For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యూసీ పొమోగ్రనేట్(దానిమ్మ)లో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

తినాలంటే ఓపిగ్గా గింజలు వలుచుకోవాలి... పోనీ కష్టపడి వలిచి తిందామా అంటే అద్బుతమైన రుచి కాదు. అర్ధమైంది కదా ఆపండెదో.... అవును, దానిమ్మ... కాని ఈ పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.చూడ ముచ్చటైన రూపం, లోపల ముత్యాలాంటి గింజలతో ప్రతి ఒక్కరికీ నచ్చే ఫలం ఏదంటే దానిమ్మ అని ఠక్కున చెప్పవచ్చు. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాక మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే ఓ దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.

దానిమ్మ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.

అందుకే దానిమ్మ పూర్తి పోషకాలను అందించే ప్యాకేజ్ గా పిలవబడుతున్నాయి. దానిమ్మలో వివిధ రకాల న్యూట్రీషియన్లు కలిగి ఉండటం వల్ల దీన్ని వండర్ ఫ్రూట్ గా పిలుచుకొంటున్నాము. వివిధ రకాల న్యూట్రీషియన్స్ వివిధ రకాల ప్రయోజనాలను కలిగి ఉన్నది. దానిమ్మ తినడం వల్ల దీర్ఘకాలం పాటు ప్రయోజనాలను అందిస్తుంది.

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది బరువు పెరగనివ్వదు మరియు ఇందులో పెద్ద మొత్తంలో పోషకాంశాలు కలిగి ఉంటాయి. మరి ఈ క్రింది ప్రయోజనాలను తెలుసుకొన్న తర్వాత మీరు ఖచ్చితంగా దానిమ్మను తినడానికి ప్రయత్నిస్తారు...

జ్యూసి దానిమ్మలోని గ్రేట్ హెల్త్ బెనిపిట్స్:

ఐరన్ అధికంగా ఉంటుంది

ఐరన్ అధికంగా ఉంటుంది

ఆపిల్స్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆపిల్ కంటే దానిమ్మలో మరిన్ని ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్నది. అందుకే రక్తహీనతతో బాధపడే వారు ఆపిల్స్ కంటే దానిమ్మను ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తుంటారు.

బౌల్ మూమెంట్

బౌల్ మూమెంట్

దానిమ్మ గింజలు రఫ్ గా ఉండటం వల్ల ఇది ప్రేగుల్లోని పదార్థాలను ముందుకు నెట్టి త్వరగా జీర్ణం అయ్యే విధంగా సహాయపడుతుంది. ఫలితంగా మీ బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా ఉంటుంది.

ధమనులను శుభ్రపరుస్తుంది

ధమనులను శుభ్రపరుస్తుంది

దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్. ఇందులో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ధమనులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

వృద్దాప్యంను నివారిస్తుంది

వృద్దాప్యంను నివారిస్తుంది

దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని యంగ్ గా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్ ను పుష్కలంగా అందించే ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి.

వ్యాధినిరోధకతను పెంచుతుంది

వ్యాధినిరోధకతను పెంచుతుంది

దానిమ్మలోని విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. దగ్గు మరియు జలుబు వంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తిని పుష్కలంగా అంధిస్తుంది.

లివర్ ను పునరుద్దరిస్తుంది

లివర్ ను పునరుద్దరిస్తుంది

కాలేయం రీజనరేటివ్ ఆర్గాన్. దానంత అది పునరుద్దింపబడుతుంది. దానిమ్మ తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది మరియు రీజనరేట్ అవుతుంది . అందుకే చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు మరియు ఆల్కహాల్ అధికంగా త్రాగే వారు దానిమ్మను అధికంగా తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.

క్యాన్సర్ నివారిస్తుంది

క్యాన్సర్ నివారిస్తుంది

ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు గుండె వ్యాధులు మీద పోరాటం చేస్తుంది. రెండు ప్రత్యేక అధ్యయనాలు దానిమ్మ రసం ప్రోస్టేట్ క్యాన్సర్ పోరాడటానికి సహాయపడుతుంది అని వాదన. ఒక లాబ్ ప్రయోగంలో, ఈ రసం వల్ల "సంస్కృతి క్యాన్సర్ కణాలు వృద్ధి మందగించింది మరియు కణాల మరణం" అని తెలిసింది. రెండవ ప్రయోగంలో, దానిమ్మ రసం గుండె వ్యాధులు గల వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్త పరిస్థితి మెరుగుపర్చింది.

కిడ్నీలను శుభ్రపరుస్తుంది

కిడ్నీలను శుభ్రపరుస్తుంది

శరీరంలో అనేక వ్యర్థాలను బయటకు పంపించే ఒక ముఖ్య యంత్రం కిడ్నీలు. అందువల్ల దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది.

నేచురల్ యాంటీ అలెర్జీలు

నేచురల్ యాంటీ అలెర్జీలు

కొంత మంది వివిధ రకాలుగా అలర్జీలకు గురి అవుతుంటారు . దానిమ్మలో ఫాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇది అలెర్జీలను కంట్రోల్ చేసి అలర్జిక్ రియాక్షన్స్ ను తగ్గిస్తుంది.

సెక్స్ లైఫ్ కు మంచిది

సెక్స్ లైఫ్ కు మంచిది

దానిమ్మలో ఆప్రియోడిసాసిక్ కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటారో అప్పుడు టెస్టోస్టిరాన్ లెవవల్స్ క్రమంగా పెరిగి సెక్స్ లైఫ్ ను ఆంనందంగా మార్చుతుంది. : అంగస్తంభన లోపం అనే సమస్యను దానిమ్మ నయం చేస్తున్నదని ఒక నమ్మకం ఉంది. ఇది ఒక అద్భుత ఔషదం కాదు. దానిమ్మ రసం మాత్రమే మధ్యస్తంగా అంగస్తంభన మెరుగుపరుస్తుంది

English summary

10 Health Benefits Of Juicy Pomegranates


 With modern technology and the means to mass produce, all fruits are available to us all-year round. However, the essence of seasonal fruits is always there. Having fruit 'in season' gives you all its natural health benefits, plus you get it cheap. This is the season for pomegranates. So, this is a good time to know all the health benefits of pomegranate.
Story first published: Tuesday, September 2, 2014, 17:01 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more