పొట్ట దగ్గర కొవ్వు పోవాలంటే ఇలా చేసి చూడండి!

Written By: Bharath
Subscribe to Boldsky

చాలామందిలో పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతుంటుది. దీంతో చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కరిగించడం కష్టం. జిమ్ లో ఎన్ని రకాల కుస్తీలు పట్టినా ఒక్కోసారి పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మాత్రం తగ్గదు. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా త్వరితగతిన తగ్గిపోతుంది. ఉదర భాగంలో కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బంది కలుగుతుంది. ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకోసం ఈ 31 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.

1. వెల్లుల్లి

1. వెల్లుల్లి

రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తింటే పొట్ట భాగంలో ఏర్పడిన కొవ్వు తగ్గిపోతుంది. ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది.

2. జీలకర్ర

2. జీలకర్ర

రెండు స్పూన్ల జీలకర్ర తీసుకోండి. దాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి.

ఉదయాన్నే విత్తనాలను తీసివేయండి. లేదంటే వడకట్టండి. అందులో సగం నిమ్మకాయను తీసుకుని రసాన్ని పిండండి. ఆ నీటిని తాగండి. దీన్ని పరగడుపున తాగితే వెంటనే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ నడుము చుట్టు ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

3. వేడి నీరు

3. వేడి నీరు

ఉదయం లేచి మొదట కాస్త వేడి నీరు తాగండి. ఇది మీ శరీంలోని ఫ్యాట్ ను మొత్తం కరిగిస్తుంది. దీంతో మీరూ ఈజీగా మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ ను కరిగించుకోవొచ్చు.

4. వెచ్చని నీరు & నిమ్మకాయ

4. వెచ్చని నీరు & నిమ్మకాయ

కాస్త గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలపండి. ఆ నీటిని తాగడం వల్ల కూడా ఉదర భాగంలోని కొవ్వు ఈజీగా తొలిగిపోతుంది.

5. తేనె

5. తేనె

తేనె ద్వారా ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు. రోజూ కొద్దిపాటి తేనేను మీరూ తీసుకుంటూ ఉండండి. మీరు తీసుకునే కొన్ని రకాల్లో పానీయాల్లోనే చక్కెరకు బదులుగా తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా మీరు ఈజీగా బరువు తగ్గుతారు.

6. టమాటాలు

6. టమాటాలు

టొమాటో జ్యూస్ కూడా శరీరంలోని కొవ్వుని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. కొద్దిపాటి టమాటాల జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారు.

7. అల్లం

7. అల్లం

పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం బాగా పని చేస్తుంది. దీన్ని మీరు రోజూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి.

8. ఏలకులు

8. ఏలకులు

యాలకులు జీర్ణశక్తి పెంచే శక్తి కలగి ఉంటాయి. అలాగే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి కూడా యాలకులకు ఉంటుంది.

9. దాల్చిన చెక్క

9. దాల్చిన చెక్క

దాల్చినచెక్క పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బాగా పని చేస్తుంది. ఈ విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. కొద్దిపాటి వేడి నీటిలో తేనె, దాల్చిన చెక్కను కలుపుకుని తాగితే ఉదర ప్రాంతంలో ఉంటే ఫ్యాట్ కరిగిపోతుంది.

10. పుదీనా

10. పుదీనా

పొత్తికడుపు వద్ద పేరుకుపోయిన కొవ్వును పుదీనా సులభంగా తొలగిస్తుంది. మీరూ రోజూ పుదీనాను తీసుకుంటూ ఉండాలి.

11. ఆపిల్ సైడర్ వెనీగర్

11. ఆపిల్ సైడర్ వెనీగర్

ఆపిల్ సైడర్ వెనీగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు.

12. కొత్తిమీర జ్యూస్

12. కొత్తిమీర జ్యూస్

కొత్తిమీరలో విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కెలొరీస్ మాత్రం తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి మెరగువుతుంది. అలాగే ఉదరభాగంలో ఉండే కొవ్వుును కూడా కొత్తిమీర జ్యూస్ తగ్గించగలదు.

 13. కరివేపాకు

13. కరివేపాకు

కరివేపాకు శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మనం తినే ఆహారాల్లో కరివేపాకు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఊబకాయం దరిచేరదు.

14. అవిసెగింజలు

14. అవిసెగింజలు

అవిసెగింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. వీటిలో శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో క్రియాశీలకంగా పని చేస్తాయి.

15. బాదం

15. బాదం

బాదంలో ఫైబర్ ఎక్కవగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. బాదంపప్పును అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల ఉదరం దగ్గర ఉండే కొవ్వు ఈజీగా తగ్గిపోతుంది.

16. పుచ్చకాయ

16. పుచ్చకాయ

వాటర్ మిలాన్ లేదా పుచ్చకాయ (కళింగరపండు) బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ రెండు గ్లాసుల పుచ్చకాయ రసం తాగితే త్వరగా మీ పొట్ట ప్రాంతంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది.

