For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలుసా పండ్లు తినడం వలన చెడు క్రొవ్వులు తొలగించబడి అధిక బరువుని నియంత్రించుకోవచ్చని?

|

మీకు తెలుసా పండ్లు తినడం వలన చెడు క్రొవ్వులు తొలగించబడి అధిక బరువుని నియంత్రించుకోవచ్చని?

అనేక మంది నిపుణుల సూచనల మేరకు అధిక బరువుని నియంత్రించే ఆహార పదార్ధాలలో పండ్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఈ పండ్లలో అధికశాతం లో ఆంథోసియానిన్స్ గా పిలవబడే ఫ్లేవనాయిడ్లు ఉండడం మూలంగా పండ్లు పర్పుల్ లేదా ఎరుపు రంగులలో ఉండి కొవ్వు శాతం సున్నాగా కలిగి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ?

పండ్లను ఆహారంగా తీసుకోవడం బరువుని తగ్గించడానికి ప్రధమంగా సూచించే మార్గం. ఎందుకనగా ఇవి తక్కువ కాలరీలని కలిగి ఉండి, పోషకాలలో అధికంగా ఉంటాయి. కొన్ని పండ్లు పూర్తిగా ఫైబర్ తో నిండి ఉంటాయి. ఈ కారణం చేత కడుపు నిండుగా అనిపించి సాధారణ ఆహారం పైకి మనసు వెళ్లకుండా చేస్తాయి. తద్వారా బరువు తగ్గడం జరుగుతుంది.

కొన్ని పరిశోధనలు అందించిన నివేదికల ప్రకారం, పండ్లు తినడం మూలంగా కడుపులోని అధిక శాతం కొవ్వుని కరిగించి తద్వారా అధిక బరువుని ఎటువంటి కష్టం చేయకుండానే తగ్గించవచ్చని సూచించాయి. ఉదయం అల్పాహారం, మద్యాహ్నo మరియు రాత్రి భోజనాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల స్నాక్స్ గా కూడా పండ్లను తీసుకోవచ్చు.

మీ అధిక బరువుని తగ్గించగలిగే ఉత్తమమైన పండ్ల రకాలు ఇవే:

1.బెర్రీస్ :

1.బెర్రీస్ :

స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ , బ్లూ బెర్రీస్ ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ బెర్రీ పండ్లలో ఎక్కువ మోతాదులో పాలీఫెనాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇవి శక్తివంతమైన సహజ రసాయనాలు. ఇవి వేగంగా బరువుని తగ్గించుటలో సహాయం చేస్తాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్ లో ఎక్కువ మోతాదులో రోగనిరోధకాలు (యాంటీఆక్సిడెంట్స్) ఉన్న కారణాన కడుపులోని కొవ్వును తగ్గించడంలో ప్రముఖపాత్రను పోషించగలవు. ఈ రోగనిరోధకాలు జీవక్రియలను పెంచడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండడంలో సహాయం చేస్తాయి.

2.ద్రాక్ష పండ్లు :

2.ద్రాక్ష పండ్లు :

మార్కెట్లో ఇవి లేని పండ్ల దుకాణమే ఉండదు, సరసమైన ధరలలో విరివిగా లభ్యమయ్యే ఈ పండ్లు శరీరం లోని చెడు కొవ్వుని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న కారణంగా శరీరo డీహైడ్రేట్ కాకుండా ఉంచడంలో సహాయం చేస్తుంది. ద్రాక్ష పళ్లలోని ఎంజైములు అధిక బరువు నియంత్రణలో ప్రధానంగా పని చేస్తాయి, దీని కారణాన అధిక బరువుతో భాధపడే వారికి సూచించ దగ్గ పండ్లుగా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి.

3.అవోకాడో:

3.అవోకాడో:

అవోకాడోస్ కడుపులో కొవ్వును దహించగలిగే అద్భుతమైన పండు. ఎందుకంటే అవకాడోలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాల శాతం అధిక మోతాదులో ఉంటుంది, ఇవి శరీరానికి ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే సంతృప్త కొవ్వు పదార్ధాలు. అవోకాడోలు, కొవ్వును శక్తి రూపoలోకి మార్చగలిగిన పండు, మరియు మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా చెడు కొవ్వుని దహించుటలో ప్రధానపాత్ర పోషించగలదు.

4. యాపిల్స్

4. యాపిల్స్

యాపిల్స్ కొవ్వును దహించగలిగే ఉత్తమమైన పండ్లు మరియు అవి మీ కడుపులో కొవ్వును దహించడంలో సహాయపడతాయి. యాపిల్స్ లో ఎక్కువగా ఫైబర్ మోతాదు ఉన్న కారణంగా కడుపు నిండినట్లుగా ఉండి, ఆహారం మీదకు ద్యాస వెళ్లకుండా చేస్తాయి. వీటిని రాత్రివేళల కన్నా పగటివేళల్లోనే తీసుకోవడం ఉత్తమం. దీనికి సంబంధించిన సమాచారం కూడా మా పేజీలో ఇవ్వడం జరిగింది. గమనించగలరు.

