For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 చిట్కాలు మీ బరువుతగ్గే లక్ష్యంలో, ఆహారప్రణాళిక నుండి 500 కేలరీలను తగ్గించగలవు.

|

అనవసర ప్రాంతాలలో చెడు కొవ్వు చేరిన కారణంగా, అధిక బరువుతోడై, అద్దంలో చూసుకున్న ప్రతిసారి సరైన శరీరాకృతి లేదని నిరాశకు గురవుతున్నారా?

ఇది నిజమే అయితే, అధిక బరువు తగ్గడంలో, లెదా ఊబకాయం తగ్గించుకోవడంలో అనేక రకాల పద్ధతులను పాటించడం కూడా పరిపాటి. కానీ ఎన్ని రకాల పద్ధతులను అనుసరించినా కూడా సరైన ఫలితాలను పొందలేకపోవచ్చు. దీనికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అవునా కాదా? ఒక్కోసారి అది కాలరీల సమస్య కూడా కావొచ్చు. సరైన ఆహార ప్రణాళికను అనుసరిస్తున్నా కూడా, అందరి శరీర తత్వాలు జీవక్రియలు ఒకేలా ఉండవు. కాబట్టి, మీకు తగిన విధానం ప్రకారం మీరు ఆహార ప్రణాళికను నిర్మించుకోవలసి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో అధిక కాలరీలను తొలగించే క్రమంలో భాగంగా కొన్ని చిట్కాలను అనుసరించక తప్పదు కూడా. అటువంటి చిట్కాలn అందివ్వడంలో భాగంగా ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది.

5 Simple Tricks To Reduce 500 Calories From Your Diet To Lose Weight!

అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం నిర్ధారించబడిన బి.ఎం.ఐ (బాడీ మాస్ ఇండెక్స్) లెవెల్స్, ఆరోగ్యకరమైన బరువుకు ప్రధాన సూచికగా ఉంటుంది. కానీ ప్రాంతాల వారీగా చూసినప్పుడు కొద్దో గొప్పో వ్యత్యాసాలు ఉండడం సర్వసాధారణం. ఒక్కోసారి బి.ఎం.ఐ స్టాండర్డ్స్ దాటి అస్తవ్యస్త ఫలితాలను చూపినప్పుడు దానిని ఊబకాయంగా వ్యవహరిస్తుంటారు. క్రమంగా బి.ఎం.ఐ క్రమబద్దీకరించుకునే క్రమంలో అనేక కష్టాలకు లోనవుతుంటారు.

కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ మరియు క్లోమ సంబంధిత సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, డిప్రెషన్, గర్భధారణ సమస్యలు మరియు ఇతరత్రా క్యాన్సర్ సంబంధిత సమస్యలు మొదలైనవి, ఈ అధికబరువుతో కూడిన ప్రతికూల సమస్యలుగా ఉన్నాయి.

సరైన ఆహార ప్రణాళిక మరియు క్రమబద్దమైన వ్యాయామ ప్రణాళిక ద్వారా జీవక్రియలను చక్కగా నిర్వహిస్తూ శరీర బరువును నియంత్రించవచ్చని మనం ఇదివరకు వ్యాసాలలో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఆహార ప్రణాళిక నుండి ఐదు వందల కేలరీలను అదనంగా తొలగించే పద్ధతి గురించి వివరించబడినది.

ఈ 5 చిట్కాలు మీ బరువుతగ్గే లక్ష్యంలో, ఆహారప్రణాళిక నుండి 500 కేలరీలను తగ్గించగలవు.

1. తక్కువ బ్రెడ్ తో కూడిన శాండ్విచ్ :

1. తక్కువ బ్రెడ్ తో కూడిన శాండ్విచ్ :

బ్రెడ్ లేకుండా శాండ్విచ్ చేయడం అంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ బ్రెడ్ లో అధిక మొత్తంలో కేలరీలు నిక్షిప్తమై ఉంటాయి, బ్రెడ్ మధ్యలో ఉంచిన స్టఫ్, టమాటాలు, కీరదోసకాయ, మాంసం మొదలైన పదార్ధాలతో నిండి ఉంటుంది. మరియు కొన్నిరకాల శాండ్విచ్ లలో గోధుమతో కూడిన చపాతీ కూడా ఉంటుంది. సన్నని చపాతీల కన్నా, బ్రెడ్ లో కేలరీల సంఖ్య అదనంగా ఉంటుంది. కావున బ్రెడ్ బదులుగా చపాతీతో శాండ్విచ్ తీసుకోవడం ద్వారా 500 కేలరీలు పైగా తగ్గించవచ్చు.