17. బీన్స్

17. బీన్స్

బీన్స్ లోనూ ఫైబర్ అధికంగా ఉంటుది. మీరు రోజూ తినే ఆహారంలో బీన్స్ ను భాగం చేసుకోండి. దీంతో ఈజీగా మీరు పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవొచ్చు

18. దోసకాయ

18. దోసకాయ

దోసకాయ జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని చాలా కేలరీలను ఇది కరిగించి వేస్తుంది. రోజూ ఒక దోసకాయ తినండి. దీంతో ఈజీగా మీ ఉదర భాగంలోని కొవ్వు కరిగిపోతుంది.

19. ఆపిల్

19. ఆపిల్

ఆపిల్ ని రోజూ తింటూ ఉండండి. దీంతో మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే మీ ఉదరభాగంలోని కొవ్వు తగ్గిపోతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్యాట్ ను తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

20. గుడ్లు

20. గుడ్లు

గుడ్లు కూడా ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ వీటిని తింటే మీ శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. బాడీ మొత్తం ఫిట్ గా మారతుంది. వీటన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు రెగ్యులర్ గా ఈ ఆహారాలను తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందించినట్లవుతుంది.

21. గ్రీన్ టీ

21. గ్రీన్ టీ

గ్రీన్ టీ లో కేట్చిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా పని చేస్తాయి. అందువల్ల ఎక్కువగా గ్రీన్ టీ తాగుతూ ఉండాలి.

22. డాండెలైన్

22. డాండెలైన్

కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది బాగా పని చేస్తుంది. పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించడానికి డాండెలైన్ బాగా పని చేస్తుంది.

23. వోట్స్

23. వోట్స్

వోట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా తయారు చేసిన ఆహారపదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఉదరభాగంలో పేరుకుపోయిన కొవ్వు మొత్త తగ్గిపోతుంది.

24. అవకాడో

24. అవకాడో

అవకాడో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే ఎక్కువగా ఆకలికాకుండా చేస్తుంది. ఉదరప్రాంతంలోని కొవ్వులను వెంటనే తగ్గించగల శక్తి అవకాడోకు ఉంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

25. పీనట్ బట్టర్

25. పీనట్ బట్టర్

పీనట్ బట్టర్ మీ శరీరంలోని ఫ్యాట్ ను తగ్గించేస్తుంది. ఇందులో మోనో శాట్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో ఫ్యాట్ కరిగిపోతుంది.

26. సొరకాయ

26. సొరకాయ

రోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒకగ్లాస్ సొరకాయరసం తాగితే చాలా మంచిది. దీంతో మీ పొట్ట మొత్తం కరిగిపోయి ఫ్లాట్ టమ్మీగా మారుతుంది. ఇది కొవ్వును తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది.

27. యోగర్ట్

27. యోగర్ట్

యోగర్ట్ కూడా కొవ్వును కరిగించడంలో బాగా పని చేస్తుంది. రెగ్యులర్ గా యోగర్ట్ తినేవారు చాలా తక్కువ టైమ్ లో పొట్టను తగ్గించుకోగలగుతారు.

28. అరటి

28. అరటి

ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే ఉంటే పొట్ట దగ్గరున్న కొవ్వు కరిగిపోతుంది. రెగ్యులర్ తింటూ ఉంటే దీని ప్రయోజనాలు మీకే తెలుస్తాయి.

29. క్రాన్బెర్రీ జ్యూస్

29. క్రాన్బెర్రీ జ్యూస్

కొవ్వును కరిగించడంలో ఇది చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే పొట్ట దగ్గరున్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

30. ఫిష్ ఆయిల్

30. ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల ఫిష్ ఆయిల్ తో తయారు చేసిన ఆహారపదార్థాలను ఎక్కువగా తింటూ ఉండాలి. దీంతో ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వు మొత్తం తగ్గిపోతుంది.

31. క్యాని పెప్పర్

31. క్యాని పెప్పర్

ఇది శరీరంలోని కొవ్వు కరిగించడానికి బాగా పని చేస్తుంది. కాబట్టి మీరు తినే ఆహారాపదార్థాల్లో ఇది ఉండేలా చూసుకోండి. వీటన్నింటిని రెగ్యులర్ గా తీసుకుంటే మీ పొట్ట దగ్గరున్న కొవ్వు వెంటనే తగ్గుతుంది. అలాగే బాడీలో ఫ్యాట్ ను పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ పైన పేర్కొన్న 31 రకాల ఆహారాలను తీసుకుని డైట్ పాటిస్తూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరి. పొట్ట దగ్గరుంటే కొవ్వు పటాపంచలవుతుంది. ఎందుకంటే ఈ ఆహారాలన్నీ కూడా చాలా పవర్ ఫుల్ గా పని చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నేటి నుంచి వీటిలో కొన్నింటినైనా తింటూ ఉండండి.

English summary

home remedies to reduce tummy fat

You need to try out these best home remedies for tummy fat. Read further to know!