For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి ప్రపంచమంతా పాటించే డైట్ ఇదే

ఏడు రోజుల్లో బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి.. శరీరంలోని కొవ్వును మొత్తం కరిగించి, మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చే ప్లాన్ ఉంటే కచ్చితంగా అందరూ అదే ఫాలో అవుతారు. ఇందుకోసం ఒక డైట్ ప్లాన్ ఉంది.

By Bharath
|

ఏడు రోజుల్లో బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి.. శరీరంలోని కొవ్వును మొత్తం కరిగించి, మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చే ప్లాన్ ఉంటే కచ్చితంగా అందరూ అదే ఫాలో అవుతారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఒక డైట్ ప్లాన్ ఉంది. చాలామంది సెలెబ్రిటీస్, క్రీడాకారులు, ప్రముఖులంతా ఈ ప్లాన్ ఫాలో అవుతుంటారు. ఆ ప్లాన్ పేరే జీఎం (జనరల్ మోటార్స్) ప్లాన్. జనరల్ మోటార్స్ దీన్ని రూపొందించడం వల్ల దీని పేరు ఇలా మారిపోయింది.

కచ్చితంగా బరువు తగ్గుతారు.. నో డౌట్

కచ్చితంగా బరువు తగ్గుతారు.. నో డౌట్

ఈ డైట్ ప్లాన్ పాటిస్తే కచ్చితంగా ఏడురోజుల్లో ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ డైట్ ను పక్కాగా ఫాలో అయితే వారంలోనే 15 పౌండ్లు ( 6.8 కి.గ్రా) వరకు మీరు బరువు తగ్గుతారు. మీరు ఇందుకోసం ఉపయోగించే ఫుడ్స్ కూడా చాలా సింపుల్ గానే ఉంటాయి. అవన్నీ కూడా మీకు మార్కెట్లో లభిస్తాయి.

అంతటా ఇది సక్సెస్ ఫుల్

అంతటా ఇది సక్సెస్ ఫుల్

అంతటా ఇది సక్సెస్ ఫుల్

ఈ డైట్ ప్లాన్ ను జనరల్ మోటార్స్ వారు వారి ఉద్యోగుల కోసం తయారు చేశారు. అక్కడి ఇది సక్సెస్ ఫుల్ అయింది. వారి ఉద్యోగులంతా కూడా దీన్ని రెగ్యులర్ గా పాటించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. దీంతో ప్రపంచం మొత్తం అందరూ ఈ డైట్ ప్లాన్ పాటించేవాళ్లు చాలామందే ఉన్నారు.

సందేహం వద్దు

ఏడురోజులు ఏడు రకాల ప్రత్యేక ఆహారాలు తీసుకోవడానికి మొదట ప్రయత్నించాలి. తర్వాత వాటినే రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇంకా మంచిది.అయితే ఈ డైట్ లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు, సూప్స్, ప్రోటీన్లతో కూడిన పదార్థాలు (మాంసం లేదా కాటేజ్ చీజ్ వంటి) ఉంటాయి. అయితే కేవలం వీటిని తినడం వల్ల మాత్రమే ఎలా బరువు తగ్గుతారని చాలామందికి సందేహం ఉంటుంది.

పాటించి చూడండి

పాటించి చూడండి

ఇవన్నీ కూడా శరీరంలో జీవక్రియను పెంచుతాయి. మీరు జంక్ ఫుడ్ తినకుండా నియంత్రిస్తాయి. ఇంతవరకు మీరు ఎన్నో డైట్ ప్లాన్స్ పాటించి ఉంటారు. వాటి వల్ల విసిగి చెంది ఉంటారు. కానీ ఇప్పుడు దీన్ని కచ్చితంగా పాటించి చూడండి. కావాలంటే మీకు తెలిసిన డైటీషియన్స్ కూడా దీని గురించి అడగండి. ఇది చాలా మంచి డైట్ ప్రక్రియ.

