మీరు బరువు తగ్గాలని భావిస్తున్నట్లయితే ఈ 10 జీరో కేలరీ ఆహారాలు మీరు ఖచ్చితంగా తినాల్సిందే :

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రస్తుతం మనం ఉంటున్న సమాజంలో చాలామంది ప్రజలు బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది ఎలా తగ్గాలో తెలియక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా మంది వ్యక్తులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఎప్పుడైనా సరైన బరువు తో మన శరీరం ఉంటే గనుక, భవిష్యత్తులో ఊబకాయంతో ముడిపడి ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.

ఎవరైతే ఎక్కువ బరువు గల వారు ఉన్నారో, అటువంటి వారందరు ప్రత్యేకముగా తమ బరువుని, శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరియు నాజూకు అయిన శరీరం కావాలని కోరుకుంటున్నారు. కానీ, బరువు తగ్గడం అనే విషయం అంత సులభమైన పని కాదని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే, సమతుల్యమైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా బాగా చేయవల్సిన అవసరం చాలా ఉంది.

చాలా మంది వ్యక్తులు బరువు తగ్గటానికి ఏ రకమైన ఆహారం తినాలి అనే విషయమై తీవ్రమైన అయోమయానికి లోనవుతుంటారు. ఏమి చేయాలో అర్ధం కాక, చాలామంది కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా గనుక చేస్తే తమ శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది అనే ఉద్దేశ్యంతో. కానీ, ఏ వ్యక్తులైతే ఊబకాయంతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు జీరో కేలరీ ఆహారం తింటే సరిపోతుందని వైద్యులు మరియు ఆహార నిపుణులు సూచిస్తున్నారు. వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం.

1. దోసకాయ :

1. దోసకాయ :

100 గ్రాముల దోసకాయలో 16 కేలరీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని దోసకాయలు తిన్నా కూడా మీరు బరువు పెరగరు. ఈ ఆకుపచ్చ రంగు పండులో అధిక శాతంలో నీరు మరియు కావాల్సిన పోషకాలు లభ్యమవుతాయి. కానీ, చాలా తక్కువ మోతాదులో మాత్రమే కేలరీలు ఉంటాయి. దీనిని మనం పచ్చిగా అయినా తినవచ్చు మరియు ఏదైనా సలాడులో వేసుకొని మిగతా కూరగాయలతో కలిపి తినవచ్చు. జీర్ణం అవడానికి, నిర్జలీకరణ కాకుండా ఉండటానికి మరియు కొవ్వుని కరిగించడానికి, తీసుకొనే క్యాలరీల శాతం చాలా తక్కువగా ఉండటానికి ఇలా ఎన్నో ఉపయోగాలు దోసకాయ తినడం వల్ల కలుగుతాయి.

2. ఆకుపచ్చ కూరగాయలు మరియు ఆకుకూరలు :

2. ఆకుపచ్చ కూరగాయలు మరియు ఆకుకూరలు :

100 గ్రాముల ఆకు కూరల్లో 20 నుండి 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. పాలకూర, చుక్కకూర, మరియు మిగతా రకాల ఆకుకూరలు అన్నింటిని తినడంవల్ల ఊబకాయాన్ని సమర్థవంతంగా అదుపులో పెట్టవచ్చు, చికిత్స చేయవచ్చు. ఈ ఆకు పచ్చ ఆకుకూరలు, కూరగాయల్లో కార్బో హైడ్రేట్లు మరియు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. ఏ వ్యక్తులు అయితే అధిక బరువు కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. ఆస్పరాగస్ :

3. ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ అనే ఆకుకూర రకంలో ప్రతి 100 గ్రాములకు గాను 20 కేలరీలు ఉంటాయి. ఆస్పరాగస్ ని ఉపయోగించి వివిధరకాల రుచికరమైన ఆహారాలను మరియు సలాడ్ లను తయారు చేయవచ్చు. ఇది ఒక తక్కువ కేలరీలు కలిగిన ఆహారం. కావున దీనిని ఆహారంలో భాగంగా పక్కన పెట్టుకొని సురక్షితంగా తినవచ్చు, ఉడికించవచ్చు లేదా మిగతా ఆహారాలతో కలిపి కాల్చిన రుచికరమైన ఆహారంతో కలిపి కూడా తీసుకోవచ్చు. కానీ, ఇలా చేసేటప్పుడు నూనె లేక వెన్నను అస్సలు రాయకండి. వీటిని ఉపయోగించి కనుక ఆహారాన్ని తయారు చేసినట్లైతే అధిక కేలరీలు మన శరీరంలోకి చేరిపోతాయి.

4. నిమ్మకాయలు :

4. నిమ్మకాయలు :

ప్రతి 100 గ్రాముల నిమ్మకాయల్లో, 29 కేలరీలు ఉంటాయి. పులుపుతో పాటు, రసం కలిగిన ఈ పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుచేత వివిధరకాల ఆహారాలు మరియు పానీయాలలో దీనిని అధికంగా వాడుతుంటారు. ఇది వాడటం వల్ల ఆహారం తినే ప్రక్రియ కూడా అదుపులో ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆహారం బాగా త్వరగా జీర్ణం అవుతుంది, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ కూడా, నిమ్మకాయను గనుక రోజు తీసుకున్నట్లైతే అందవలసిన పోషకాలన్నీ అందుతాయట.

5. పుచ్చకాయ :

5. పుచ్చకాయ :

తీపి ఉన్న ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. కానీ, ప్రతి 100 గ్రాముల పుచ్చకాయలో మాత్రం 30 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. పుచ్చకాయ ఒక ప్రత్యేకమైన పండు, ఎందుచేతనంటే ఇందులో కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ ఎర్రటి అందమైన పండులో మన శరీరానికి ఎంతో లాభం చేకూర్చే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరం యవ్వనంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పండు ఆకలిని తగ్గిస్తుంది మరియు సులభంగా జీర్ణం అవుతుంది. శరీర బరువు తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.

