ఇలా చేస్తే బరువు తగ్గుతారు.. బాడీ ఫిట్ అవుతుంది

Written By: Bharath
Subscribe to Boldsky
weight loss diet

2018 త్వరలో రానుంది. వచ్చే ఏడాది నుంచైనా మీరు మీ అధిక బరువు, పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. అందుకోసం ప్లాన్ చేసుకోండి. కొన్ని ఆహారనియమాలు పాటిస్తే ఏడు రోజుల్లో మీరు కనీసం 10 పౌండ్ల బరువు తగ్గుతారు. మేము మీరు ఏమి తినాలో ఏమి తినకూడదు ఇక్కడ వివరించాం. ఈ 40 రకాల సూచనలు పాటిస్తే చాలు. మీరు త్వరలో బరువు తగ్గిపోతారు. మరి అవి ఏమిటో మీరే చూడండి.

# 1. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

# 1. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

మీరూ రోజూ ప్రోటీన్స్ తీసుకుంటే చాలా మంచిది. దీని వల్ల మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే శరీరానికి రోజుకు దాదాపు 80 - 100 కేలరీలు అందుతాయి. మీ జీవక్రియ పెరుగుతుంది. అందువల్ల ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

# 2. ప్రాసెస్ డ్ చేసిన ఆహారాలు తినకండి

# 2. ప్రాసెస్ డ్ చేసిన ఆహారాలు తినకండి

ప్రాసెస్ డ్ చేసిన ఆహారాలను తినకుండా ఉండడం మంచిది. వీటి వల్ల శరీరంలోకి అదనపు కొవ్వు చేరుతుంది. మనం కొన్ని రకాల చిప్స్ ను ఎక్కువగా తింటూ ఉంటాం. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. అందువల్ల వీలైనంత వరకు ప్రాసెస్ డ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది.

# 3. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి

# 3. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి

పండ్లు, కూరగాయలు వీలైనన్నీ ఎక్కువగా తినాలి. వీటి వల్ల కూడా అధిక బరువు తగ్గగలుగుతారు. ఇవి శరీరంలో ఉన్న ఫ్యాట్ ను కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి.

# 4. హోల్ ఫుడ్స్

# 4. హోల్ ఫుడ్స్

విత్తనాలు, నట్స్,తృణధాన్యాలు వంటి వాటితో తయారు చేసే కొన్ని రకాల ఫుడ్స్ చాలామంచివి. మామూలు బ్రెడ్ కాకుండా కొన్ని రకాల నట్స్ తో తయారు చేసే బ్రెడ్ తీసుకోవడం మంచిది.

# 5. అన్ హెల్తీ ఫుడ్స్ తీసుకోకండి

# 5. అన్ హెల్తీ ఫుడ్స్ తీసుకోకండి

చాలామంది ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తిందాములే అని తింటుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే మీ ఇంట్లో కూడా అన్ హెల్తీ ఫుడ్స్ అస్సలు పెట్టుకోకండి. వీలైనంత వరకు ఫ్రెష్ గా ఉండే ఫుడ్స్ నే మీరు ఇంట్లో ఉంచుకోండి. చిప్స్ లాంటివి తినకపోవడమే మంచిది.

# 6. చక్కెర తీసుకోవడం తగ్గించండి

# 6. చక్కెర తీసుకోవడం తగ్గించండి

చాలామంది చక్కెరతో కూడిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చక్కెర ఉన్న పదార్థాల వల్ల డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి ఆహారాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

# 7. తినే ముందు ఒక గ్లాస్ నీరు తాగండి

# 7. తినే ముందు ఒక గ్లాస్ నీరు తాగండి

మీరూ తినే ముందు ఒక గ్లాస్ నీరు తప్పకతాగాలి. ఈ విధంగా చేయడం వల్ల త్వరగా తిన్న అన్నం జీర్ణం అవుతుంది. ఫ్యాట్ పేరుకుపోకుండా ఉంటుంది.

# 8. చక్కెర లేకుండా కాఫీని తాగండి

# 8. చక్కెర లేకుండా కాఫీని తాగండి

అలా ఎలా తాగుతారు అని మీరు అనుకోవొచ్చు. అయితే ప్రారంభంలో ఇలా తాగడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు గానీ రానురాను అలవాటైపోతుంది. ఇలాంటి కాఫీ కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సాయపడుతుంది.

