For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువును తగ్గించే టాప్ 25 వెజిటేరియన్ ఫుడ్స్

అధిక బరువును తగ్గించే టాప్ 25 వెజిటేరియన్ ఫుడ్స్

|

శాకాహారం తినటం ఎంతో ఆరోగ్యకరం. శాకాహారం బరువును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు మీ బరువు ఎంత వుండాలో అంతే వుండేలా చేస్తుంది. అయితే అది కొన్ని నిబంధనలకు మాత్రమే. మీరు గనుక శాకాహారం అంటూ వేపుడు ఆహారాలు తింటే బరువు పెరిగి తీరతారు. కనుక శాకాహారంలో కూడా బరువు తగ్గాలనేవారు ఏది తినాలి? ఏది తినకూడదు అనే దానిపై విచక్షణ చూపాలి. శాకాహారంలో కూడా అధిక కేలరీలు, లేదా పిండి పదార్ధాలు అధికంగా ఉండే ఆహారాలు తినరాదు. అవి మీ బరువును పెంచుతాయి.బరువు తగ్గించి.. ఆరోగ్యంగా ఉంచే 15 సూపర్ ఫుడ్స్

వెజిటేరియన్ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మంచి ఫిజిక్ ను పొందవచ్చు . చాలా మంది బరువు తగ్గించుకోవడంలో స్ట్రగుల్ అయ్యుంటారు. అయితే టోన్డ్ బాడీ పొందడానికి వెజిటేరియన్ ఫుడ్ గ్రేట్ గా సహాయపడుతుందని నిర్ధారించబడినది . మరి బరువు తగ్గించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వెజిటేరియన్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..అవి బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతాయో కూడా తెలుసుకుందాం.

వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!

ముఖ్యంగా వెజిటేరియన్ ఫుడ్స్ అంటే మాంసాహారం, గుడ్డు, డైరీ ప్రొడక్ట్స్ మరియు ఇతర అనిమల్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం. వెజిటేరియన్ డైట్ తోనే హెల్తీ లైఫ్ ను పొందడం . అందులో భాగంగా రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, త్రుణధాన్యాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యుమ్స్, నట్స్, మరియు సీడ్స్ చేర్చుకోవాలి . వెజిటేరియన్ ఫుడ్స్ లో కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు .

పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే ఉత్తమ ఆహారాలివి..!

వెజిటేరియన్ డైట్ అత్యంత హెల్తీ మరియు ఎఫెక్టివ్ ఆహారం. ఇందులో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఇలాంటి హెల్తీ వెజిటేరియన్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. ఎనర్జీ పెంచుకోవచ్చు మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వెజిటేరియన్ డైట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్, మరియు ఇతర క్రోనిక్ డిసీజ్ లను తగ్గించుకోవచ్చు. మరి బరువు తగ్గించే ఆ పవర్ఫుల్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో వివిధ రకాలున్నాయి. అన్ని రకాల బీన్స్ ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఈ బీన్స్ రకాల్లో తక్కువ ఫ్యాట్ ఎక్కవ ప్రోటీన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉందడటం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

 ఓట్స్:

ఓట్స్:

ఫుల్ ప్రోటీన్స్ ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల శరీరంలో కార్భోహైడ్రేట్స్ ఆలస్యంగా రిలీజ్ అవుతాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రోజంతా ఆకలి కాకుండా ఇతర ఆహారాల మీద మనస్సు మళ్ళకుండా సహాయపడుతుంది. రెగ్యులర్ డైట్ లో అరకప్పు ఓట్స్ చేర్చుకోవడం వల్ల హెల్తీ కార్బోహైడ్రేట్స్ అందివ్వడంతో పాటు మెటబాలిజం రేటును పెంచుతుంది.

అవొకాడో :

అవొకాడో :

రెగ్యులర్ గా అవొకాడో తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా కరగుతుంది . మోనోశాచురేటెడ్స్ ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది . ఫ్రీరాడికల్ నుండి కణాలు డ్యామేజ్ కాకుండా మెటబాలిజంను పెంచుతుంది. అవొకాడోలోని అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను శరీరంలోని లెప్టిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఇందులో ఉండే ఓలిసిక్ యాసిడ్ ఆకలి కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది .

 పిస్తా:

పిస్తా:

నట్స్ లో అత్యంత తక్కువ క్యాలరీలున్న నట్ పిస్తాలు. ఇది హార్ట్ ఫ్రెండ్లీ మోనో అండ్ పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది . ఈ ఫ్యాట్స్ ను ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తో కలిపి తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఈ చిన్న నట్స్ ఆకలి నశింపచేసి, బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తాయి.

చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

చియా సీడ్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉంటాయి . ఇది ఆకలిని నశింపచేసే గ్లూకగాన్ మరియు ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ ను ఉత్పత్తికి సహాయపడుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలిలో క్యాలరీలు తక్కువ , ఫైబర్ అధికంగా ఉంటుంది. పొట్టనిండిన అనుభూతి కలిగిస్తుంది బ్రొకోలీలో ఉండే హై ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ క్యాలరీలను జోడించకుండా ఆహార విలువలు పెంచుతుంది . ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు ఏజింగ్ తో ఫైట్ చేసే మరియు సెల్ డీజనరేట్ చేయడానికి సహాయపడుతాయి.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ లో హెల్తీ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది .ఇది వైట్ రైస్ కు ప్రత్యామ్నాయ ఆహారం . అరకప్పు కప్పు బ్రౌన్ రైస్ లో 2గ్రాముల స్టార్చ్ ఉంటుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది . బ్రౌన్ రైస్ లో డెన్సిటి ఫుడ్ . ఇది కొద్దిగా తినగానే హెవీగా పీలవుతారు, అదే విధంగా క్యాలరీలు తక్కువ . విటమిన్ బి సప్లై చేస్తుంది . దాంతో క్యాలరీలను బర్న్ చేస్తుంది.

బేరిపండ్లు:

బేరిపండ్లు:

బేరిపండ్లలో 15శాతం డైలీరెకమెండెడ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . రోజుకు మూడు బేరిపండ్ల తినే మహిళల్లో ఎక్కువ శాతం బరువు తగ్గినట్లు రీసెర్చెస్ వెల్లడిచేస్తున్నారు . తొక్క తీయ్యకుండా బేరిపండ్లను తినడం వల్ల ఎక్కువ ఫైబర్ మన శరీరానికి అందుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

లెమన్ వాటర్ తో మీ దినచర్యను ప్రారంభించడం వల్ల శరీరానికి ఎక్స్ ట్రా పౌండ్స్ చేకుండా అడ్డుకుంటుంది. నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది ఆకలికోరికల మీద పోరాడుతుంది . ఇది లాలాజలంను క్రమబద్దం చేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్ కాబట్టి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . శరీరాన్ని నేచురల్ గా క్లెన్సింగ్ డిటాక్సిఫై చేస్తుంది . కాబట్టి, లెమన్ వాటర్ ఎంత తీసుకుంటే అంత వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

రెడ్ వైన్:

రెడ్ వైన్:

రెడ్ వైన్ లో క్యాలరీలు తక్కువ మరియు షుగర్స్ మరియు ఫ్యాట్ ఉండవు . పిసియాటనోల్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది యంగ్ ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి కాకుండా అండుకుంటుంది . ఈ సెల్స్ ను ప్రారంభదశలోనే నాశనం చేస్తుంది .ఇన్సులిన్ సామర్థ్యంను బ్లాక్ చేస్తుంది . థర్మోజిన్స్ ను క్యాలరీలను బర్న్ చేస్తుంది.

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

ప్రతి మీల్ కు ముందు సగం గ్రేప్ ఫ్రూట్ తినడం వల్ల ఒక వారంలో 1 పౌండ్ బరువు తగ్గించుకోవచ్చు. గ్రేప్ ఫ్రూట్ లో ఉండే కంటెంట్ ఇన్సులిన్ తగ్గించడం వల్ల బరువు తగ్గుతారు.

బాదం:

బాదం:

బాదంలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి . రోజూ గుప్పెడు బాదంలో తినడం వల్ల ఫ్యాట్ రలీజ్ అవుతుంది. ఫలితంగా ఆకలిని అరికట్టే హార్మోన్ ను విడుదతల చేస్తుంది . ఈవెనింగ్ స్నాక్ గా తీసుకొని ఫలితం మీరే గమనించండి.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ 24 గంటల్లో మెటబాలిజంను 5శాతం ఇంప్రూవ్ చేస్తుంది . ఇది రోజంతా హైలో ఉంచుతుంది . గ్రీన్ టీ నీరులాగే బాడీని హైడ్రేషన్ లో ఉంచుతుంది . దాంతో ఫ్యాట్ మరియు క్యాలరీలను బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది .

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

గ్రీన్ వెజిటేబుల్స్ లో తక్కువ క్యాలరీలున్న వెజిటేబుల్ ఇది . ఒక్క ఆస్పరాగస్ లో 4క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ కు ఒక గొప్ప మూలం . ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . దాంతో అధికంగా తినకుండా ఆపుచేస్తుంది. బరువు పెరగకుండా ఉండవచ్చు.