విటమిన్ బి , విటమిన్ సి, రోగనిరోధకాలు మరియు ఖనిజాలతో నిండి ఉన్న ఈ యాపిల్స్ కేలరీలను తక్కువగా కలిగి ఉంటాయి. తద్వారా అధిక బరువుని నియంత్రించగలవు.

5. కొబ్బరి

5. కొబ్బరి

కొబ్బరి తియ్యటి మరియు కడుపు నింపే పండు, ఇది మీ భోజన కోరికలను తగ్గించేలా చేయగలదు. కొబ్బరి నీళ్ళలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచగలిగే లక్షణాలు కూడా ఉన్నాయి .అందుచేతనే రోగులకు ఎక్కువగా కొబ్బరి నీళ్ళను సిఫార్సు చేస్తుంటారు. మరియు కొబ్బరిలో తక్కువ కేలరీలు ఉండి కడుపు నిండేలా చేస్తుంది. మీ జీవక్రియను పెంచగలిగే ట్రైగ్లిజరైడ్స్ కొబ్బరిలో అధిక శాతంలో ఉంటాయి.

6. దానిమ్మకాయలు:

6. దానిమ్మకాయలు:

దానిమ్మకాయలలో, మీ జీవక్రియను పెంచుకోవడానికి సహాయపడే అనామ్లజనకాలు(రోగ నిరోధకాలు), మరియు పాలీఫెనోల్స్ ను కలిగి ఉంటాయి. ఈ పండ్లు మీ ఆకలిని దహించి వేస్తుంది , తద్వారా కడుపులోని కొవ్వును కరిగించుటలో సహాయపడుతుంది. దానిమ్మ పండుని జ్యూస్ గా కానీ, నేరుగా కానీ , సలాడ్ రూపంలో కానీ తీసుకోవచ్చు.

7.చెర్రీస్

7.చెర్రీస్

చెర్రీస్ శరీరం బరువు తగ్గించుటలో మరియు గుండె ఆరోగ్యానికి లాభదాయకంగా చూపబడ్డాయి. చెర్రీస్ లో అధిక రోగనిరోధక శక్తి ఉన్న కారణంగా మరియు పోషకాలు కలిగి ఉన్న కారణంగా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. తద్వారా అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే, చెర్రీస్ ఎక్కువగా తీసుకోవడం వలన వృద్దాప్యంలో చర్మo ముడతలు రాకుండా కొంతమేర అడ్డుకోగలదు.

8. నిమ్మకాయ

8. నిమ్మకాయ

నిమ్మకాయ అధిక కొవ్వుకు తగ్గించగలిగే లక్షణాలు ఉన్న పండు. కాలేయంలోని విషపదార్ధాలను తొలగించగలిగే శక్తి కలిగిన పండు నిమ్మకాయ. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటానికి మరియు కొవ్వును దహించి శరీర జీవక్రియల సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతిరోజూ గ్లాసుడు నీళ్ళలో నిమ్మ రసం మరియు తేనె కలిపి ఉదయాన్నే తాగడం వలన అనేకరకాల లాభాలను పొందవచ్చని అనేక నివేదికలు తేల్చాయి. మరియు రోజులో నిమ్మకాయ ఒక భాగంగా తీసుకోమని సూచిస్తున్నాయి.

9. పుచ్చకాయ

9. పుచ్చకాయ

పుచ్చకాయ ఆ అదనపు బరువుని తగ్గించడంలో సహాయం చేస్తుంది. దానిలో ఉన్న అధిక నీటి నీటి నిల్వలు మీ ఆకలిని అరికట్టగలిగే సహజ రసాయనాలను కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు మీ అవాంఛిత అధిక కొవ్వును కోల్పోవాలనుకుంటే, పుచ్చకాయలను తినడం తప్పనిసరి కావాలి.

10. పీచెస్

10. పీచెస్

పీచెస్ మధుమేహ రోగులకు సహజ ఔషధంగా పనిచేసే ఫెనాలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది మరియు ఊబకాయం సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. పీచెస్ లో యాంటీఆక్సిడెంట్ సహజ ఫృక్టోజ్ మీ కడుపులో కొవ్వు నిల్వల పెరుగుదలను నియంత్రిస్తుంది.

English summary

10 Best Fruits That Burn Belly Fat

Did you know that fruits are very good for losing weight? Researchers have suggested that when it comes to fat-burning foods, the fruits rich in flavonoids called anthocyanins, a compound that give fruits their purple or red colour, boast of zero fat. Surprising, isn't it?
Story first published:Friday, March 16, 2018, 17:37 [IST]
Desktop Bottom Promotion