2. బ్లాక్ కాఫీ తీసుకోండి:

2. బ్లాక్ కాఫీ తీసుకోండి:

మీరు ఒకవేళ కాఫీ ప్రేమికులు అయితే ఇది మీకు కొంచెం కష్టమైన విషయమనే చెప్పాలి. మామూలు సాధారణ కాఫీలో పాలు, చక్కెర మొదలైన పదార్ధాల సమ్మిళితం కారణంగా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రోజు రెండు మూడు కాఫీలు పైన తాగేవారు, తమ ఆహార ప్రణాళికను క్రమబద్ధంగా నిర్వహించలేరు. కానీ సాధారణ కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా ఈ అదనపు కేలరీలను తగ్గించవచ్చు. బ్లాక్ కాఫీలో పాలులో, చక్కెర వంటి అధిక కేలరీలు కలిగిన పదార్థాలు ఉండవు. కేవలం వేడినీరు, కాఫీ పొడి మాత్రమే ఉంటుంది. కొందరు రుచి కోసం ఇతరత్రా మూలికలను జత చేస్తుంటారు కూడా. రోజులో రెండు మూడుసార్లు కనీసం బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా కేలరీలను తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3. ఇంట్లో చేసిన పండ్ల రసాలకు ప్రాధాన్యతనివ్వండి

3. ఇంట్లో చేసిన పండ్ల రసాలకు ప్రాధాన్యతనివ్వండి

బయట షాపులలో, రెస్టారెంట్లలో లేదా హోటళ్లలో చేసే పండ్లరసాలలో అధికంగా నీరు, మంచు ముక్కలు మరియు కృత్రిమ చక్కెరలు ఇతరత్రా ఎసెన్స్ జత చేయడం మూలంగా గ్లాసుడు జ్యూస్లో కూడా పండ్ల ఆధారిత అవశేషాలు కనుగొనడం కూడా కష్టంగా ఉంటుంది. వీటిలో ప్రయోజనాలు లేకపోగా కేలరీల సంఖ్య అధికంగా ఉండి ఇతరత్రా ప్రతికూల సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతాయి. కావున ఎల్లవేళలా ఇంట్లో చేసిన పండ్లరసాలకి ప్రాధాన్యతనివ్వండి. క్రమంగా పండ్ల రసాలలో జత చేయదగిన ఇతరత్రా పదార్థాల గురించిన అవగాహన కూడా ఉంటుంది. వీలైతే ఎటువంటి పదార్థాలను జత చేయకుండా పండ్లరసాలను తీసుకోవడం ఉత్తమం. క్రమంగా అధిక కేలరీల నుండి బయటపడవచ్చు.

4. నెమ్మదిగా నమిలి మింగండి:

4. నెమ్మదిగా నమిలి మింగండి:

ఆహారాన్ని వేగంగా నమిలి మింగడం కొందరికి అలవాటు, దీని కారణంచేత జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరియు మూత్రపిండాలకు వ్యర్ధాలను వేరు చేసే ప్రక్రియలో అధికభారం తలెత్తుతుంది. క్రమంగా మూత్రపిండ సంబంధిత వ్యాధులు, రక్తపోటు, హృదయ స్పందనల రేటు తగ్గడం, హార్మోనుల అస్తవ్యస్త ప్రభావాలు మొదలైన అనేక సమస్యలు తలెత్తుతాయి. కావున ఏ ఆహారాన్నయినా వీలైనంత నెమ్మదిగా నమిలి మింగడం మంచిది. అనేక అధ్యయనాల ప్రకారం నెమ్మదిగా నమిలి మింగడం ద్వారా ఆహారాన్ని క్రమబద్దమైన మోతాదులో లేక తక్కువ మోతాదులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నోటిలోని లాలాజలం అధికంగా ఉత్పత్తి జరిగి, ఆహారంతో చర్యలు జరపడానికి మరియు సరిగ్గా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా.

5. రాత్రి ఏడు గంటలకు ముందే మీ డిన్నర్ పూర్తి చేయండి :

5. రాత్రి ఏడు గంటలకు ముందే మీ డిన్నర్ పూర్తి చేయండి :

మీలో ఎవరికైనా రాత్రి వేళలలో ఏడు గంటల తర్వాత భోజనం చేసే అలవాటు ఉంటే వెంటనే మీ సమయాలను మార్చుకోవడం మంచిది.

ఈ మధ్యనే జరిగిన ఒక జపాన్ అధ్యయనం ప్రకారం రాత్రి ఏడు గంటలకు పైన డిన్నర్ చేసేవారు 500 కేలరీల కన్నా అధికంగా శోషణకు గురవుతున్నారని తేలింది. మరియు శరీరంలోని జీవక్రియలు ఆ సమయంలో అధికమవడం ద్వారా, కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు మీ ఆహార ప్రణాళికలో ఐదువందల కేలరీలను తగ్గించాలని భావిస్తున్న ఎడల ఏడు గంటలకు ముందే "డిన్నర్" కు ఉపక్రమించవలసి ఉంటుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

5 Simple Tricks To Reduce 500 Calories From Your Diet To Lose Weight!

Being obese or overweight can trigger many diseases. Reducing calorie intake per day along with exercise is one of the solutions to lose weight. Here are 7 simple tricks to help you cut 500 calories from your daily diet: Eat bread-less sandwich, have black coffee, homemade juice, chew slowly, have dinner by 7, eat in front of the mirror, & use smaller plates.
Story first published: Thursday, July 26, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more