కరెక్ట్ గా ఫాలో అయితే చాలు

కరెక్ట్ గా ఫాలో అయితే చాలు

మీరు ఏడు రోజుల పాటు కరెక్ట్ గా డైట్ పాటిస్తే చాలు. మీకు ఈ రోజు ఈ డైట్ పరిచయం చేసేందుకు ఈ ఆర్టికల్ సాయం చేస్తుంది. ఇలాంటి ఆర్టికల్స్ (జీఎం డైట్గురించి ) ఇక నుంచి ఏడురోజుల పాటు వరుసగా వస్తాయి. వీటన్నింటినీ మీరూ రెగ్యులర్ గా చదివి అందులో ఇచ్చిన అంశాలను పాటిస్తే చాలు.

రోజూ పాటించాల్సిన డైట్ క్లుప్తంగా..

రోజూ పాటించాల్సిన డైట్ క్లుప్తంగా..

ఒక్కోరోజు మీరు పాటించాల్సిన డైట్ ను మీకు ఇందులో వివరిస్తున్నాం. వీటిని పాటిస్తే చాలు. మొదటి రోజు ఫ్రూట్ డే, రెండో రోజూ కూరగాయల డే ఇలా ఒక్కో రోజు ఒక్కో డే పాటించాలి. వీటి గురించి క్లుప్తంగా తెలుపుతున్నాం. తర్వాత ఆర్టికల్స్ లో ఒక్కోదాని గురించి మళ్లీ పూర్తి వివరాలుంటాయి.

మొదటి రోజు (డే1) : ఫ్రూట్ డే

మొదటి రోజు (డే1) : ఫ్రూట్ డే

ఈ ఆహార ప్రణాళిక కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. అయితే పాటించే చూస్తే మాత్రం మీలో కచ్చితంగా మార్పు వస్తుంది. ఈ డైట్ లో భాగంగా మొదటి రోజు మొత్తం మీరు పండ్లు మాత్రమే తినాలి. అరటి తప్ప మిగిలిన పండ్లు తినొచ్చు. అన్ని రకాల పండ్లను మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పుడు ఆకలైతే అప్పుడు వాటిని తింటూ ఉండాలి.

ప్రతి పండులో ఫైబర్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మీరు రోజుంతా పండ్లను మాత్రమే తీసుకోవడం వల్ల మీకు 1000-1200 దాకాకేలరీలు అందుతాయి. మీరు ఏయే పండ్లు తీసుకోవాలనే విషయంల రేపటి ఆర్టికల్ లో తెలుసుకోవొచ్చు. రేపు డే వన్ డైట్ ప్లాన్ గురించి ఆర్టికల్ వస్తుంది.

రెండో రోజు (డే 2) : కూరగాయల డే

రెండో రోజు (డే 2) : కూరగాయల డే

మీరు రెండో రోజు కేవలం కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. ఇతర పదార్థాలు తీసుకోకూడదు. కొన్ని కూరగాయాలను నేరుగా తినొచ్చు. కొన్నింటిని వండుకోని తినాలి. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మీరు కేవలం కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవాలి. వీటి గురించి మరిన్ని వివరాలు మీరు డే టు డైట్ ప్లాన్ కింది మేము మరో రెండు రోజుల్లో ఇచ్చే ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటారు.

మూడో రోజు ( డే3) : పండ్లు + కూరగాయాలు

మూడో రోజు ( డే3) : పండ్లు + కూరగాయాలు

మూడో రోజు పండ్లు, కూరగాయలతో కూడిన డైట్ ఉంటుంది. మీరు మూడో రోజు అరటి, బంగాళదుంప తప్ప మిగతా అన్నీ కూరగాయలు, పండ్లు తినొచ్చు. మరి మూడో రోజు డైట్ ప్లాన్ గురించి మేము మూడు రోజుల్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే చాలు.

నాలుగో రోజు (డే4) : అరటి పండ్లు + పాలు

నాలుగో రోజు (డే4) : అరటి పండ్లు + పాలు

ఇక మీరు నాలుగో రోజు మొత్తం అరటి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. అవి తప్ప ఇంకేమి తినకూడదు. నీళ్లు తాగొచ్చు.

నాలుగో రోజు డైట్ వీలైనంత వరకు ఆదివారం పడేలా చూసుకోండి. ఎందుకంటే వీటిని తీసుకుంటే మీకు ఆ రోజు కాస్త మోషన్స్ ( బేదులు) కలిగే అవకాశం ఉంది.

