For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్‌ని కరిగించేద్దాం ఇలా!

బెల్లీఫ్యాట్ ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య. చూడడానికి అంతా బాగానే ఉంటారు. కానీ టీ షర్ట్ వేస్తే మాత్రం అసలు రూపం బయటకొస్తుంది. ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోయి పొట్ట వచ్చి ఉంటుంది.

By Bharath
|

బెల్లీఫ్యాట్ ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య. చూడడానికి అంతా బాగానే ఉంటారు. కానీ టీ షర్ట్ వేస్తే మాత్రం అసలు రూపం బయటకొస్తుంది. ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోయి పొట్ట వచ్చి ఉంటుంది. అది చూడడానికి కాస్త అసహ్యంగా అనిపిస్తుంది.

కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ బెల్లీఫ్యాట్‌ని ప్లాట్ గా మార్చొచ్చు. స్మార్ట్‌ గా కనిపించొచ్చు. శరీరంలోని టాక్సిన్స్‌ తొలగిస్తే చాలు ఆటోమేటిక్ గ్గా ఫ్యాట్ కరిగిపోతుంది. అయితే ఇందుకోసం తిండి మానేసి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మంచి ఆహారాలు తింటూనే కొవ్వుని కరిగించుకోవొచ్చు.

పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరిగిపోతుందిలా!

పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరిగిపోతుందిలా!

తాజా పండ్లు, కూరగాయలు, డ్రైప్రూట్స్, మనం నిత్యం వంటలు తయారు చేసుకునేందుకు వినియోగించే కొన్ని రకాల మసాలా దినుసులు ఇలా చాలా వాటి వల్ల పొట్ట కరిగిపోతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తాయి. అంతే కాకుండా మెటాబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. తద్వారా కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.

పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరిగిపోతుందిలా!

పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరిగిపోతుందిలా!

బెల్లీ అంటే లావు పెరగడం, బరువు పెరగడం కాదు, కేవలం పొట్ట మాత్రమే ముందుకు రావడం. ఈ ఉరుకు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కొన్ని సింపుల్ హోం రెమిడీస్ ( గృహ చిట్కాలను) పాటిస్తే బెల్లీ ఫ్యాట్ అనేది ఉండదు. అలాగే ఈ ఆహారాలు ఫ్యాట్ ను కరిగించడమేకాకుండా పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. మరి అలాంటి ఫుడ్స్, డ్రింక్స్ ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. డాండెలైన్ టీ

1. డాండెలైన్ టీ

డాండెలైన్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. డాండెలైన్ టీ ద్వారా మీ శరీరంలోని మలినాలు మొత్తం మూత్రం రూపంలో బయటకు వెళ్లాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును, అక్కడ ఉండే టాక్సిన్స్ ను ఈ టీ బయటకు పంపుతుంది.

ఇలా తయారు చేసుకోవాలి :

ఒక గ్లాస్ నీరు తీసుకోండి. అందులో ఎండిన డాండెలైన్ ఆకులను వేయండి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల సేపు మరిగించండి. అందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలపండి. కాస్త తియ్యగా ఉండేందుకు కొద్దిగా తేనెను కలపండి. మీకు పైత్య నాళాలు లేదా పిత్తాశయం సంబంధిత సమస్యలు ఉంటే డాండెలైన్ టీ తాగకూడదు.

2. క్రాన్బెర్రీ జ్యూస్

2. క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీని వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఇది బాగా పని చేస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ , శ్వాసకోశ వ్యాధులు మూత్రపిండాల్లో రాళ్ళు, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర వ్యాధులకు గురికాకుండా, వాటిని అదుపులో ఉంచేందుకు ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.

