For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గే క్రమంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ స్థాయిల గురించి తెలుసా?

|

శరీరంలో కొవ్వును తగ్గించడానికి మరియు ఆరోగ్యకర కండరాలను ఏకకాలంలో నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న పురుషులు తమ ఆహారంలో ముఖ్యమైన ప్రోటీన్ నిక్షేపాలను తీసుకోవడంతో పాటుగా క్రమబద్ధమైన క్యాలరీలను నిర్వహించవలసి ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్ అసలు తీసుకోకూడదు అన్న అపోహ అనేకమందిలో ఉంది. కానీ అది అబద్దం, శరీరానికి సరైన మోతాదులో ప్రోటీన్లు కూడా అవసరమే. క్రమంగా బరువు తగ్గడంలోనే కాకుండా ఆరోగ్యకర శరీర నిర్మాణంలో కూడా తగు ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అనేక అధ్యయనాలలో నిరూపించబడిన ఫలితాల ప్రకారం, ఆహార ప్రణాళికలలో అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం మూలంగా కండరాల సామర్ధ్యం తగ్గడం అనేది జరగదు. ఇది శరీర బరువుతో అనుసంధానించబడి ఉంటుంది.

How Much Protein Do You Exactly Need For Weight Loss?

అంతేకాకుండా, సరైన మోతాదులో ప్రోటీన్ స్థాయిలను ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవడం ద్వారా, మీకు బరువు నష్టంలో సహాయం చేస్తూనే, ఆరోగ్యకర కండరాలను మీ శరీరానికి అందివ్వడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. కాలరీలు కరిగించుటలో, ఆకలి తగ్గించడంలో, మరియు క్రమబద్దంగా కండరాలను నిర్వహించడంలో సాటిలేని ఫలితాలను చూపుతుంది.

కానీ అవసరానికి మించిన ప్రోటీన్ నిక్షేపాలను తీసుకోవడం మూలంగా, శరీరంలో అదనపు కొవ్వు నిక్షేపాలు పేరుకుని పోయి, బరువు నష్టానికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మరియు శరీరం మీద నియంత్రణ కూడా కోల్పోయే స్థితికి చేరుకుంటారు. ఏదైనా పరిమితంగా తీసుకోవలసి ఉంటుంది.

దీని గురించిన పూర్తి వివరాలను అందించే క్రమంలో ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుందని భావిస్తున్నాము.

How Much Protein Do You Exactly Need For Weight Loss?

బరువు తగ్గే క్రమంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ స్థాయిల గురించి తెలుసా?

రోజుకి తీసుకోవలసిన ప్రోటీన్ భత్యం 56 గ్రాములుగా మీరు విన్న, లేక పాటిస్తున్న అంశాన్ని ముందు పక్కన పెట్టండి, లేదా కిటికీ నుండి విసిరేయండి; ఒక వ్యక్తికి ఇంతే అవసరం అని చెప్పేవి, ఎన్నటికీ నిజం కావు, కానేరవు. తీసుకోవలసిన ఆహరం మరియు పోషకాల స్థాయిలు మనిషి శరీర తత్వాలను, రోగ నిరోధక స్థాయిలను బట్టి ఉంటుంది. కొండత ఎత్తు, బలిష్టమైన దేహధారుడ్యం కలిగిన వ్యక్తులకి ఒక గుడ్డు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.

మీ కోసం లక్కీగా, మా ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఈ సమగ్ర మార్గదర్శకాలను తీసుకువచ్చాము, క్రమంగా మీ శరీరం బరువు కోల్పోవడంలో అవసరమైన ప్రోటీన్ స్థాయిల గురించిన స్పష్టతను కలిగి ఉంటారు; మీ ఫిట్నెస్ మరియు అథ్లెటిక్ గోల్స్ చేరుకోవడానికి ప్రతి రోజూ ఎంత ప్రోటీన్ అవసరం తెలుసుకోడానికి ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది.

మీ అవసరాన్ని మరియు, మీ మనసు చెప్పే విధానం బట్టి మీ లక్ష్యం నిర్ధారించుకోవాలి:

మీ భాగస్వామి ఆరోగ్యానికి ఒక ఆహార ప్రణాళిక సరిపోతుంది అంటే, అదే ఆహార ప్రణాళిక మీకు కూడా సరిపోతుంది అని అనుకోవడం పొరపాటు. ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే విరమించుకోండి.

