For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ‌రీర బ‌రువు త‌గ్గించే 15 సుల‌భ‌ మార్గాలు

బ‌రువు త‌గ్గాలంటే స‌మ‌యం ప‌డుతుంది. దీంతో పాటు కృత నిశ్చ‌యం ఉండాలి. శారీర‌క వ్యాయామ‌మూ ముఖ్య‌మే. ఇదేమంత సులువు కాదు.

By Sujeeth Kumar
|

లావుగా ఉండ‌టం ఆరోగ్యానికి సంకేతం కాద‌న్న సంగ‌తి తెలిసిందే. జాతీయ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం ఒబేసిటి త‌ర‌హా రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డేవారు ఏటా 3ల‌క్ష‌ల మంది ఉంటున్నార‌ని అంచ‌నా. కాస్త అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారు త‌ప్ప‌కుండా బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉంటుంది. బ‌రువు త‌గ్గాలంటే స‌మ‌యం ప‌డుతుంది. దీంతో పాటు కృత నిశ్చ‌యం ఉండాలి. శారీర‌క వ్యాయామ‌మూ ముఖ్య‌మే. ఇదేమంత సులువు కాదు. అయితే కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే సులువుగా వెయిట్ లాస్ కావొచ్చు. బ‌రువు త‌గ్గేందుకు ఉన్న 15 మార్గాలు ఏమిటో చూద్దాం...

1. బ‌రువు త‌గ్గాల‌ని తెలుసుకోండి

1. బ‌రువు త‌గ్గాల‌ని తెలుసుకోండి

బ‌రువు త‌గ్గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు ఆ విష‌యంపైన దృష్టి పెట్టండి. చూసేందుకు బాగుండాల‌ని బ‌రువు త‌గ్గాల‌నుకోవ‌డంలో త‌ప్పులేదు. అంత‌కుమించి ఆరోగ్య‌మూ ముఖ్య‌మే క‌దా! మంచి డాక్ట‌ర్‌ను క‌లిసి బ‌రువు త‌గ్గాలా లేదా ఇప్పుడున్న బ‌రువు స‌రిపోతుందా అని క‌నుక్కోండి. శ‌రీరంలో పొట్ట‌, తొడ‌లు, లాంటి ప్రాంతాల్లో బ‌రువు త‌గ్గాల‌నుకుంటే అక్క‌డ దృష్టి పెట్టండి.

2. ఎందుకు త‌గ్గాల‌నుకుంటాన్నో తెలుసుకోండి

2. ఎందుకు త‌గ్గాల‌నుకుంటాన్నో తెలుసుకోండి

బ‌రువు ఎందుకు త‌గ్గాల‌నుకుంటున్నారు? ఆరోగ్యానికి, ఫ్లెక్సిబిలిటీకి, స్టామినా పెంచుకునేందుకు ఇంకా చ‌క్క‌గా క‌నిపించేందుకు. ఐతే ఒబేసిటీ వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌లైన డిప్రెష‌న్‌, బైపోలార్ డిజార్డ‌ర్‌, యాంగ్జ‌యిటీ లాంటివి వ‌స్తాయి. అందుకే ఇలాంటి తీవ్ర‌మైన రుగ్మ‌త‌ల నుంచి త‌ప్పించుకునేందుకు బ‌రువు త‌గ్గాల‌నే విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకోవాలి. బ‌రువు త‌గ్గినంత మాత్రాన ఏ రాక్ స్టార్ అవుతార‌ని కాదు మ‌న‌కు మనం బాగా అనిపిస్తాం. కొత్త జీవం పుట్టుకొచ్చి విశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది.

3. ఆద‌ర్శవంతుల‌ను ఎంచుకోండి

3. ఆద‌ర్శవంతుల‌ను ఎంచుకోండి

బ‌రువు త‌గ్గే క్ర‌మంలో ప్ర‌తి నిత్యం మోటివేష‌న్ ఉండాలంటే క ష్ట‌మే. అందుకే ఎవ‌రినైనా స్పూర్తిగా తీసుకోండి. ఎవ‌రైనా కావొచ్చు. ఈ మ‌ధ్య కాలంలో బాగా బ‌రువు త‌గ్గిన‌వారై ఉండొచ్చు. లేదా మంచి ఆరోగ్య‌క‌ర జీవితాన్ని గ‌డిపేవారై ఉండొచ్చు. అది క‌చ్చితంగా మీ జీవితంలో విజ‌య‌వంత‌పు దిశ‌గా న‌డిపించ‌గ‌ల‌దు.

