For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉండే ఈ 9 పండ్లు బరువు తగ్గడానికి ఎంతగానో మేలు చేస్తాయి!

కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉండే ఈ 9 పండ్లు బరువు తగ్గడానికి ఎంతగానో మేలు చేస్తాయి!

|

పురాతనకాలం నుండి, పండ్లను ఆరోగ్యకరమైన ఆహారంగా భావించడం జరుగుతూ ఉంది. వీటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్లజనకాలు ఉండమే ఇందుకు కారణం. అయినప్పటికీ, బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు, కొన్ని పండ్లను తీసుకోవడం తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం వాటిలో ఉండే అధిక చక్కెరలను మరియు కార్బోహైడ్రేట్లు. ఇవి శరీరంలో కేలరీలను పెంచుతాయి. పండ్లు ఎక్కువ కాలరీలను కూడా కలిగి ఉండవు, అయినప్పటికీ మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు తక్కువ కార్బో హైడ్రేట్లు కలిగిన పండ్లను మాత్రమే ఎంచుకోవడమే ఉత్తమమని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

9 Low-carb Fruits For Weight Loss You Should Try Right Now!

పండ్లలో సహజ-చక్కెరల నిక్షేపాలు:
పండ్లలో అధిక ఫ్రక్టోజ్ నిల్వల కారణంగా, అవి అదేమొత్తంలో పిండిపదార్ధాల(కార్బోహైడ్రేట్)ను కూడా కలిగి ఉంటాయి. మీరు మీ ఆహారాలలో పిండిపదార్ధాలు మరియు కేలరీల సంఖ్యపట్ల పరిమితిని కోల్పోయినట్లయితే, బరువు తగ్గడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది ఎన్నటికీ. కావున తక్కువ కార్బోహైడ్రేట్లతో, మరియు అధిక నీటి నిక్షేపాలను కలిగి ఉన్న పండ్లను తీసుకోవడం ద్వారా, బరువు తగ్గడానికి శరీరానికి సహకారాన్ని అందించినవారవుతారు.

బరువును తగ్గించుకొనుటకు సహాయపడే తక్కువ పిండిపదార్ధాలు కలిగిన పండ్ల గురించిన వివరాలను తెలుసుకొనుటకు ఈ వ్యాసం మీకు దోహదం చేస్తుంది.

పుచ్చకాయలు:

పుచ్చకాయలు:

ఇవి మొత్తంగా 30కేలరీల శక్తిని మాత్రమే కలిగి ఉంటాయి, అంతేకాకుండా తక్కువ మోతాదులో పిండిపదార్ధాల నిక్షేపాలను కలిగి ఉంటాయి. క్రమంగా బరువు తగ్గడంలో ప్రభావవంతమైన పనితీరును కలిగి ఉంటాయి. USDA డేటా ప్రకారం, 100గ్రా పుచ్చకాయలో సుమారుగా 8గ్రాముల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. పుచ్చకాయలో 92శాతం నీటినిల్వలు మరియు అధిక ఫైబర్ నిక్షేపాల కారణంగా కడుపు నిండి ఉన్న అనుభూతికి లోనుచేసి, ఆహారం మీదకు మనసు మళ్ళకుండా చూడగలదు.

స్ట్రాబెర్రీలు:

స్ట్రాబెర్రీలు:

స్ట్రాబెర్రీలు కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటాయి, క్రమంగా మీ బరువు కోల్పోవడంలో భాగంగా ఆహారప్రణాళికలో వీటిని జోడించవచ్చు. USDA సమాచారం ప్రకారం ప్రతి 100గ్రాముల స్ట్రాబెర్రీలలో 8గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉన్నాయని చెప్పబడింది.

స్ట్రాబెర్రీస్ మీ జీవక్రియలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు పెక్టిన్ అని పిలిచే డైల్యూటెడ్ ఫైబర్ ఉనికి కారణంగా మీ ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది. ప్రతి 100గ్రా స్ట్రాబెర్రీలలో కేవలం 33కేలరీలు మాత్రమే ఉంటాయి. క్రమంగా బరువును కోల్పోవడంలో ఎంతగానో సహాయం చేయగలదు.

అవకాడొలు:

అవకాడొలు:

వీటిని బట్టర్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కూడా తక్కువ కార్బొహైడ్రేట్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. ప్రతి 100గ్రా అవకాడోలలో 160కేలరీలు, మరియు 9గ్రాముల కార్బోహైడ్రేట్ల నిక్షేపాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంలో సహాయపడడం ద్వారా, అవోకాడోస్ బరువు కోల్పోవడంలో పరిపూర్ణంగా సహాయ పడగలవు.

బ్లాక్బెర్రీస్:

బ్లాక్బెర్రీస్:

బ్లాక్బెర్రీస్ మీ బరువును తొలగించుటలో మీ ఆహార ప్రణాళికలో జోడించగలిగే మరొక అద్భుతమైన ఎంపికగా ఉంది. ఇది పెక్టిన్ అని పిలిచే డైల్యూటెడ్ ఫైబర్ నిక్షేపాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ప్రోత్సహిస్తుంది, క్రమంగా బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడగలదు. USDA డేటా ప్రకారం, ప్రతి 100గ్రా బ్లాక్బెర్రీలలో 10గ్రా కార్బోహైడ్రేట్లు మరియు 43కేలరీలు ఉంటాయి.

