పొట్ట ,పొత్తి కడుపు ఇంకా తొడల్లోని కొవ్వును కరిగించే మేటి మార్గాలు ఇవిగో

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

బయటకి పెరిగిన పొట్ట కొవ్వుతో వంటికి అతుక్కునే జీన్స్ వేసుకోవటం కష్టంగా ఉందా? పెన్సిల్ స్కర్టు వేసుకోటానికి సంకోచిస్తున్నారా? ఇక అలాంటి ఆలోచనలు వదిలేసి పొత్తికడుపు, బానపొట్ట,తొడల కొవ్వును కరిగించటానికి కొన్ని సింపుల్ చిట్కాలను పాటించండి. ఇవేంటో తెలుసుకుని పాటించడం వలన సులభంగా మీ శరీరభాగాలు టోన్ అవుతాయి.

పొట్టలో కొవ్వు కరిగించటం చాలా కష్టమైన పని, ఇది చర్మం కింద అవయవాల చుట్టూ కొవ్వు పొరగా మారి, లోపల అవయవాల పనికి అడ్డం వస్తుంది.కడుపులో కొవ్వు మీ శరీరానికి మంచిది కాదు, తొడల కొవ్వు వలన ఆరోగ్యానికి పెద్ద ముప్పు ఏం రాదు కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

 Here Are The Best Ways To Eliminate Belly, Abdominal And Thigh Fat

మీరు బరువు తగ్గటానికి ఉపయోగపడే ప్రభావవంతమైన, సింపుల్ వ్యాయామాలు ఏమిటో ఇక్కడ చదవండిః

1. కార్డియోతో మొదలుపెట్టండి

1. కార్డియోతో మొదలుపెట్టండి

ఏ వ్యాయామానికి ముందైనా కార్డియో చాలా ముఖ్యం, తప్పనిసరి. దీనివల్ల మీ శరీరం చురుకుగా మారి, మీరు కండరాల ప్రత్యేక వ్యాయామాలను చేసే ముందు గుండె వేగం పెంచేలా చేస్తుంది. మంచి కార్డియో వలన మీ శరీరం వేడెక్కి, మీ పొట్టకొవ్వును టార్గెట్ చేస్తూ,మీరు చేసే ఇతర వ్యాయామాల ప్రభావం మెరుగవుతుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత వ్యాయామాన్ని మారుస్తూ ఉండండి. ఒకే రకం వ్యాయామం చేస్తుండటం వలన మీ శరీరం త్వరగా అలవాటుపడిపోయి దాని ప్రభావం తగ్గిపోతుంది.

2. టోన్ అయిన తొడల కోసం స్క్వాట్లు

2. టోన్ అయిన తొడల కోసం స్క్వాట్లు

మీ పిక్కలకి, తొడల క్వాడ్రాసెప్స్ కి, మడమల హామ్ స్ట్రింగ్స్ కి స్క్వాట్లు చాలా మంచి వ్యాయామం. ఇవి శరీర పైభాగం, కింద భాగాల బలాన్ని పెంచటానికి ఉపయోగపడతాయి. కాకపోతే సరిగ్గా ఈ వ్యాయామం ఎలా చేయాలో నేర్చుకోండి, తప్పు చేస్తే అపాయం కలగవచ్చు. ప్రతిరోజూ 15 సార్ల చొప్పున 2-3 సెట్లు చేయండి. ఫలితాలు మీరే చూస్తారు.

3.పొత్తికడుపు కొవ్వుకోసం

3.పొత్తికడుపు కొవ్వుకోసం

మీ ప్రతీరోజు వ్యాయామంలో లంజెస్ ను భాగం చేయటం వలన మీ పొట్ట కండరాలు బలంగా మారతాయి. ఇది తొడ కొవ్వు లేదా వీపు కింది భాగంలో పేరుకున్న కొవ్వును కరిగించటానికి చాలా మంచి వ్యాయామం. మీరు ఇవి చేసిన మొదటిరోజే కొవ్వు కదిలిన అనుభూతిని పొందుతారు. ఇది మీ మడమల హామ్ స్ట్రింగ్స్ ను స్ట్రెచ్ చేసి, పిక్కలు, కాళ్ళను టోన్ చేస్తుంది. దీనితో మీరెప్పుడూ కలలు కన్న అందమైన కాళ్ళు మీ సొంతమవుతాయి.