క్రాన్బెర్రీ జ్యూస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీన్ని మీరు నేరుగా తాగలేకుంటే అందులో కాస్త నీరు కలుపుకుని తాగండి. ఇది అనేక రోగాల నివారణకే కాదు శరీరం లో కొవ్వును మొత్తం కరిగించేయడంలో చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

తయారీ ఇలా :

2 కప్పుల నీరు తీసుకోండి. అలాగే 100% స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్ 1/2 కప్పు తీసుకోండి. నీళ్లను, జ్యూస్ ను మిక్స్ చేసి తాగండి. ప్రతి రోజూ భోజనానికి ముందు ఈ క్రాన్బెర్రీ జ్యూస్ ను తాగితే చాలా మంచిది.

3. గ్రీన్ టీ

3. గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సైడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడానికి బాగా పని చేస్తాయి. గ్రీన్ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలపై వ్యతిరేకంగా పోరాడడంలో గ్రీన్ టీ బాగా పని చేస్తుంది. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది బాగా పని చేస్తుంది.

4. హాట్ పెప్పర్స్

4. హాట్ పెప్పర్స్

హట్ పెప్పర్స్ మీ జీవక్రియను పెంచుతాయి. వీటిలో కొవ్వు కరిగించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలోక్యాప్సైసిన్ అనే పదార్థం శరీరంలోని కేలరీలను కరిగించేస్తుంది. వీటిని మీరు తినే ఆహారపదార్థాల్లో ఉపయోగిస్తే మంచిది.

హబానరో పెప్పర్స్ లో ఎక్కువగా క్యాప్సైసిన్ ఉంటుంది. కారెన్ పెప్పర్స్ కూడా ఆరోగ్యానికి మంచివే. వీటి ద్వారా అన్ని రకాల వంటలు వండుకోవొచ్చు. వీటిని రెగ్యులర్ గా తినే ఆహారాల్లో ఉపయోగించడం వల్ల శరీరంలోని ఫ్యాట్ కరిగిపోతుంది.

5. చియా విత్తనాలు

5. చియా విత్తనాలు

చియా విత్తనాల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజు కనీసం 1 స్పూన్ చియా విత్తనాలను తింటూ ఉండండి. మీరు వీటిని స్మూతీస్ లేదా సెరల్ లేదా వోట్ మీల్ వంటి వాటిలోనూ ఉపయోగించొచ్చు. చియా విత్తనాలతో మీకు ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

6. కొబ్బరి నూనె

6. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా ఉదరభాగంలో ఉంటే కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో థర్మోజెనిక్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. సోయాబీన్ నూనెతో పోలిస్తే కొబ్బరి నూనెతో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

రోజుకు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. అయితే మన దగ్గర లభించే కొబ్బరి నూనె వంటలు చేయడానికి, తినడానికి అంతగా ఉపయోగపడదు. కేరళలో లభించే కొబ్బరి నూనె వంటలకు బాగా పనికి వస్తుంది.

7. అల్లం టీ

7. అల్లం టీ

అజీర్తి సమస్యను పరిష్కరించేందుకు అల్లం బాగా పని చేస్తుంది. కడుపులో వికారం ఉండడాన్ని ఇది నివారిస్తుంది. అల్లం కూడా థర్మోజెనిక్ గా పని చేస్తుంది. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. తద్వారా మీ బాడీలోని ఫ్యాట్ ను తక్షణమే కరిగించేస్తుంది.

అలాగే ఇది మన బాడీలోని కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తి కాకుండా చూస్తుంది. అధిక బరువు వల్ల ఒత్తిడి సమస్య తలెత్తుతుంది. అల్లం టీ దీన్ని తగ్గించడానికి బాగా పని చేస్తుంది. అల్లం టీని రోజు తాగితే పొట్ట దగ్గర ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

8. వ్యాయామం

8. వ్యాయామం

కొన్ని రకాల వ్యాయామాల ద్వారా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. మీరు శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. కేవలం పొట్ట తగ్గడం కోసం ప్రత్యేకంగా చేయకండి. రన్నింగ్ చేయడం లేదా జంప్ రోప్ (తాడు ఆట) చాలా బాగా పని చేస్తాయి. అలాగే మీ బాడీని కూడా బాగా బిల్డప్ చేయండి. దీని వల్ల మీరు మీ పొట్ట దగ్గర పేరకుపోయిన కొవ్వును ఈజీగా కరిగించేయొచ్చు.