ఇది మీ ఆరోగ్యానికి ఏమి ప్రమాదకరం మాత్రం కాదు. మరి వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంపై కూడా మేము మరో ఆర్టికల్ లో వివరిస్తాం. జీఎం డైట్ లో భాగంగా నాలుగో రోజు డైట్ లో పాటించాల్సిన విషయాలు మొత్తం కూడా మీరు త్వరలోనే తెలుసుకోవొచ్చు.

ఐదో రోజు ( డే5) : ప్రోటీన్లు + కూరగాయలు

ఐదో రోజు ( డే5) : ప్రోటీన్లు + కూరగాయలు

ఇక ఐదో రోజు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. మీరు మాంసం తినేవాళ్లయితే 500 గ్రాముల మాసం (ఏదైనా సరే) తీసుకోవొచ్చు. అలాగే కొన్ని రకాల కూరగాయాలు తినాలి. ఈ డైట్ గురించి కూడా మీకు డే 5 డైట్ లో భాగంగా వివరిస్తాం.

ఆరో రోజు (డే 6) : ప్రోటీన్స్ + కూరగాయలు

ఆరో రోజు (డే 6) : ప్రోటీన్స్ + కూరగాయలు

ఆరో రోజు డైట్ కూడా ఐదో రోజు డైట్ మాదిరిగానే ఉంటుంది. అయితే కూరగాయాల్లో భాగంగా మీరు బంగాళదుంపలు తినకూడదు.

ఏడో రోజు (డే7) బ్రౌన్ రైస్ + పండ్లు & కూరగాయలు

ఏడో రోజు (డే7) బ్రౌన్ రైస్ + పండ్లు & కూరగాయలు

ఇది మీరు డైట్ పాటించే రోజుల్లో చివరి రోజు. ఈ రోజు మీరు పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్ తినొచ్చు. మీకు ఇవన్నీ కూడా కాస్త కొత్తగా అనిపించొచ్చు. అయితే ఈ డైట్ ప్లాన్ పాటిస్తే మీరు బరువు తగ్గడంతో పాటు చాలా ఆరోగ్యంగా ఉంటారు. డైట్ ను సక్రమంగా పాటించాలి. మీరు డైట్ లో లేని వాటిని తాగినా, తిన్నా మళ్లీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.

తినకూడనవి.. తాగకూడనివి

తినకూడనవి.. తాగకూడనివి

డైట్ లో భాగంగా గింజలతో కూడిన ఆహారాన్ని మీరు ఈ ఏడు రోజుల పాటు తినకూడదు. గోధుమలు, బియ్యం, పాస్తా వంటి వాటితో తయారైన ఆహారపదార్థాలు తినకూడదు.

అయితే మీరు మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు. అలాగే బీన్స్ కూడా తినకూడదు. బీన్స్ లో చాలా రకాలుంటాయి వాటన్నింటినీ తినకూడదు. ఎందుకంటే వీటిలో కేలరీలు చాలా దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని తినకూడదు. మీరు డైట్ లో భాగంగా కేవలం నీరు మాత్రమే తాగాలి. కాఫీ, టీ వంటివి తాగకూడదు. అయితే రోజులో ఒకసారి టీ గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ (చక్కెర లేకుండా) తాగొచ్చు.

రెడీ అయ్యారా?

రెడీ అయ్యారా?

ఇక ఈ డైట్ పాటించడానికి మీరు రెడీ అయ్యారా? ఏం డౌట్ గా ఉందా? ఓ.. ఇలాంటి చాలా చూశాంలే అనుకుంటున్నారా? నో డౌట్.. ఇది ప్రపంచమంతా వర్క్ అవుట్ అయ్యింది. ట్రై చేసి చూడు భయ్యా.. కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది! #ఏడు రోజుల డైట్ ప్లాన్ #7daydietplan

English summary

how to lose weight in 7 days at home

How to lose weight in 7 days at home..Here's the breakdown of all 7 days of the GM diet.
Desktop Bottom Promotion