 4.సన్నని హిప్స్ కోసం కాళ్ళు పైకెత్తడం

4.సన్నని హిప్స్ కోసం కాళ్ళు పైకెత్తడం

మీ తొడల కొవ్వు కరగటానికి ఫర్ఫెక్ట్ వ్యాయామం ఇది. కాళ్ళు పైకి ఎత్తి దించటం వలన మీ హిప్ కండరాలపై పనిచేసి, మీ పొట్ట భాగం కూడా ధృఢపడుతుంది. ఈ సులభమైన వ్యాయామాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. 20 సార్ల చొప్పున 2 సెట్లు ప్రతిరోజూ చేయండి. అలా మెల్లగా బలం పెరుగుతుంది.

5.పై యాబ్స్ కోసం క్రంచెస్

5.పై యాబ్స్ కోసం క్రంచెస్

పొట్ట కొవ్వును కరిగించుకోటానికి చాలా ముఖ్యమైన వ్యాయామాలలో ఇదొకటి. క్రంచెస్ వలన మీ మొత్తం శరీరానికి కావాల్సిన బలం వస్తుంది. దీనికి ఏ వస్తువులూ అవసరం లేదు, ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. ప్రతీరోజూ 20 సార్ల చొప్పున 2 సెట్లు లేదా అంతకన్నా ఎక్కువ చేయండి. ఇది మీ పొట్ట కొవ్వును తగ్గించటమే కాదు, మీ వీపును నిటారుగా చేసి, వెన్నును కూడా బలంగా మారుస్తుంది.

6.పొట్ట, పొత్తికడుపు కొవ్వు కోసం ప్లాంక్

6.పొట్ట, పొత్తికడుపు కొవ్వు కోసం ప్లాంక్

పొట్ట, పొత్తికడుపు, తొడల కొవ్వును సహజంగా కరిగించే మేటి వ్యాయామాలలో ఒకటి ఈ ప్లాంక్ వ్యాయామాలు. ఇది సరైన డైట్ పాటించకుండా పొట్టలోని కొవ్వంతా అద్భుతంగా అలా కరిగించుకుంటూ పోలేదు. మీరు ప్లాంక్ ను బేసిక్ పద్దతిలో చేయవచ్చు లేదా దానిలో ఇతర వర్షన్లను ప్రయత్నించవచ్చు.సైడ్ ప్లాంక్, లేదా అప్పర్ పుషప్ పొజిషన్ ప్లాంక్ వంటివి చర్మం కింద అవయవాల చుట్టూ పేరుకున్న కొవ్వు పొరలను కరిగిస్తాయి.ఇవి చేయటం చాలా కష్టం, పొట్టలోని కండరాలను మాత్రం బలపడేలా చేస్తాయి.

7.భోజనాన్ని భాగాలుగా తినండి

7.భోజనాన్ని భాగాలుగా తినండి

ఆరోగ్యకరమైన డైట్ అలవాటును మొదలుపెట్టడానికి ఇది మంచి పద్ధతి. రోజు మొత్తంలో తినే భోజనాన్ని భాగాలుగా చేయండి. ఎక్కువ సమయం ఉండేలా ఒకేసారి పెద్ద భోజనం చేయవద్దు, చిన్నచిన్నగా చాలాసార్లు ఆహారం తీసుకోండి. చిన్న ప్లేట్లను వాడండి, దానివలన ఆహారం పరిమాణం ఎక్కువగా కన్పించి మీ మెదడుకి కడుపు తొందరగా నిండిపోతుందన్న ఫీలింగ్ కలుగుతుంది.

8. ఆరోగ్యకరంగా తినండి.

8. ఆరోగ్యకరంగా తినండి.

ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి అన్న ఈ చిన్న పాయింటు చెప్పకుండా ఉండలేం కదా. సరైన డైట్ లేకుండా ఎంతసేపు, ఎన్ని వ్యాయామాలు చేసినా పొట్టపై మొండి కొవ్వు కరగదు. మీ స్థూల పోషకాలు ఏంటో తెలుసుకుని క్యాలరీలను కౌంట్ చేస్తూ క్రమశిక్షణగా ఉండండి. ఎక్కువ పీచుపదార్థాలు తీసుకోండి, దాని వలన మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావం కలుగుతుంది.ఎక్కువ ఆకుకూరలు, పండ్లు తినండి. గుడ్లు, మాంసం వంటివి రోజూ కావాల్సిన ప్రొటీన్ ను అందిస్తాయి. మీరొకసారి డైటీషియన్ ను కలిసి మీరెంత బరువు తగ్గాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్ వేయించుకోవచ్చు.

English summary

Here Are The Best Ways To Eliminate Belly, Abdominal And Thigh Fat

If you are looking forward to lose weight, here are some very effective methods that can help you accomplish your mission. These workouts can help you in making your core muscles stronger, tone your abs, build upper as well as lower body strength and even help you get rid of all the unwanted pounds..
Story first published: Monday, March 26, 2018, 18:00 [IST]