For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లం-జీల‌క‌ర్ర డ్రింక్ 10 రోజులు తాగితే అనూహ్య‌మైన మార్పు!

By Sujeeth Kumar
|

బ‌రువు త‌గ్గే విష‌యంలో బాన పొట్ట ఎప్పుడూ అడ్డంగా ఉంటుంది. చూసేందుకు బాగా క‌నిపించ‌క‌పోవ‌డ‌మే కాదు.. అలా ఉన్న‌వారిని చూసి న‌వ్వేవారు, మాట్లాడుకునేవారు ఉంటారు. లావుగా ఉన్న పొట్ట గురించి చింతించ‌కండి. కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో అధిక పొట్ట‌ను ఇట్టే క‌రిగించొచ్చు. మ‌న వంట‌గ‌దిలో దొరికే అల్లం, జీల‌క‌ర్ర‌తో దీన్ని సాధించ‌వ‌చ్చంటే న‌మ్ముతారా?

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

అల్లంతో ప్ర‌యోజ‌నాలు

ఎంతో పురాత‌న‌మైన‌ది అల్లం. ఇది దాదాపు ప్ర‌తి భార‌తీయ వంటిట్లో క‌నిపిస్తుంది. అల్లానికి ప్ర‌త్యేక‌మైన వైద్య గుణాలున్నాయి. దీని వాస‌న ఆహారానికి, తేనీరుకు ప్ర‌త్యేక రుచిని తీసుకొస్తాయి. ఎన్నో ఏళ్లుగా క‌డుపు నొప్పికి అల్లాన్ని దివ్య ఔష‌ధంగా వాడుతున్నారు. వేడిని త‌గ్గించే గుణం అల్లానికి ఉంది. అందుకే కాబోలు అల్లం అనేక ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటుంది. అల్లం అనేది మ‌ట్టిలో పెరిగే కాండం.

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

జీల‌క‌ర్ర‌తో ప్ర‌యోజ‌నాలు

మ‌రో ఘాటైన దినుసు జీల‌క‌ర్ర పుట్టింది మ‌ధ్య‌ధ‌రా ప్రాంతంలో. జీల‌క‌ర్ర‌లో పొటాషియం, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు విట‌మిన్ సీ, ఈ, కే లు త‌క్కువ ప‌రిమాణాల్లో ఉంటాయి. అధిక కొవ్వును త‌గ్గించ‌డంలో, కొల‌స్ట్రెల్ స్థాయిల‌ను అదుపులో ఉంచడంలో జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

మ‌రి ఈ రెండింటి మిశ్ర‌మాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం..

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

త‌యారీ విధానం

ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర తీసుకోవాలి. దీన్ని విడిగా లేదా పొడిగా చేసుకోవాలి. దీన్ని అర లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించాలి. నీళ్లు స‌గం అయ్యే వ‌ర‌కు అంటే పావులీట‌ర్ చేరుకునేదాకా బాగా మ‌రిగించాలి. రుచి కోసం కావాలంటే యాల‌కులు, లవంగాలు, నిమ్మ ర‌సం క‌లుపుకోవ‌చ్చు. దీంట్లోనే స‌న్న‌గా తురిమిన అల్లం వేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ఉద‌యాన్నే తాగాలి. ఇలా వ‌రుస‌గా 10 రోజుల చేస్తే మంచి ఫ‌లితాలు క‌నిపిస్తాయి. ఆ త‌ర్వాత 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే బాగుంటుంది. దీనికి జ‌త‌గా మంచి డైట్ తీసుకోవాలి.

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

ఈ మిశ్ర‌మం ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే...

జీల‌క‌ర్ర‌, అల్లం మిశ్ర‌మం మెటబాలిజాన్ని పెంచుతుంది. బ‌రువు త‌గ్గ‌డానికి ఇది చాలా అవ‌స‌రం. మెటబాలిజం పెర‌గ‌డం వ‌ల్ల క్యాల‌రీలు బాగా ఖ‌ర్చ‌వుతాయి. రోజంతా ఉషారుగా ఉండ‌గ‌లుగుతారు. ఇది కాకుండా ఈ రెండింటి మిశ్ర‌మం ఏదైనా తినాల‌నే కోరిక‌ను అణ‌చివేస్తుంది. దీంతో అవి ఇవి తిన‌కుండా ఉండ‌గ‌లుగుతాం. ఆరోగ్య‌మూ బాగుంటుంది.

English summary

jeera-ginger drink promises to cut tummy flab in 10 days!

jeera-ginger drink promises to cut tummy flab in 10 days, Tummy flab is the biggest hurdle when it comes to weight loss. Not only does it look awkward in a saree or high waist pants, but also becomes the talk of the town because of its sheer prominence. Worry no more, here we bring to you the magical combination of the
Story first published:Tuesday, February 20, 2018, 13:06 [IST]
Desktop Bottom Promotion