4. న‌మ్మకం ఉంచండి

4. న‌మ్మకం ఉంచండి

గ‌తంలో ప్ర‌యత్నం ద్వారా బ‌రువు త‌గ్గ‌క‌పోతే ఫ‌ర్వాలేదు. బ‌రువు త‌గ్గే క్ర‌మం ఒక సుదీర్ఘ ప్ర‌యాణం. అనుభ‌వాల్లో ఒడిదొడుకులు ఉండొచ్చు గాక‌! ఇదో మార్పులా చూడ‌కుండా జీవ‌న ప్ర‌మాణాల్లో మార్పుగా చూడండి. ఈ క్ర‌మాన్ని పాటించి లైట్‌గా ఫీల్ అవ్వండి . కొంత కాలానికే బ‌రువు త‌గ్గ‌డం మీ చేతుల్లో ప‌నిలా ఉంటుంది.

5. ఎన్ని క్యాల‌రీలు తీసుకుంటున్నారు?

5. ఎన్ని క్యాల‌రీలు తీసుకుంటున్నారు?

ప్ర‌తి రోజు ఎన్ని క్యాల‌రీలు తీసుకుంటున్నారో ఓ అవ‌గాహ‌న ఉండాలి. మీ వ‌య‌సు, ఎత్తు, బ‌రువు, చేసే ప‌నిని బ‌ట్టి ఎన్ని క్యాల‌రీలు అవ‌స‌ర‌మో తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో ఎన్నో క్యాల‌రీ క్యాలిక్యులేట‌ర్లు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా ఎంత అవ‌స‌ర‌మో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

6. ఏం తింటున్నారో గ‌మ‌నించండి

6. ఏం తింటున్నారో గ‌మ‌నించండి

ప్ర‌తి రోజు ఏం తింటున్నారో ఓ జాబితా రూపొందించుకోండి. సోమ‌, బుధ‌, శ‌నివారాల్లో ఒక రికార్డు రాసుకోండి. దీని ద్వారా అధికంగా ఎంత క్యాల‌రీలు లోప‌లికి వెళుతున్నాయో తెలుస్తుంది. వాటిని త‌గ్గించుకుంటే బ‌రువు త‌గ్గడం సులువ‌వుతుంది.

7. బ‌రువెంతో చూసుకున్నారా?

7. బ‌రువెంతో చూసుకున్నారా?

బ‌రువెంతో చెక్ చేసుకోండి. అధిక బ‌రువుతో ఉంటే త‌గ్గించుకునేందుకు ల‌క్ష్యం ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

8. బీసీఏ చెక్ చేయించుకోండి

8. బీసీఏ చెక్ చేయించుకోండి

బీసీఏ అంటే బాడీ కాంపోజిష‌న్ అనాల‌సిస్.. అంటే శ‌రీరంలో కొవ్వు, కండ‌రం ఎంతెంత ప‌రిమాణాల్లో ఉన్నాయో తెలుసుకోవ‌డం. ఇది ఏదైనా జిమ్ లో తెలుసుకోవ‌చ్చు. దీన్ని బ‌ట్టి మీ ట్ర‌యిన‌ర్‌ను లేదా డైటీషియ‌న్‌ను వెయిట్ లాస్ ప్లాన్ రూపొందించాల్సిందిగా అడ‌గొచ్చు.

9. చిన్న ల‌క్ష్యాల‌తో...

9. చిన్న ల‌క్ష్యాల‌తో...

ఎంత బ‌రువు త‌గ్గొచ్చో అని ఇప్ప‌టికీ తెలిసి ఉంటుంది. త‌గ్గేందుకు చిన్న చిన్న మైలురాళ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. పెద్ద మొత్తంలో బ‌రువు త‌గ్గాలంటే ముందు చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు నెల‌లో 10 కేజీలు త‌గ్గాల‌నుకుంటే వారంలో 2 కేజీలు త‌గ్గేలా ల‌క్ష్యం పెట్టుకోండి. కాస్త త‌గ్గితే మంచి స్పూర్తి ర‌గులుతుంది.