6. క్యాలీఫ్లవర్ :

6. క్యాలీఫ్లవర్ :

ప్రతి 100 గ్రాముల క్యాలీఫ్లవర్ లో 25 గ్రాముల కేలరీలు ఉంటాయి. క్రూసి ఫెరోస్ కుటుంబానికి చెందిన క్యాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ మరియు బ్రస్సెల్స్ లాంటి కూరగాయల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి మరియు పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రకమైన కాయగూరల్లోమంట కలిగించని పోషకాలు ఉండటం వల్ల, గుండెకు సంబంధించిన ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడుతుంది మరియు శరీరం యొక్క జీర్ణ శక్తి శక్తివంతం అవుతుంది. పోషక పదార్ధాలు అధికంగా ఉండే ఏ రకమైన ఆహారాల్లో అయినా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే, ఈ ఆహారాన్ని అధిక బరువు ఉన్న వ్యక్తులు తినాలనుకుంటే దీనిని కేలరీలు తక్కువగా ఉండే విధంగా వండుకొని తినడం మంచిది.

7. కొవ్వు లేని మాంసం :

7. కొవ్వు లేని మాంసం :

కొవ్వులేని మాంసం లోని ప్రతి 50 గ్రాముల్లో 120 కేలరీలు ఉంటాయి. ఎరుపు మాంసం లో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, ఊబకాయం ఉన్న వ్యక్తులకు ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. కానీ, కోడి మాంసం కొవ్వు లేని మాంసం క్రిందకే వస్తుంది. కోడి మాంసంలో కేలరీలు చాలా తక్కువగాను మరియు ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కావున కోడి మాంసం మరియు కొవ్వులేని గొడ్డు మాంసం తినడం ద్వారా ఆ జంతువులో ఉన్న పోషకపదార్ధాలన్నీ మనకు లభించడం వల్ల మొత్తంగా మన ఆరోగ్యం బాగుంటుంది. సాధారణంగా చాలామంది ఆహార నిపుణులు బరువు తాగ్గాలనే పద్దతిలో భాగంగా ఈ రకమైన మాంసాన్ని తినడం మంచిదని సూచిస్తున్నారు.

8 సముద్రపు చేప :

8 సముద్రపు చేప :

ప్రతి మూడు ఔన్సుల సముద్రపు చేపలో 100 కేలరీలు ఉంటాయి. ట్యూనా, సర్దన్స్, ట్రౌట్, మాకెరెల్ మరియు సాల్మన్ వంటి సముద్రపు చేపలో పోషక పదార్ధాలు చాలా అధికంగా ఉంటాయి మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి బరువుని చాలా సమర్ధవంతంగా అదుపులో ఉంచుతాయి. ఏ వ్యక్తులైతే ఆహారం తీసుకొనే విషయంలో ఒక క్రమ పద్దతితో పాటు, తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే పట్టుదలతో ఉంటారో అటువంటి వారు కాల్చిన చేపని తినడం ఉత్తమం. చేపలో ఐయోడిన్ శాతం అధికంగా ఉంటుంది. అందుచేత థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఇటువంటి చేపలను తినడం మంచిది.

9. బీన్స్ :

9. బీన్స్ :

బ్లాక్ బీన్స్ మరియు కిడ్నీ బీన్స్ వంటి వివిధ రకాల బీన్స్ అందుబాటులో ఉన్నాయి. బీన్స్ లో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల సాధారణంగానే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంతే కాకుండా బీన్స్ మరియు ఇతర చిక్కుళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా ఊబకాయం ఉన్న వ్యక్తులు తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

10. ద్రాక్షపళ్ళు :

10. ద్రాక్షపళ్ళు :

ప్రతి 100 గ్రాముల ద్రాక్షలో 40 కేలరీలు ఉంటాయి. మనం ఆహారం తీసుకొనే ముందు ద్రాక్ష గుత్తిలో సగమైనా గనుక తింటే, అది మన ఆకలిని తగ్గించడమే కాకుండా మనం మితంగా ఆహారం తీసుకొనేలా చేస్తుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ద్రాక్ష పండులో కేలరీలు మరియు కొవ్వు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అందుచేత బరువు పెరుగుతాం అనే భయం లేకుండా హాయిగా తినవచ్చు. దీనికి తోడు శరీరంలో జీవ క్రియను మరింత వేగంగా పనిచేయించడంతో పాటు అధిక కొవ్వుని, త్వరగా కూడా కరిగించడంలో ద్రాక్ష పళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ ఆహారాలన్నిటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత ఎక్కువగా తిన్నా కూడా ఎటువంటి నష్టంలేదు. అంతే కాకుండా ఇవి మిమ్మల్ని సంరక్షిస్తాయి. దానికి తోడు మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి మరియు మీ ఆకలి కూడా అదుపులో ఉంటుంది.

ఈ వ్యాసాన్ని మీరు షేర్ చేయండి.

ఈ వ్యాసం గనుక చాలా ఉపయోగకరంగా ఉంది అని మీరు గనుక భావిస్తే, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వ్యాసాన్ని పంచుకోండి మరియు వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడండి.

English summary

10 Zero-calorie Foods For Weight Loss You Must Add To Your Diet

The number of calories going in and out of your body determine the success of your weight loss efforts. So, here are 10 zero-calorie foods that can help you reach that goal, like grapefruit, cucumber, and fish..
Story first published: Wednesday, January 10, 2018, 12:30 [IST]