9. హెర్బ్స్ (మూలికలు)

9. హెర్బ్స్ (మూలికలు)

కొన్ని రకాల మూలికలు కూడా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించగలవు. జిన్సెంగ్, అల్లం, పుదీనా ఇవి చాలా సమర్థంగా పని చేస్తాయి. శరీరంలో ఉండే కొవ్వునంతా ఇవి కరిగించేస్తాయి.

మీరు వీటి ద్వారా టీ తయారు చేసుకుని తాగితే మంచిది. కాస్త రుచికోసం తేనెను ఉపయోగించండి.

జిన్సెంగ్, అల్లం, పుదీనాలను వేర్వేరుగా టీలు తయారు చేసుకునేందుక ఉపయోగించొచ్చు. కేవలం పుదీనాతో లేదంటే అల్లంతో లేదంటే జిన్సెంగ్ తో ఇక లేదంటే ఈ మూడింటిని కలిపి కూడా మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగొచ్చు. ఇవి చాలా పవర్ ఫుల్ గా పని చేస్తాయి.

10. ఫిష్ ఆయిల్

10. ఫిష్ ఆయిల్

చేప నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలుంటాయి. అలాగే ఈపీఏ, డీహెచ్ ఏ ఉంటాయి. ఇది ఫ్యాట్ ను కరిగించడానికే కాదు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ ఎముకలు గట్టిగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. రోజుకు సుమారు 6 గ్రాముల చేప నూనెను తీసుకోవడం మంచిది. వారానికి రెండుసార్లు సాల్మొన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలను తింటూ ఉండండి.

11. లెమన్ వాటర్ తో బెల్లీ ఫ్యాట్ కోల్పోతారు

11. లెమన్ వాటర్ తో బెల్లీ ఫ్యాట్ కోల్పోతారు

లెమన్ వాటర్ ( నిమ్మకాయ నీరు) కూడా పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. మీ కాలేయం బాగా పని చేయడానికి నిమ్మకాయ నీరు బాగా పని చేస్తుంది. కాలేయాన్ని క్లీన్ చేసేందుకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మీ పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల తరచుగా నిమ్మకాయ నీరు తాగుతూ ఉండండి.

12. దాల్చిన చెక్క

12. దాల్చిన చెక్క

దాల్చినచెక్క కూడా ఫ్యాట్ ని కరిగించడంలో బాగా పని చేస్తుంది. అల్లంలాగే దాల్చినచెక్క కూడ థర్మోజెనిక్. ఇది శరీరంలో వేడిని పెంచి పొట్ట దగ్గరున్న కొవ్వును కరిగించేస్తుంది. అలాగే దాల్చిన చెక్క మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మీరు డయాబెటీస్ బారిన పడకుండా రక్షిస్తుంది.దాల్చినచెక్కను స్మూతీ, వోట్ మీల్, రోజూ తినే ఆహారాపదార్థాల్లో ఉపయోగించొచ్చు.

13. వెల్లుల్లి

13. వెల్లుల్లి

వెల్లుల్లి కూడా ఉదరభాగంలో పేరుకపోయికొవ్వును తగ్గించడంలో బాగా పని చేస్తుంది. అలాగే హృదయనాళాలకు సంబంధించిన సమస్యల్ని వెల్లుల్లి తొలగిస్తుంది. సిస్టోలిక్ , డయాస్టొలిక్ అనే రక్తపోటును వెల్లుల్లి తగ్గిస్తుంది. వెల్లుల్లి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గడానికి ఇది ఎక్కువగా తోడ్పడుతుంది.

వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటి పొట్టు తీసి తేనె డబ్బాలో వేయండి. తర్వాత ఆ తేనే డబ్బాకు మూత పెట్టండి. కొన్ని రోజులు ఆ తేనెను ఫ్రిడ్జ్ లోగానీ లేదా సెల్ఫ్ లో ఉంచండి. వెల్లుల్లిలోని ఔషధగుణాలన్నీ కూడా తేనేలోకి వెళ్తాయి. రెండు మూడు రోజుల తర్వాత నుంచి ఆ తేనెను తాగడం మొదలుపెట్టండి. ఇది పొట్ట దగ్గరున్న కొవ్వుని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. లేదంటే వెల్లుల్లి రెబ్బల్ని నేరుగా తిన్నా ప్రయోజనం ఉంటుంది.

14.లీన్ మీట్

14.లీన్ మీట్

థర్మోజెనిక్ గుణాలుంటే ఆహారాలు ఎక్కువగా తింటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. లీన్ మాంసం ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. లీన్ చికెన్, లీన్ బీఫ్, లీన్ పోర్క్ వంటి వాటిని ఎక్కువగా తింటే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మొత్తం తగ్గుతుంది.

15. జీవనశైలిలో మార్పు

15. జీవనశైలిలో మార్పు

కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం. ఇందులో ముఖ్యమైనది నిద్ర. నిద్ర సరిగ్గా పోకపోతే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. నిద్ర సరిగ్గా పోకపోవడం అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మీరు అధిక బరువు పెరుగుతారు. అలాగే ఒత్తిడికి గురికాకండి. వీటన్నింటినీ పాటిస్తే బరువు పెరగకుండా ఉంటారు.

16. నీరు ఎక్కువగా తాగండి

16. నీరు ఎక్కువగా తాగండి

డీహైడ్రేషన్ వల్ల కూడా మీరు బరువు పెరగొచ్చు. ఉదర ప్రాంతంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. మీరు రోజూ తగినంత నీటిని తాగుతుండాలి. లేదంటే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. మీరు రోజూ కనీసం 2 లీటర్ల నీటిని తాగడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్తాయి. అందువల్ల నీరుతాగడాన్ని మాత్రం విస్మరించకండి.

17. సక్రమంగా తినాలి

17. సక్రమంగా తినాలి

ఆహారాన్ని సక్రమంగా తీసుకుంటూ ఉండాలి. ఒకపూట తిని మరో పూట తినకుండా ఉంటే కచ్చితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అల్పాహారం: పండ్లు తీసుకోవొచ్చు. తాజా కూరగాయలలతో చేసిన పదార్థాలు తినాలి. అరటిపండ్లు, ద్రాక్ష, యాపిల్స్, క్యారట్ స్టిక్స్ వీటిన్నింటినీ తినొచ్చు.

- చక్కెరను ఎక్కువగా తీసుకోవొద్దు. ఇందులో ఎలాంటి పోషకాలుండవు. ఇది కేవలం శరీరానికి కేలరీలను అందిస్తుంది. దీని వల్ల అన్నీ అనార్థాలే ఉంటాయి. అందువల్ల తినే పదార్థాల్లో చక్కెర లేకుండా చూసుకోండి.

వీటినీ తినండి

వీటినీ తినండి

- అవోకాడో, నట్స్, సీడ్స్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండండి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఆరెంజ్ జ్యూస్ తాగటం, క్లెమెంటైన్లు, గ్రేప్ ఫ్రూట్స్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి.

- భోజనం చేయకుండా మీరు నిద్రకు ఉపక్రమించకండి. కచ్చితంగా తిన్నాకే పడుకోండి. ప్రతి పూట తినడం మాత్రం మరిచిపోకండి. తినకపోతే ఫ్యాట్ పేరుకుపోతుంది.

English summary

Incredible Home Remedies To Lose Belly Fat

Here are some natural home remedies to lose belly fat as quickly and easily as possible.
Desktop Bottom Promotion