# 9. స్పోర్ట్స్ డ్రింక్స్ వద్దు

# 9. స్పోర్ట్స్ డ్రింక్స్ వద్దు

స్పోర్ట్స్ డ్రింక్స్ తాగకుండా ఉండడం మంచిది. దీని వల్ల మీకు అనారోగ్యమే తప్పా ఎలాంటి ఆరోగ్యం ఉండదు. అందువల్ల వీలైనంత వరకు వీటి జోలికి వెళ్లొద్దు.

# 10. శుద్ధి చేసిన పిండి పదార్థాలు వద్దు

# 10. శుద్ధి చేసిన పిండి పదార్థాలు వద్దు

పిండి పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అస్సలు తినకూడదు. తెల్లగా ఉండే బ్రెడ్, తెల్ల పిండిలతో తయారు చేసే పదార్థాలు, పాస్తా వంటి వాటిని అస్సలు తినకపోవడమే మంచిది.

# 11. అప్పుడప్పుడు ఉపవాసం

# 11. అప్పుడప్పుడు ఉపవాసం

అప్పుడప్పుడు ఉపవాసం పాటించడం చాలా మంచిది. దీని ద్వారా కూడా ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. అయితే అతిగా పాస్టింగ్ చేయడం కూడా మంచిది కాదు.

# 12 గ్రీన్ టీ

# 12 గ్రీన్ టీ

గ్రీన్ టీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చక్కెర లేకుండా గ్రీన్ టీని తాగితే చాలా మంచిది. దీనివల్ల ఈజీగా బరువు తగ్గిపోతారు.

# 13. చిన్న ప్లేట్ లో తినడం

# 13. చిన్న ప్లేట్ లో తినడం

పెద్ద ప్లేటలో కాకుండా చిన్న ప్లేట్ లో తింటే చాలామంచిది. పెద్ద ప్లేట్ అయితే ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. అందువల్ల వీలైనంత వరకు చిన్న ప్లేట్ లోనే తినండి.

# 14 నెమ్మదిగా నమిలి తినాలి

# 14 నెమ్మదిగా నమిలి తినాలి

తినే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. స్పీడ్ గా తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తింటారు. అలాగే అది కొవ్వుగా మారే అవకాశం ఉంది.

 # 15. కడపు నిండేలా తినకండి

# 15. కడపు నిండేలా తినకండి

మీరు ఎప్పుడైనా కడుపు నిండేలా తినకండి. కాస్త తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోకుండా ఉంటుంది.

# 16. ఆలివ్ లేదా ఆవనూనె

# 16. ఆలివ్ లేదా ఆవనూనె

మీరు రోజూ వారి తినే ఆహారపదార్థాలను ఆలివ్ లేదా ఆవనూనె ద్వారా తయారు చేసుకుంటే మంచిది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు వీటితో తయారు చేసే ఆహారపదార్థాలను తినడం మంచిది.

#. 17 . ఫుడ్ డైరీ మెయిన్ టెన్ చేయండి

#. 17 . ఫుడ్ డైరీ మెయిన్ టెన్ చేయండి

మీరు రెగ్యులర్ గా ఫుడ్ డైరీ మెయిన్ టెన్ చేయడం చాలా మంచిది. దీని వల్ల మీరు ఏ సమయానికి ఏం తినాలనే విషయం మీకు తెలుస్తుంది. చాలామంది లావు తగ్గడానికి కారణం వారు ఫుడ్ డైరీ మెయిన్ టెన్ చేయడమేనని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

# 18. బరువు తగ్గాలనుకునే వ్యక్తితో స్నేహం చేయండి

# 18. బరువు తగ్గాలనుకునే వ్యక్తితో స్నేహం చేయండి

మీలాగే బరువు తగ్గాలని కోరుకునే వ్యక్తి లేదా మీ ఫ్రెండ్ తో మీరు తరుచుగా లాస్ వెయిట్ పై చర్చించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఒకరి ఐడియాస్ ఒకరు తెలుసుకుని త్వరగా బరువు తగ్గొచ్చు.

# 19. ఎక్కువ సార్లు తినండి

# 19. ఎక్కువ సార్లు తినండి

మీరు రోజూ ఎక్కువ సార్లు తినడం చాలా మేలు. ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ప్రతి మూడు గంటలకు మీరు ఏదైనా ఒకటి తింటూ ఉండండి. అలా కాకుండా ఎక్కువ సేపు గ్యాప్ ఇస్తే ఆకలి ఎక్కువై ఎక్కువ తినాలని అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువసార్లు తినడం చాలా మంచిది.