టమోటోలు:

టమోటోలు:

ఫ్యాట్ ఫైటింగ్ ఫుడ్స్ లో ఫేవరెట్ ఫుడ్ టమోటో . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు లెప్టిన్ రెసిస్టెన్స్ ను రిజర్వ్ చేస్తుంది . టమోటోల్లో ఉండే లైకోపినిన్ వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది . బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటుంది. బాడీ డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ మరియు ఫ్యాట్ సెల్స్ ఫ్లష్ చేస్తుంది.

చిల్లీస్:

చిల్లీస్:

మెటబాలిజం రేటును పెంచడానికి చిల్లీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఒక చిల్లీ పెప్పర్ లో బీటా కెరోటిన్ రోజుకు సరిపడా సప్లై చేస్తుంది. విటమిన్ సి టాక్సిన్స్ తో పోరాడుతుంది . బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 లెంటిల్స్:

లెంటిల్స్:

లెంటిల్స్ లో ఫైబర్ మరియు సాటియాటింగ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అరకప్పు లెంటిల్స్ 3.5గ్రాముల రెసిస్టెన్స్ స్టార్చ్ అందిస్తుంది. హెల్తీ కార్బోహైడ్రేట్స్ మెటబాలిజంకు సహాయపడుతుంది . బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించుకోవడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్, మీడియం సైజ్ అరటిపండ్లలో 110 క్యాలరీల 13 గ్రాముల స్ట్రార్చ్ ను కరిగించ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఉండే స్టార్చ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది . ఇది ఒక గుడ్ మిడ్డే స్నాక్ అని చెప్పవచ్చు .

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో చాలా తక్కువ క్యాలరీలన్నాయి. బరువు తగ్గించడానికి ఇది ఒక వండర్ఫుల్ ఫ్రూట్ 92శాతం వాటర్ తో నిండి ఉంటుంది. పొట్టను ఫుల్ చేస్తుంది . పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది.

బెర్రీస్ :

బెర్రీస్ :

చూడటానికి చిన్నగా ఉండే బెర్రీస్ లో ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ఒక కప్పు బెర్రీస్ 8గ్రాములు ఫైబర్ మరియు కేవలం 60క్యాలరీలను అందిస్తుంది. వీటిని సలాడ్స్, స్మూతీల రూపంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు,

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్స్ ఉండే MUFAs స్వీట్స్, సాల్టీ మరియు ఫ్యాటీ ఫుడ్స్ మీద ఆకలి కలినివ్వకుండా చేస్తాయి . వీటిలో ఉండే ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్ పునరావ్రుతం అయ్యె వ్యాధులకు కారణం ఫ్రీరాడికల్స్ నుండి మనల్ని రక్షిస్తుంది. బరువు తగ్గిస్తుంది

బొప్పాయి :

బొప్పాయి :

బొప్పాయి మెటబాలిజంను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది . ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రోజంత ఆకలి కానివ్వదు . వాటర్ మరియు హైఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకం నివారిస్తుంది. ఆహారం త్వరగా విచ్చిన్న అయ్యేలా చేస్తుంది బ్లోటింగ్ నివారిస్తుంది . రెగ్యులర్ గా తింటే బరువు కూడా తగ్గుతారు.

క్వీనా:

క్వీనా:

క్వీనా అమేజింగ్ డైట్ ఫ్రెండ్లీ ఫుడ్ . ఇందులో హంగర్ ఫైటింగ్ ప్రోటీన్స్ తో నిండి ఉంటుంది .ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది . దాంతో ఎక్కువ తినకుండా బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు . ఇందులో ప్రోటీన్స్, అమినోయాసిడ్స్, ఫైబర్, బికాంప్లెక్స్ విటమిన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండి మెటబాలిజం రేటును పెంచుతాయి.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్లో వాటర్ అధికంగా ఉంటుంది . వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్న వారు వెజిటేరియన్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇందులో ఉండే పెక్టిన్ ఫ్యాట్ మరియు సెల్స్ గ్రహించడాన్ని పరిమితి చేస్తుంది.

త్రుణదాన్యాలు:

త్రుణదాన్యాలు:

త్రుణధాన్యాలలో వివిధ రకాలున్నాయి . వీటన్నింటిలో విటమిన్ బి కాంప్లెక్స్ , విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫైబర్లు అధికం . ఇది బౌల్ మరియు ఆకలిని క్రమబద్దం చేసతి బరువు తగ్గడానికి సమాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గడానికి సహాయపడుతుంది.

English summary

Top 25 Vegan Foods That Help In Weight Loss

Veganism is also a key to a host of benefits including lower cholesterol, renewed vigor and good physiques. Many people struggle with weight loss and a vegan diet may pave the way to a sleek and toned body. Let’s take a look at the top 25 vegan foods that we can include in our diet.
Desktop Bottom Promotion