10. డైరీలో రాసుకుంటే...

10. డైరీలో రాసుకుంటే...

ఒక డైరీ పెట్టుకొని దాంట్లో బ‌రువు త‌గ్గే ల‌క్ష్యాల‌ను రాసుకోండి. ఒక డెడ్‌లైన్ విధించుకోండి. డైరీ రాయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గే ప్ర‌గ‌తిని, డైట్, వ‌ర్క‌వుట్ ప్లాన్స్ రాసుకోవ‌చ్చు. ప్ర‌తి వార‌మూ దీని ద్వారా మ‌న ప్ర‌గ‌తిని గ‌మ‌నించుకోవ‌చ్చు.

11. ప్ర‌తి డైట్‌నూ గుడ్డిగా న‌మ్మొద్దు

11. ప్ర‌తి డైట్‌నూ గుడ్డిగా న‌మ్మొద్దు

ఎవ‌రికో అచ్చొచ్చిన డైట్‌ను మీరు ఫాలో అవుతానంటే ఎలా? మ‌ంచి డాక్ట‌ర్‌ను క‌లిసి మీకు అనువైన డైట్‌ను తెలుసుకోండి. మీ బ‌రువు, వ‌య‌సు, వైద్య చ‌రిత్ర‌, వైద్య స‌మ‌స్య‌ల ఆధారంగా మంచి డైట్ ప్లాన్‌ను త‌యారుచేయించుకోండి.

12. నీళ్లు తాగండి

12. నీళ్లు తాగండి

శ‌రీరంలో మ‌లినాలు తొల‌గించేందుకు నీళ్లు బాగా తాగండి. దీని ద్వారా క‌ణాలు పున‌రుత్తేజ‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు మెరుగ‌వుతాయి. బ‌రువూ త‌గ్గుతాం.

13. త‌ర‌చూ తినండి

13. త‌ర‌చూ తినండి

బరువు త‌గ్గాల‌నుకునేవారు చేసే పొర‌పాటు ఏమిటంటే ఉప‌వాసం ఉండ‌డం. అయితే ఇదేమంత మంచిది కాదు. ఉప‌వాసంతో బరువు పెరుగుతాం. అదీ కాక బుర్ర‌కు సిగ్న‌ళ్లు అందుతాయి. ఇక పై ఏం తిన్నా అది కొవ్వులా దాచిపెట్టుకోమ‌ని చెబుతుంది. ఆరోగ్యక‌ర ఆహారం తిన్నా అది కొవ్వులా నిల్వ ఉంటుంది. అందుకే ప్ర‌తి 2 నుంచి 3 గంట‌లకోసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి.

 14. కూర‌గాయ‌లు బాగా తినండి

14. కూర‌గాయ‌లు బాగా తినండి

కూర‌గాయ‌ల్లో విట‌మిన్లు, మిన‌రల్స్‌, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటాయి. అవి శ‌రీర క‌ణాల‌ను పున‌రుత్తేజం చేస్తాయి. అంతేకాదు మెట‌బాలిజాన్ని పెంచుతాయి. జీర్ణ‌ప్ర‌క్రియ‌ను పెంచుతాయి. అందుకే రోజులో 3 లేదా 4 వెరైటీల కూర‌గాయ‌లు తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డం సులువ‌వుతుంది.

15. పండ్లు తీసుకోండి

15. పండ్లు తీసుకోండి

పండ్ల‌లో పోషకాలు బాగా ఉంటాయి. అవి బ‌రువు త‌గ్గేవారికి చాలా మంచిది. రోజులో క‌నీసం 3 ర‌కాల పండ్ల‌ను మూడు పూట‌లా తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో పాటు జీవ‌క్రియ మెరుగవుతుంది. త‌ద్వారా బ‌రువు తొంద‌ర‌గా త‌గ్గిపోతారు.

English summary

How To Start Losing Weight Now

Being obese is not a sign of good health. According to the National Institutes of Health, obesity-related diseases claim about 300,000 lives per year (1). So, if you are overweight, you must lose the flab. Of course, weight loss takes time, commitment, and physical work and is almost never a smooth ride.
Story first published:Thursday, February 15, 2018, 15:30 [IST]
Desktop Bottom Promotion