మీ శరీర బరువులో ప్రతి కేజీ బరువుకి 1.2-1.7 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. అనగా 68 కిలోల బరువు ఉన్న వ్యక్తికి సుమారుగా 81-115 గ్రాముల ప్రోటీన్ అవసరం కాగా 80 కిలోలు ఉన్నవారికి 97 – 138 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. సరైన పోషకాలు అందని శరీరం వేరే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఈ సంఖ్యలు ముందు సిఫారసు చేయబడిన మొత్తాల కన్నా (56) చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నిరూపించబడిన ఈ రోజువారీ ప్రోటీన్ భత్యం యొక్క రెట్టింపు వాస్తవానికి కండరాలను సంరక్షిస్తుంది మరియు ఆరోగ్యకరమైన బరువు నష్టాన్ని కలుగజేస్తుంది.

మీరు మీ బరువు తగ్గే ప్రణాళికలో మంచి ఫలితాలను చూడాలి అంటే సరైన మోతాదులో ప్రోటీన్ తప్పనిసరి అని మరవకండి.

How Much Protein Do You Exactly Need For Weight Loss?

సరైన మోతాదులో ప్రోటీన్ ఉండేలా ఆహార ప్రణాళికను సిద్దం చేసుకోండి.

ప్రోటీన్ లాభాల యొక్క గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం, ప్రతిరోజూ అల్పాహారం నుండే ప్రోటీన్ మీ ఆహారంలో ఉండేలా ప్రణాళిక చేసుకోవడం. ప్రొటీన్ రిచ్ బ్రేక్ పాస్ట్స్ తీసుకునే వ్యక్తులు, తీసుకోని వారికన్నా 200 కేలరీలను తక్కువగా కలిగి ఉంటారు. గ్రీక్ యోగర్ట్ 15 గ్రాముల ప్రోటీన్, మరియు గుడ్డు 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.

అదేవిధంగా, మద్యాహ్న భోజనం మరియు డిన్నర్ కోసం, మీరు గ్రిల్డ్ చికెన్, ప్రోటీన్ షేక్స్ వంటి ఇతర స్పష్టమైన ప్రోటీన్ రిచ్ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. మీరు ఇప్పటికీ మార్క్ కోల్పోతున్నారని భావిస్తే, మీ ప్రయోజనానికి స్నాక్ టైమ్ కూడా వినియోగించుకోండి.

మీకు నిజంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరమా?

మార్కెట్లో దాదాపు అన్ని ప్రోటీన్ పదార్ధాలు చాలా ఖరీదైనవిగా ఉండగా, కొన్ని చక్కెరలు మరియు ఇతర కృత్రిమ పదార్ధాలను కూడా కలిగి ఉంటాయి. కావున అదనపు కాలరీలను పొందడానికి డబ్బు వృధా చేయవలసిన అవసరం లేదు.

మీరు మీ రోజువారీ ప్రోటీన్ అవసరాలను మీ భోజనం మరియు స్నాక్స్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఆహారాలతో సులభంగా పొందవచ్చు. మరియు అటువంటి ఆహారాలు చాలావరకు మీ వంటగదిలోనే ఉన్నాయి. ఉదాహరణకు, ఒక గుడ్డు 5 నుండి 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉండగా, కేవలం తెల్లగుడ్డు 4 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.

కాబట్టి అల్పాహారం కోసం, మీ ఆహార ప్రణాళికలో తెల్ల గుడ్లను జత చేసుకుంటే, మీరు సులభంగా, 15 గ్రాముల ప్రోటీన్ పొందే అవకాశాలు ఉన్నాయి. డిన్నర్ లేదా మద్యాహ్న భోజనంలో మీరు ఒక లీన్ చికెన్ తీసుకోవడం ద్వారా; 4 ఔన్స్ క్వాంటిటీలో సాధారణంగా 26 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు.

అదనంగా, మాంసకృత్తులు కలిగిన ఆహార పదార్ధాలు ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్, మరియు థయామిన్ల వంటి ఖనిజాలతో మీకు సంపూర్ణ ఆహారాన్ని అందివ్వగలదు.

ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కువ మందికి ప్రోటీన్ స్నాక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ పోర్టబుల్ స్నాక్స్ ఆకలిని దూరంగా ఉంచడమే కాకుండా, మీ ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉంటుంది.

మీ రోజువారీ ఆహారంలో తక్షణమే ఈ చిట్కాలను జోడిచడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How Much Protein Do You Exactly Need For Weight Loss?

Trying to reduce body fat and retain lean muscle simultaneously? The key lies in systematic calorie restriction along with adequate protein intake. Know your goal to learn exactly how much protein you need in a day and eat accordingly. And do you really need protein supplements? We doubt!Amount Of Protein Needed For Weight Loss
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more