్తపడుతున్నారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటున్నారు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు అసలు తీసుకోవడమే లేదు. కానీ బరువు మాత్రం తగ్గడం లేదని ఫీలవుతున్నారా ? అన్నీ పక్కాగా ప్లాన్ చేసినా.. బరువు ఎందుకు తగ్గడం లేదని ఢీలాపడుతున్నారా ?

మహిళలు ఉన్నట్టుండి బరువు పెరగడానికి కారణాలేంటి ?

నిజమే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. కొంతమంది బరువు తగ్గరు. దీనికి మీరు చేస్తున్న కొన్ని పొరపాట్లే కారణమయి ఉంటాయి. బరువు తగ్గడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే.. కొన్ని పొరపాట్లను కూడా మీకు తెలియకుండా చేస్తుంటారు. అందుకే.. బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఎంత బరువు ఉంటారో.. రోజులు గడుస్తున్నా కూడా అంతే బరువు ఉంటారు. దీనికి అసలు కారణాలు తాజా అధ్యయనాల్లో బయటపడ్డాయి. మరి అవేంటో ఓ లుక్కేసి.. వాటిని మళ్లీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి..

తక్కువ నిద్ర

తక్కువ నిద్ర

వెయిట్ లాస్ జర్నీలో రెస్ట్ చాలా ముఖ్యమైనది. మీ శరీరం విశ్రాంతి తీసుకోకపోతే.. శరీరంలోని క్యాలరీలు కరించడం కష్టంగా మారుతుంది. సరైన డైట్ ఫాలో అవుతూ.. వర్కవుట్స్ చేస్తూనే.. కంటి నిండా నిద్రపోవాలి. అంటే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.

ఎక్కువ వ్యాయామం

ఎక్కువ వ్యాయామం

బరువు తగ్గాలనే ఆరాటంలో ప్రతిరోజూ గంటలకొద్దీ జిమ్ లో ఉండటం హెల్తీ కాదు. అలాగనీ బాగా వ్యాయామం చేస్తున్నారు కాబట్టి.. ఎంత కావాలనుకుంటే.. అంత తినేయండి అని సూచిస్తుంటారు. కానీ దానికంటూ ఓ పద్ధతి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు 80 శాతం డైట్ 20 శాతం వ్యాయామం చేయాలి. అంతేకానీ.. ఎలాపడితే అలా తినడం, వ్యాయామం చేయడం మంచిది కాదు.

ఆకలితో ఉండటం

ఆకలితో ఉండటం

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహార పరిమాణం తగ్గిస్తారు. అది మంచి ఐడియానే కానీ.. మళ్లీ ఆకలి కాకుండా జాగ్రత్తపడాలి. కాబట్టి సలాడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడాన్ని ఆపేసి.. ఆకలి హార్మోన్ని కంట్రోల్ లో ఉంచుతాయి. కాబట్టి మీ శరీరానికి కావాల్సినంత తినండి. అయితే సలాడ్స్ లో చీజ్ కలిపి తీసుకుంటే.. మాత్రం హైక్యాలరీ ఫుడ్ అవుతుంది. అలా కాకుండా చూసుకోవాలి.

చాలా త్వరగా తినడం

చాలా త్వరగా తినడం

రాత్రిపూట భోజనం త్వరగా చేయాలని నిపుణులు సూచిస్తారు. కరెక్టే. కానీ.. రాత్రి భోజనం 7 గంటలకు తిని, 12 గంటలకు పడుకోవడం మంచి అలవాటు కాదు. కాబట్టి త్వరగా తినాలి, త్వరగా పడుకోవాలి. అప్పుడే మీ టార్గెట్ రీచ్ అవుతారు.

శరీరం మాట వినకపోవడం

శరీరం మాట వినకపోవడం

ప్రతి రోజూ వ్యాయామం చేయడం, డైట్ ఫాలో అవడాన్ని శరీరం కూడా బోర్ గా ఫీలవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆహారాలు తినాలి అనిపించడం, ఒకరోజు వ్యాయామం మిస్ చేయమని శరీరం సంకేతాలు ఇవ్వడం వంటి వాటిని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో శరీరం చెప్పే మాటను కూడా వినాలి. ఎందుకంటే బాడీ రెస్ట్ కోరుకుంటోందని గ్రహించాలి.

ఒత్తిడికి లోనవడం

ఒత్తిడికి లోనవడం

బరువు తగ్గాలనే ఆలోచన ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటే.. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. బరువు వెంటనే తగ్గాలని.. వ్యాయామంతో పాటు రకరకాల డైట్ టిప్స్ ఫాలో అయితే.. ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి.. ఒత్తిడి ఎక్కువైతే.. ఎలాంటి ఫలితం ఉండదు.

ఆహారం మానేయడం

ఆహారం మానేయడం

అసలు ఆహారాన్ని మానేసి.. ప్రొటీన్ షేక్స్, ప్రొటీన్ బార్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ని ఎంచుకోవడం, గ్లాసు పాలకు బదులు క్యాల్షియం ట్యాబ్లెట్, రాత్రి డిన్నర్ కి బదులు ఒమేగా త్రీ మల్టీ విటమిన్ పిల్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. డైట్ ని ఫాలో అవడం చాలా అవసరం. మరీ అంత హానికరం కాకపోయినా.. శరీరానికి కష్టంగా ఉంటుంది.

సరైన పద్ధతిలో వండకపోవడం

సరైన పద్ధతిలో వండకపోవడం

మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. హెల్తీ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. అయితే హెల్తీగా ఉండే ఒక బౌల్ పోహ తింటారు కానీ.. దాన్ిన ఆయిల్ లేకుండా ఎలా వండాలో మీకు తెలియదు. దీనివల్ల మీ వెయిట్ లాస్ గేమ్ కి ఆటంకం ఏర్పడుతుంది.

English summary

8 real things stopping you from losing weight

8 real things stopping you from losing weight. he weighing scale still shows the same number with some occasional treats of a few grams here and there. Why is this happening? Well, it could be because of some common mistakes that you are making.
Story first published:Wednesday, June 1, 2016, 11:23 [IST]
Desktop Bottom Promotion