For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గటానికి రోజంతా క్యాలరీలు ఖర్చయ్యేలా చేసే సులభమైన చిట్కాలు!

|

బరువు తగ్గాలనుకుంటున్న మార్గంలో మీరు వెళ్తున్నట్లయితే, తినే ప్రతిదాని క్యాలరీలు తెలుసుకుంటూ, మీకు నప్పే వ్యాయామాలను వెతుక్కుంటూ, మనస్సు నియంత్రణని పెంచుకుంటూ ఉండి ఉంటారు, కదా?

చాలాకేసుల్లో, అన్నీ సరిగ్గానే చేస్తున్నా, బరువు తగ్గరు. ఎందుకంటే సమస్య వారి మెటోబోలిక్ యాక్టివిటీ లేదా వారికున్న వివిధ వ్యాధుల వలన అయివుంటుంది.

ఇది చాలాసార్లు చిరాకు తెప్పించి, అసలు బరువు తగ్గే ప్రయత్నమే మానేసేలా చేస్తుంది. ఎందుకంటే చాలా సమయం దాటినా బరువులో మార్పు కన్పించదు కాబట్టి.

పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!

కానీ, పట్టుదల ఉంటేనే బరువు తగ్గుతారు, అది కూడా మనకి ఏది పనికొస్తుందో తెలుసుకునేవరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి.

శరీరంలో అధికబరువు పెరగటం వల్ల శక్తిహీనంగా కన్పించటమే కాదు, అతడు/ఆమె ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిని, అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయి.

Natural ways to lose weight

అధికబరువు వలన స్థూలకాయం, కీళ్ళనొప్పులు,జీర్ణక్రియ సమస్యలు, గుండె వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలకి మూలం అవుతుంది.

అధిక బరువుకి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, చలాకీగా లేకపోవటం, హార్మోనల్ అసమతుల్యత, వంశపారంపర్యం, నెమ్మదిగా మెటబాలిజం, కొన్ని మందుల పక్క ప్రభావాలు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు.

మీరు నమ్మలేని బరువు తగ్గించే చిట్కాలు మీరు నమ్మలేని బరువు తగ్గించే చిట్కాలు

బరువు తగ్గే ప్రయాణం మొదలుపెట్టేముందు, మీ అధికబరువు మూలకారణం ఏంటో తెలుసుకోవటం అత్యవసరం.

ఉదాహరణకి, మీ అధికబరువు అనారోగ్యకర జీవనశైలి, నెమ్మదైన మెటబాలిజం వలన వస్తున్నట్లయితే, దీన్ని మీరే పరిష్కరించుకోవచ్చు.

మెటబాలిక్ వేగం నెమ్మదించటం వలన అధిక కొవ్వు శరీరంలో పేరుకుంటుంది, ఎందుకంటే అది మీ శరీరం క్యాలరీలను తక్కువ వేగంతో ఖర్చయ్యేలా చేస్తుంది.

అందుకని, మీ మెటబాలిక్ వేగం పెరగటానికి ఇవిగో మా చిట్కాలు, ఇవి పాటించి రోజు మొత్తం క్యాలరీలను త్వరగా ఖర్చుచేయవచ్చు!

Natural ways to lose weight

బరువు తగ్గటం కోసం ఆకలితో మాడకండి

అన్నీ మానేసి ఆకలితో మాడటం వలన మీ మెటబాలిజంను మీరే తగ్గించుకుంటున్నారు. శరీరానికి ఆరోగ్యకర మెటబాలిక్ వేగానికి కనీసం రోజుకి 1000 క్యాలరీలు కావాలి. అందుకని తక్కువ కొవ్వు కల సమతుల్య ఆహారం తింటే, కొవ్వును త్వరగా ఖర్చు చేయగలిగే విధంగా మీ మెటబాలిక్ వేగం పెరుగుతుంది.

Natural ways to lose weight

వారానికి మూడు సార్లు బరువులు ఎత్తడం ప్రాక్టీసు చేయండి

ఈ విషయంపై చేసిన అనేక పరిశోధనల ప్రకారం, బరువులు ఎత్తడం వ్యాయామాలలో మంచిదైన మరియు మెటబాలిక్ వేగాన్ని పెంచే వ్యాయామంగా తేలింది. దీనివల్ల రోజంతా క్యాలరీలను ఖర్చుచేయవచ్చు. పురుషులు లేదా స్త్రీలు ఇద్దరూ బరువులు ఎత్తడాన్ని ప్రాక్టీసు చేయవచ్చు. ప్రభావం చూపించడం కోసం వారానికి మూడుసార్లైనా కనీసం చేయాలి.


ప్రొటీన్ అధికంగా వుండే పదార్థాలను తినండి

బరువు నిజంగా తగ్గాలనుకుంటే, మీ మెటబాలిక్ వేగాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి అధిక ప్రొటీన్లుండే పాలు, సెనగలు, చికెన్, అరటిపండు, పాలకూర, గుడ్లు, చీజ్ మొ.వి తింటూ ఉండండి. ప్రొటీన్ మెటబాలిక్ వేగం పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Natural ways to lose weight

మానసిక వత్తిడిని అదుపులో ఉంచుకోండి

మానసిక వత్తిడి కూడా మీ మెటబాలిక్ వేగం తగ్గడానికి కారణమవుతుంది. అందుకని క్యాలరీలు కూడా త్వరగా ఖర్చవ్వవు. అందుచేత మానసిక వత్తిళ్ళను అదుపులో ఉంచుకోవడం అవసరం.

English summary

Natural ways to lose weight

Natural ways to lose weight, Here are a few easy ways to have a healthy metabolic rate, so that you can lose weight effectively.
Story first published:Tuesday, October 17, 2017, 18:21 [IST]
Desktop Bottom Promotion