# 20. తినేటప్పుడు ఈ పనులొద్దు

# 20. తినేటప్పుడు ఈ పనులొద్దు

చాలా మంది తినేటప్పుడు చాలా పనులు చేస్తుంటారు. టీవీ చూడటం, పుస్తకాలు చదవడం, సంగీతాన్ని వినడం వంటివి చేస్తుంటారు. అయితే అలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అలా చేస్తే వాటి ధ్యాసలో ఉండి ఎక్కువగా తింటారు.

# 21. ఆపిల్, పిప్పరమెంటు లేదా అరటి పండు

# 21. ఆపిల్, పిప్పరమెంటు లేదా అరటి పండు

మీరు బయటకు వెళ్లినప్పుడు ఆకలి అనిపించినప్పుడు వెంటనే ఏదో ఒకటి తినేయకుండా ఆపిల్, పిప్పరమెంటు లేదా అరటి పండు తినడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో అధిక ఫ్యాట్ పేరుకుపోదు.

# 22. నీలం కలర్ చాలా మేలు

# 22. నీలం కలర్ చాలా మేలు

మీరు ఉండే గది లేదంటే మీరు తినే ప్లేట్ వంటివి బ్లూ కలర్ లో ఉండేటట్లు చూసుకోండి. ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్ మీకు ఆకలి ఎక్కువ కలిగేలా చేస్తాయి. అందువల్ల మీరు మీకు సంబంధించినవి బ్లూ కలర్ లో ఉండేలా చూసుకోండి.

# 23. అద్దం ముందు కూర్చొని తినండి

# 23. అద్దం ముందు కూర్చొని తినండి

మీరు అద్దం ముందు కూర్చొని తినడానికి ప్రయత్నించండి. దీనివల్ల లిమిట్ లో తినగలుగుతారు. అందువల్ల వీలైనంత వరకు ఇలా చేయడానికి ప్రయత్నించండి.

# 24. మెట్లు ఎక్కుతూ ఉండండి

# 24. మెట్లు ఎక్కుతూ ఉండండి

మెట్లు ఎక్కడం అనేది ఒక వ్యాయామమే. ఇది కూడా మీ శరీరంలోని కేలరీలు కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 అప్ స్టెయిర్స్ కు మెట్లు ఎక్కడం చాలా మంచిది.

 # 25. గుడ్లు ఎక్కువగా తినండి

# 25. గుడ్లు ఎక్కువగా తినండి

మీరు గుడ్లను కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే గుడ్ వైట్ తింటే మంచిది. పచ్చ సోన తినకుండా ఉండండి. రోజూ గుడ్లను తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. బరువు పెరగకుండా ఉంటారు.

# 26. క్యాప్సికం

# 26. క్యాప్సికం

క్యాప్సికం లేదా చిల్లీ పెప్పర్స్ కూడా జీవక్రియను బాగా పెంచుతాయి. శరీరంలోని కొవ్వును మొత్తం కరిగించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.

అందువల్ల రెగ్యులర్ మీరు తినే ఆహార పదార్థాల్లో క్యాప్సికం ఉండేలా చూసుకోండి.

# 27. పెరుగు

# 27. పెరుగు

పెరుగు సహజ సిద్ధమైన ప్రోబయోటిక్. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల రెగ్యులర్ గా మీరు రోజూ ఒక గిన్నె పెరుగు కూడా తీసుకుంటూ ఉండాలి.

# 28. తగినంత సమయం నిద్రపోండి

# 28. తగినంత సమయం నిద్రపోండి

చాలామంది నిద్ర సరిగ్గా పోకపోవడంతో కూడా లావైపోతుంటారు. నిద్రలేమి వల్ల బరువు పెరిగిపోయేవారు 55% మంది ఉన్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల మీరు సక్రమంగా నిద్రపోండి.

# 29. ఫైబర్ అధికంగా తీసుకోండి

# 29. ఫైబర్ అధికంగా తీసుకోండి

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి కడుపు నిండిదనే భావన మీలో కలిగిస్తాయి. అయితే శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. అందువల్ల మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి.

# 30. ఎక్కువగా తినాలనే ఆశ

# 30. ఎక్కువగా తినాలనే ఆశ

చాలా మంది ఫుడ్ కు అడిక్ట్ అయిపోయి ఉంటారు. రకరకాల ఆహారపదార్థాలను ప్లాన్ వేసుకుని మరీ తింటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల మరింత బరువు పెరగిపోతారు. ఎక్కువ మంది సుగర్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల త్వరగా అధిక బరవు సమస్యతో ఇబ్బందిపడతారు.