పీచెస్:

పీచెస్:

ఊబకాయం సమస్యలతో భాదపడేవారికి సూచించదగిన ఉత్తమమైన ఆహారాలలో పీచ్ కూడా ఒకటి. తక్కువ పిండి పదార్ధాల నిక్షేపాలతో, తక్కువ కాలరీలతో ఉండే ఈ పండును ఆహార ప్రణాళికలో తరచుగా జోడించడం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరని చెప్పబడింది. జీవక్రియలను పెంచడంలో సహాయపడే కెటాచిన్లు అని పిలవబడే ఫ్లేవనోయిడ్లను కలిగి ఉంటాయి. క్రమంగా కేలరీలను త్వరగా కరిగించుటలో సహాయం చేసి, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడగలదు.

USDA డేటా ప్రకారం, 100గ్రాముల పీచ్ పండ్లలో 10గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 39కేలరీలు ఉంటాయని చెప్పబడింది.

హనీడ్యూ:

హనీడ్యూ:

హనీడ్యూ మిలాన్ కూడా నీటి నిక్షేపాలలో అధికంగా ఉంటుంది. క్రమంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా చేసి, చురుగ్గా ఉండేలా సహాయపడుతుంది. మరియు కడుపునిండిన అనుభూతికి లోనుచేయడం ద్వారా, మీరు ఇతర ఆహారపదార్థాల వైపుకు మనసు వెళ్ళకుండా చేసి, కేలరీలు మొత్తాలను నియంత్రిస్తాయి. క్రమంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతి 100గ్రాముల హనీడ్యూ మిలాన్లలో అత్యల్పంగా 9గ్రా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

కర్భూజా:

కర్భూజా:

వేసవిలో అధికంగా లభించే కర్భూజాపండ్లలో కూడా తక్కువ కార్భోహైడ్రేట్ నిక్షేపాలు ఉంటాయి. ఇది బరువు తగ్గించుకోవాలి అనుకునే వారికి గొప్ప ఎంపికగా ఉంటుంది. ప్రతి 100గ్రా కర్బూజాలో కేవలం 34కేలరీలు మరియు 8గ్రా కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా గొప్ప ఫైబర్ నిక్షేపాలు ఉన్న పండుగా ఉంది, ముఖ్యంగా దీని విత్తనాలు మీ కడుపును నిండుగా ఉండునట్లు చేయడంద్వారా ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా చేయగలుగుతుంది.

నిమ్మకాయలు:

నిమ్మకాయలు:

నిమ్మకాయలు కూడా వేగవంతంగా కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, జీవక్రియలను వేగవంతం చేయడానికి కూడా సహాయపడతాయి, క్రమంగా శరీరాన్ని చురుకుగా చేసి, జీర్ణవ్యవస్థకు తోడ్పడడం ద్వారా, హార్మోనుల నుండి అంతర్గత అవయవాల పనితీరును క్రమబద్దీకరించడంలో కూడా సహాయపడగలదు. క్రమంగా అధిక క్రొవ్వుల నిక్షేపాలు తగ్గుముఖం పట్టడం ద్వారా బరువును తగ్గించుకోవడంలో సహాయపడగలవు. మరియు ఇందులోని ఫైబర్ ఆకలి మీదకు మనసు వెళ్ళకుండా చేయడం ద్వారా రోజులో ఆహారాన్ని తీసుకోవడం తగ్గించగలదు. మరియు శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురికాకుండా కాపాడగలదు. ప్రతి 100గ్రాముల నిమ్మకాయలలో 29కేలరీలు మరియు 9గ్రాముల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.

జామపండ్లు:

జామపండ్లు:

జామ పండ్లు పోషకాల పరిపూర్ణ కలయికను కలిగి ఉంటుంది. శరీరంలో జీవక్రియలను సజావుగా నిర్వహించడం నుండి, జీర్ణ వ్యవస్థను చక్కబెట్టే వరకు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉండే జామను ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. ఇది మీ శరీరాన్ని క్రమబద్దీకరించే లక్షణాలు కలిగిన ఫైబర్, పొటాషియం, విటమిన్స్ మరియు అనామ్లజనకాల నిక్షేపాలతో సమృద్దిగా ఉంటుంది. క్రమంగా బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి 100గ్రాముల జామ పండ్లలో 14గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 68కేలరీలు కలిగి ఉంటాయి.

English summary

9 Low-carb Fruits For Weight Loss You Should Try Right Now!

Since time immemorial, fruits are considered healthy, packed with essential vitamins, minerals and antioxidants. However, people who are trying to lose weight avoid certain fruits because they contain high amounts of sugar, which increase the calories consumed. But, there are some low-carb fruits that you could opt for if you are looking forward to losing weight.
Story first published:Sunday, September 9, 2018, 13:38 [IST]
Desktop Bottom Promotion