For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలంటే ఖర్చు చేయాల్సిన పనిలేదు..వీటిని ఫాలో అయితే చాలు..

|

అధిక బరువు, ఊబకాయం, లావుగా ఉన్న వారి ప్రతి ఒక్కరి కోరిక బరువు తగ్గించుకోవాలి లేదా లావు తగ్గాలి. అయితే, బరువు తగ్గాలి లేదా లావుతగ్గాలన్న కోరికైతే ఉంటుంది కానీ, ఏవిధంగా తగ్గాలి అన్న అవగహాన మాత్రం ఉండదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండాలన్న కోరిక కలగా మిగిలిపోతుంది కొంత మందికి. ఇంటి దగ్గర వ్యాయామానికి సమయం లేదిన ఏ సాయంత్రమో జిమ్, ఫిట్ నెస్ సెంటర్లని ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. దీని వల్ల ఏదో ముక్కుబడిగా జిమ్ కు వెళతారు కానీ స్ట్రిట్ గా అయితే ఫాలో అవ్వరు. ఇక రెండవ పద్దతిలో వెయిట్ లాస్ పిల్స్ తీసుకోవడం డబ్బుకు డబ్బు వ్రుదా అవ్వడంతో పాటు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..

కానీ వీటన్నింటి అవసరం లేకుండానే చాలా సింపుల్ గా హెల్తీగా ఎక్కువ ఖర్చు చేయకుండా? బరువు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఇక్కడ మీ కోసం చాలా సింపుల్ టిప్స్ అందిస్తున్నాము. ఇవి మీకు సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వీటి కోసం ఏమాత్రం ఖర్చు చేయాల్సి పనిలేదు. అవేంటంటే...

1. బ్రిస్క్ వాకింగ్ :

1. బ్రిస్క్ వాకింగ్ :

కార్డియో వాస్కులర్ వ్యాయామానికి బ్రిస్క్ వాకింగ్ చాలా మంచిది. దీనికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు , వ్యాయామాన్ని కొత్తగా ప్రారంభించే వారికి ఇది ఒక రిఫ్రెష్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం కొద్ది సమయం బ్రిస్క్ వాక్ కేటాయించి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వాకింగ్ స్టైల్ తో పాటు స్పీడ్ కూడా పెంచడం వల్ల తప్పకుండా మార్పు వస్తుంది.

2. రన్నింగ్ :

2. రన్నింగ్ :

రన్నింగ్ చేయడానికి మంచి షూ ఉంటే సౌకర్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనేకునే వారికి రన్నింగ్ ఎలాంటి ఖర్చులేని బెస్ట్ ఎక్సర్సైజ్. అదేసమయంలో స్టామినా కూడా పెంచుతుంది. బరువు తగ్గాలని ఖచ్చితంగా నిర్ణియించుకున్నప్పుడు రన్నింగ్ తప్పనిసరిగా చేయాలని నిశ్చయించుకోండి. ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రదేశానికి చేరుకునేట్లు ప్రయత్నించండి. తప్పని సరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు ఫర్ఫెక్ట్ ఫిట్ గా మారడం మాత్రమే కాదు, క్యాలరీలు బర్న్ చేయడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

3.స్కిప్పింగ్ :

3.స్కిప్పింగ్ :

స్కిప్పింగ్ అంటే చాలా మందికి చిన్ననాటి వ్యాయామం గుర్తుకు వస్తుంది. బరువు తగ్గడంలో తప్పకుండా ఎఫెక్టివ్ గా సహాయపడుతుది. మీ బిజీ షెడ్యూల్లో కొంత సమయం తప్పనిసరిగా స్కిప్పింగ్ కు సమయం కేటాయించండి. రెగ్యులర్ ఈ వ్యాయమం కనుక చేస్తే తప్పకుండా బరువు తగ్గడంతో పాటు కార్డియో వ్యాస్క్యులర్ ఫిట్ నెస్, బాడీ బ్యాలెన్స్ మెరుగుపరిచి శక్తి సామర్థం పెరుగుతాయి. కండరాలు గట్టిపడుతాయి, క్యాలరీలు కరుగుతాయి.

4. స్టెప్స్ ఎక్కడం:

4. స్టెప్స్ ఎక్కడం:

ఎటువంటి ఖర్చులేకుండా ప్రాక్టీస్ చేసే పద్దతి . మీ ఇంట్లోనే ఈ పద్దతని ప్రతి రోజూ ఫాలో అవ్వొచ్చు. బరువు తగ్గడానికి మెట్లు ఎక్కే పద్ధతి గురుత్వాకర్షణను ప్రభావితం చేస్తుంది. ఎంత ఎక్కువగా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఎఫెక్టివ్ గా క్యాలరీలను కరిగించుకోవచ్చు. మెట్లు ఎక్కడం చాలా ప్రభావితమైన వ్యాయామాలలో ఒకటి, ఇది మన హృదయ స్పందన రేటును త్వరగా పెంచుతుంది మరియు అలా చేస్తే, మన హృదయ ఫిట్‌నెస్‌ను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, తదుపరిసారి మీరు ఎలివేటర్ల కోసం వేచి చూడకుండా, మెట్లు ఎక్కడం ఆరోగ్యకరమైన ఎంపిక అని భావించండి.

5. ట్రెక్కింగ్ :

5. ట్రెక్కింగ్ :

ట్రెక్కింగ్ వెళ్లడం వల్ల చాలా యాక్టివ్ గా ఉంటుంది. అదనపు క్యాలరీలు కరిగించుకోవాలని కోరుకునే వారికి ట్రెక్కింగ్ మంచి ఎంపిక. కానీ, మీరు రోజూ ట్రెక్కింగ్ వెళ్ళలేరన్నది వాస్తవం. ఎదేమైనా మీరు సాహసాలను ఇష్టపడే వారైతే మరియు కాలినడకన ఎత్తైన ప్రదేశాలను ఎక్కడానికి ఆసక్తి ఉన్నట్లైతే మీరు వీలైంత తరచుగా ట్రెక్కింగ్ టూర్లు ప్లాన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రసిద్ది చెందిన ట్రెక్కింగ్ క్లబ్ లలో మీకు సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది. ట్రెక్కింగ్ వల్ల శరీరంలో అదనపు కొవ్వు కరిగించడంతో పాటు ఇలా ఎత్తైన ప్రదేశాలను అధిరోహించడం వల్ల ఒక థ్రిల్ ఫీల్ అవుతారు.

English summary

Ways to Lose Weight Without Spending Much Money

To be fit and healthy is everybody’s goal in today’s life of hectic hurry and fast business.We spend a lot of money on our fitness efforts, either buying gym instruments or buying the expensive weight loss pills that are widely advertised.But, have you ever thought that you can lose weight in simple and healthy manner without spending much?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more