# 31. తరుచుగా వ్యాయామం

# 31. తరుచుగా వ్యాయామం

తరుచుగా వ్యాయామం చేస్తూ ఉండాలి. కార్డియోలాంటివి చేయడం మంచిది. వ్యాయామం వల్ల మీలో జీవక్రియ రేట్ పెరుగుతుంది. ఫలితంగా కేలరీలు తగ్గుతాయి.

# 32. జీవనశైలి మార్చుకోండి

# 32. జీవనశైలి మార్చుకోండి

మీరు జీవనశైలి మార్చుకోవాలి. ఆరోగ్యం కోసం కాస్త సమయాన్ని మీ బిజీ షెడ్యూల్ లో చేర్చుకోవాలి. అలా చేస్తేనే మీరు త్వరగా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.

# 33. ఫిట్నెస్ బ్యాండ్ ఉపయోగించండి

# 33. ఫిట్నెస్ బ్యాండ్ ఉపయోగించండి

ప్రతి మనిషి రోజూ ఏదో కారణాల వల్ల 2000 - 3000 అడుగులు నడస్తుంటాడు. అయితే అధిక బరువుతో బాధపడేవారు అదనంగా మరో 1000 అడుగులు నడవాలి. అయితే మీరు ఎంత దూరం నడుస్తున్నారనే విషయం తెలియడానికి మీరు ఫిట్నెస్ బ్యాండ్ ఉపయోగించాలి.

# 34. ఇంటి ఆహారమే తినండి

# 34. ఇంటి ఆహారమే తినండి

మీరు వీలైనంత వరకు ఇంటి భోజనాన్నే తినండి. ఇది ఆరోగ్యానికి హానికరం. అలాకాకుండా రెస్టారెంట్లు, హోటల్స్ భోజనం తినడం మంచిది కాదు. తక్కువ కాలంలో మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ సూత్రాన్ని కచ్చితంగా పాటించండి.

# 35. నీళ్లు అధికంగా ఉండే ఫుడ్స్

# 35. నీళ్లు అధికంగా ఉండే ఫుడ్స్

మీరు నీళ్లు అధికంగా ఉండే ఫుడ్స్ తినడం మంచిది. దోసకాయలు, వోట్మీల్ వాటర్, స్మూతీస్ వంటి ఆహారాలు ఎక్కువగా తినాలి. దీంతో మీరు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

# 36 . కొన్ని ఆహారాల్ని మితంగా తినండి

# 36 . కొన్ని ఆహారాల్ని మితంగా తినండి

మీరు కొన్ని ఆహారాలని మితంగా తినడం మంచిది. జంక్ ఫుడ్స్ ఒకవేళ తినాలనిపిస్తే మీరు చాలా తక్కువగా తినాలి.

 # 37. ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేయండి

# 37. ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేయండి

మీరు రెగ్యులర్ చేసే బ్రేక్ ఫాస్ట్ కాకుండా కాస్త డిఫరెంట్ గా అల్పాహారంగా తీసుకోవాలి. బేకన్, గుడ్లు, పండ్లు తదితర వాటిని బ్రేక్ ఫాస్ట్ మాదిరిగా తీసుకుంటే మంచిది.

# 38. టమాట

# 38. టమాట

టమాట సంబధిత పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. వాటిలో తక్కువ కేలరీలుంటాయి. అలాగే మీరు తినే పదార్థాలకు సాస్ కావాలనుకుంటే టమాట సాస్ తినడం మంచిది.

# 39. నట్స్

# 39. నట్స్

నట్స్ లేదా ఎండుద్రాక్ష తినడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా పోషకాలుంటాయి. కేలరీలు సరైనన్నీ ఉంటాయి. ఒకరోజులో కనీసం రెండుసార్లు అయినా గుప్పుడు నట్స్ తింటే మంచిది.

 # 40. విభజించుకోని తినాలి

# 40. విభజించుకోని తినాలి

మీరు అన్ని పదార్థాలను ఒకేసారి తినకుండా ఒక్కో టైమ్ లో ఒక్కో ఆహారాపదార్థాన్ని తినేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఇలా రకరకాల ఆహారపదార్థాలను ఒక్కో సమయంలో ఒక్కొక్కదాన్ని తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఈ సూచనలన్నీ పాటిస్తే మీరు కచ్చితంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

English summary

40 natural weight loss tips

40 Natural Weight Loss Tips That Will Blow Your Mind!
Story first published: Tuesday, December 12, 2017, 16:30 [IST]
Subscribe Newsletter