For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు ఉన్నట్టుండి బరువు పెరగడానికి కారణాలేంటి ?

By Swathi
|

మహిళలు బరువు పెరగడమనే సమస్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అందులో మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా మహిళలు చాలా అకస్మాత్తుగా బరువు పెరిగిపోతున్నారు.

సడెన్ గా బరువు పెరగడం వల్ల.. మహిళలు.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నారు. బరువు పెరగడం వల్ల.. వాళ్ల హెల్త్ రిస్క్ లో పడిపోతోంది. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే.. మహిళలు చేయాల్సిందల్లా ఒక్కటే.. వాళ్ల బరువు చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ తను ఏం తీసుకుంటుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుందో తెలుసుకోవాలి. ఎంత మోతాదులో క్యాలరీలు తీసుకుంటుందో చెక్ చేసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే.. ఎక్కువ బరువు పెరగడానికి కారణమవుతుంది.

లేడీస్ బీ అలర్ట్: మీరు నిర్లక్ష్యం చేయకూడని విషయాలు..

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల.. ఎక్కువగా మహిళల్లో బరువు పెరగడానికి కారణమవుతోందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఇన్సులిన్, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటి వాటి వల్ల కూడా బరువు పెరుగుతారని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి మహిళలు సడెన్ గా బరువు పెరగడానికి కారణాలేంటో అవగాహనకు వస్తే.. బరువు పెరగకుండా జాగ్రత్తపడవచ్చు. మరి ఆ కారణాలేంటో చూద్దామా..

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల.. మూడ్ లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. దీని వల్ల.. బరువు పెరగడానికి సులువైన మార్గం ఏర్పడుతోంది.

ఒత్తిడి

ఒత్తిడి

మగవాళ్ల కంటే.. మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడి అనేది సైలెంట్ కిల్లర్. దీనికారణంగా బరువు పెరుగుతారు.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు హెల్తీగా లేకపోయినా.. మహిళలు తేలికగా బరువు పెరుగుతారు. భోజనం మానేయడం, బరువు తగ్గాలని అల్పాహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లు ఎక్కువ బరువు పెరగడానికి కారణమవుతాయి. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ కి కారణమవుతుంది.

మెడిసిన్స్

మెడిసిన్స్

సడెన్ గా బరువు పెరగడానికి మెడిసిన్స్ మరో కారణం. కొన్ని రకాల మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి. దీనివల్ల బరువు పెరుగుతారని స్టడీస్ చెబుతున్నాయి. డిప్రెషన్, డయాబెటిస్, ప్రెగ్నెన్సీ వంటి వాటి కోసం మందులు వాడే ముందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

ఇన్సులిన్

ఇన్సులిన్

ఎక్కువగా వైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల 35 ఏళ్ల తర్వాత మహిళల శరీరం రిస్క్ లో పడుతుంది. వైట్ ఫుడ్స్ లో ఎక్కువ క్యాలరీలు, షుగర్ ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే.. బరువు పెరగకుండా అరికట్టవచ్చు.

బద్ధకం

బద్ధకం

వ్యాయామం చేసే అలవాటు లేకపోతే.. యాక్టివ్ గా ఉండలేరు. అలాగే చాలా బద్ధకంగా ఫీలవుతూ ఉంటారు. ఇది సడెన్ వెయిట్ గెయిన్ కి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడూ యాక్టివ్ గా, హెల్తీగా ఉంటే.. మెటబాలిజం రేట్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆకలి పెరగడం

ఆకలి పెరగడం

ఆకలి పెరగడం అనేది శరీరానికి చాలా డేంజర్. ఎప్పుడైతే.. ఎక్కువ ఆహారం తినడం అలవాటు అవుతుందో.. ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీనివల్ల క్యాలరీలు స్టోర్ అయి.. ఫ్యాట్ మారతారు. దీనివల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.

ఏజింగ్

ఏజింగ్

వయసు పెరిగే కొద్దీ.. శరీరం వీక్ అవుతుంది. శారీరకంగా ఉత్సాహంగా ఉండటానికి ఆసక్తి చూపలేకపోతారు. అలాంటప్పుడు మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల సడెన్ గా మహిళలు బరువు పెరుగుతారు.

English summary

8 Reasons Why Women Suddenly Gain Weight

8 Reasons Why Women Suddenly Gain Weight.The percentage of weight gain in women is increasing as we speak. Today, there are around a million people out there, especially women, who are suffering from weight gain.
Story first published:Tuesday, April 12, 2016, 11:06 [IST]
Desktop Bottom Promotion