For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం మరియు శారీరక దృఢత్వంతో ముడిపడి ఉన్న కొన్ని అపోహలు.

వ్యాయామం మరియు శారీరక దృఢత్వంతో ముడిపడి ఉన్న కొన్ని అపోహలు.

|

మనం ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం తో ఉండటంలో మన నమ్మకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ మూఢనమ్మకాలు మనను అగాధంలోకి నెట్టివేస్తాయి.

ఒక సూత్ర ప్రకారం, ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్యంగా ఉండటానికి, దానివలన మన శరీరంలోకి చేరిన కెలోరీలు ఖర్చుపెట్టడం వినడానికి సులువుగా ఉన్నా, ఆచరణలో కఠినంగా ఉంటుంది. అవునా? కాదా? రోజురోజుకూ మనదేశంలో ఊబకాయులు సంఖ్య పెరిగిపోతుంది. ఈ వ్యాసం ద్వారా వ్యాయామం మరియు శారీరక దృఢత్వంతో ముడిపడి ఉన్న కొన్ని అపోహలను గురించి తెలుసుకుందాం.

What Are Some Common Exercise And Fitness Myths

అపోహ #1

కొంతమంది హృదయం మరియు రక్తనాళాలను ప్రభావితం చేసే పరుగు, జాగింగ్ వంటి వ్యాయామాలతో బరువును కోల్పోవచ్చు అనుకుంటారు. కానీ బరువులు ఎత్తడం, యోగా,ఈత మరియు నృత్యం వలన కూడా బరువును కోల్పోవచ్చు. నిజానికి ఎటువంటి శారీరక అలసట కలిగించే ఏ కార్యకలాపాల ద్వారా అయినా కెలోరీలు కరిగించి బరువు కోల్పోవచ్చు.

అపోహ #2

"మీ పరగడుపున వ్యాయామం చేస్తేనే మీలో కొవ్వు కరుగుతుంది ". ఇది ఇంకొక అపోహ. నిజానికి కొన్నిరకాల వ్యాయామాలు చేసే ముందు కడుపును ఖాళీగా పెట్టకుండా ఏదైనా కొంచెం తినాలి.

అపోహ #3

కొంతమంది చల్లని నీరు తాగడం వలన కొవ్వు కరుగుతుందని చెప్పినప్పటికీ, దీనికి ఆధారాలు లేవు. అధికంగా చల్లని నీరు తాగడం వలన బరువు కోల్పోయిన వారు ఇప్పటివరకు ఎవరూ లేరు.

అపోహ #4

"వ్యాయామం చేసేవారు ఏదైనా తినవచ్చు"- ఇది మరొక అపోహ. ఏదేమైనా, మీరు తినడం ద్వారా ఎన్ని కెలోరీలు కూడబెట్టారు మరియు వ్యాయామం.ద్వారా ఎన్ని కెలోరీలు ఖర్చు పెట్టారు ఇంకా ఎంత మిగిలి ఉంది అనేది ముఖ్యం.

అపోహ #5

"త్వరగా బరువు కోల్పోవడం సాధ్యమే". ఇది ఒక అపోహ. కొంతమంది తమకు నచ్చిన చోట ఉదాహరణకు పొట్ట, భుజాలు భాగంలో మాత్రమే బరువును కోల్పోవడం సాధ్యమవుతుంది అని వాదిస్తారు. కానీ మన శరీరానికి కొవ్వుని కరిగించే పద్ధతి ఒకటి ఉంటుంది. పైగా మనం ఏ ప్రదేశంలో కొవ్వును కరిగించాలి అనే విషయాన్ని నియంత్రించలేము.

అపోహ #6

బరువే సర్వం. ఈ వాక్యంలోనే అన్ని అపోహలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇఫ పాక్షికంగా మాత్రమే నిజం. కాస్తంత బరువు అధికంగా కలిగిన కొంతమందికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు .అదేవిధంగా, ఆరోగ్యవంతమైన బరువు కలిగిన కొందరు అనారోగ్యంతో బాధపడుతుంటారు. మరీ అధికంగా బరువంకలిగి ఉండటం సరైనది కాదు కానీ ప్రతిఒక్కరు నిర్ధారిత బరువును మాత్రమే కలిగి ఉండటం కూడా తప్పనిసరి కాదు. స్ఫూరద్రూపులు సాధారణంగా ఎక్కువ బరువు కలిగి ఉంటారు.

అపోహ #7

"హృదయ స్పందన మానిటర్లు వంటి గాడ్జెట్లు ప్రతి అంశం యొక్క సమాచారం అందిస్తాయి ". ఆరోగ్యం చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది మరియు అందుకే పూర్తిగా కొన్ని గాడ్జెట్లు మీద ఆధారపడటం సారి కాదు.

English summary

What Are Some Common Exercise And Fitness Myths

Our belief systems play a role in helping us stay fit and healthy. But it is better to stop believing in myths because they take you nowhere. Though the process of eating some calories and burning them to stay healthy seems pretty simple as a principle, when it comes to reality, it isn't. That is why there are rising obesity rates in every country.
Desktop Bottom Promotion