For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రోజుల్లో 5 కేజీలు తగ్గించే.. సింపుల్ వాటర్ ట్రీట్మెంట్..!!

By Swathi
|

కొన్ని గ్లాసుల నీళ్లు తాగండి.. అధిక బరువును తగ్గించుకోండి. ఏంటి నీళ్లు తాగితే బరువు తగ్గిపోతారా అని ఆలోచిస్తున్నారా ? నిజమే ఇవి ఒట్టిమాటలు కాదు.. ఒక అధ్యయనం నిరూపించింది. భోజనానికి ముందు, రాత్రి డిన్నర్ కి ముందు నీళ్లు తాగడం వల్ల.. వాళ్లు చాలా బరువు తగ్గినట్టు ఈ అధ్యయనాలు నిరూపించాయి.

అంటే దీని అర్థం డిజ్ కి, రన్నింగ కి వెళ్లాల్సిన అవసరం లేదని కాదు. కనీసం 16 ఔన్సుల నీటిని భోజనం సమయంలో తీసుకోవడం వల్ల.. త్వరగా మీరు తగ్గాలనుకున్న బరువు తగ్గుతారని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి.

water to weight loss

ప్రతి ఒక్కరూ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంటారు. కానీ.. ఎలా అనేది చాలామందికి తెలియదు. సాధారణంగా.. ఎక్కువ నీళ్లు తాగినప్పుడు ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. ఇలా కాకుండా నీళ్లు ఎలా తాగితే.. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందో చూద్దాం..

నిద్రలేవగానే

నిద్రలేవగానే

ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

కాఫీ లేదా టీ తాగడానికి ముందు

కాఫీ లేదా టీ తాగడానికి ముందు

కాఫీ లేదా టీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు ఖచ్చితంగా తాగాలి. కాఫీ లేదా టీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

MOST READ: యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్ MOST READ: యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

బ్రేక్ ఫాస్ట్ కి ముందు

బ్రేక్ ఫాస్ట్ కి ముందు

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు.. ఒక గ్లాసు నీళ్లు తాగాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్ అయిపోయిన వెంటనే మరో గ్లాసు తాగడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారు.

అరగంట ముందు

అరగంట ముందు

మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల.. పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తక్కువగా తినే అవకాశం ఉంటుంది.

పడుకోవడానికి ముందు

పడుకోవడానికి ముందు

పడుకోవడానికి కొన్ని రెండు గంటల ముందు.. ఒక గ్లాసు నీళ్లు తాగాలి. మధ్య రాత్రి మెలకువ వచ్చి.. ఆకలిగా అనిపించకూడదు అంటే.. పడుకోవడానికి ముందు కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

MOST READ:థైరాయిడ్ సమస్యను అధిగమించే 12 హెల్తీ ఫుడ్స్...!MOST READ:థైరాయిడ్ సమస్యను అధిగమించే 12 హెల్తీ ఫుడ్స్...!

రోజంతా

రోజంతా

రోజంతా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ.. 9 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. రోజుకి కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే.. తేలికగా బరువు తగ్గుతారు.

కూల్ డ్రింక్స్

కూల్ డ్రింక్స్

జ్యూస్, కూల్ డ్రింక్స్, సోడా, టీలకు బదులు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. వాటిప్లేస్ లో నీళ్లు తాగాలి. కోక్, టీ, జ్యూస్ లకు బదులు ఒక గ్లాసు నీళ్లు తాగితే చాలు. ఇలా చేయడం వల్ల కేవలం షుగర్ ని తగ్గించడమే కాకుండా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం

గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుని తాగడం వల్ల.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

English summary

Wow There, Lose 5 Kg in 10 Days by Drinking Water

Wow There, Lose 5 Kg in 10 Days by Drinking Water. Chug a few glasses of water and lose those extra pounds. We are not saying this but a study published in the Obesity is.
Desktop Bottom Promotion