For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలోని మలినాలు లేదా వ్యర్థాలను తొలగించే గొప్ప ఆహారాలు

By Super
|

మీరు ఎప్పుడు బద్దకంగా, నిరుత్సహాంగా, శక్తిలేనట్టు మందకొడిగా అనుభూతి చెందుతున్నారా? మీ చర్మం మీద మొటిమలు మరియు దద్దుర్లు ఉన్నాయా? మీ జీర్ణ వ్యవస్థ ఆలస్యంగా పనిచేసి అల్లకల్లోలంగా అనుభూతి చెందుతున్నారా? ఈ ప్రశ్నలకు 'అవును' సమాధానం అయితే మీ శరీరానికి "డిటాక్స్" చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవితం కోసం కీలకమైనది ఏమిటంటే ప్రతి రోజు, మీ శరీరంలో వ్యర్థాలు లేదా విషపదార్థాలను తొలగించుకోవటమే. మీరు మీ శరీరంపట్ల చేసిన తప్పులను, ఇక్కడ ఇచ్చిన సులభమైన పద్ధతులతో సరిచేసుకుని ఇంతకుముందు కన్నా ఆరోగ్యవంతులు మారవచ్చు. మీ శరీరంలో ఉన్న వ్యర్థాలను వదిలించుకోవటం కోసం ఈ నిర్విషీకరణ సహాయంతో ప్రయత్నం చేయండి.

ఇక్కడ కొన్ని డిటాక్స్ ఫుడ్స్ అందివ్వడం జరిగింది. వీటిని తీసుకోవడం వల్ల ఇవి మీ శరీరాన్ని నిర్విషీకరణం చేయం మాత్రమే కాకుండా అదనపు పౌండ్ల బరువును కూడా తగ్గిస్తుంది.ఇంకా మీకు అవసరం అయ్యేంత శక్తిని అందించి, మనస్సును ప్రశాంత పరుస్తాయి...మరి అటువంటి అద్భుతమైన డిటాక్స్ (నిర్శిషీకరణ)ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి గొప్పఔషధగుణాలున్న విషయం మీకు తెలిసిందే, ఇది కూడా ఇక గొప్ప డిటాక్సిఫైఫుడ్ . ఎందుకంటే ఇది ఒక యాంటీవైరన్ , యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు ఇవి టాక్సిన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఒకటి రెండి వెల్లుల్లిపాయలను నోట్లో వేసుకొని నమలడం లేదా ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

శరీరంను డిటాక్సిఫై చేసుకోవడానికి రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీ చేర్చుకోవడం చాలా అవసరం. శరీరంలో టాక్సిన్స్ నివారించడానికి ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది . ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ను ఫుష్కలంగా ఉండి వివిధ రకాల జబ్బుల నుండి మీ కాలేయంను కాపాడుతుంది .

అల్లం:

అల్లం:

ఫ్యాటీ ఫుడ్స్ మరియు ఆల్కహాల్ తీసుకుంటున్నారా?ఇవి మీ పొట్టను అస్తవ్యస్తం చేస్తాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను చేర్చుకోవడం వల్ల వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లోటింగ్ మరియు గ్యాస్ నివారిస్తుంది . అల్లంలో కూడా అధికంగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల , వ్యాధినిరోధకతను పెంచడానికి ఒక గొప్ప పదార్థం. కాబట్టి, రెగ్యులర్ గా జింజర్ టీ లేదా జింజర్ జ్యూస్ ను తీసుకోవడం చాలా అవసరం.

నిమ్మ

నిమ్మ

దాహం వేసిందంటే, చల్లని నిమ్మరసం లేదా నిమ్మ సోడా తాగేయటానికి చూస్తాం. నిమ్మలో విటమిన్ సి అధికం. శరీరానికి తగిన తేమనిస్తుంది. చెడు వ్యర్ధాలను బయటకు పంపుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి అద్భుతాలను కలిగి స్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఆల్కలైన్ ఎఫెక్ట్స్ శరీరానికి ఎంతో ప్రయోజనాలును అందిస్తుంది. దాంతో శరీరంలో పిహెచ్ లెవల్స్ ను రిస్టోర్ చేస్తుంది. కాబట్టి రోజులో ఒక గ్లాసు వేడినీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. నిమ్మరసం ఉదయంవేళ తాగితే, పొట్ట శుభ్రం చేయటమే కాక రోజంతా మీలోని ఎసిడిటీ లెవెల్స్ సమతుల్యత కాపాడుతుంది.

పండ్లు:

పండ్లు:

నిర్విషీకరణకు ఉత్తమమైన మార్గం ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్నపండ్లు మరియు కూరగాయలపై దృష్టి సారించడం. ఈ టెక్నిక్ కాలేయ ఎంజైమ్లు యాక్టివేట్ అయి, శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉండటం వల్ల మరియు చాలా తక్కవు క్యాలరీలను కలిగి ఉండటం వల్ల వీటని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అత్యవసరం. ఇవి చర్మం మరియు జుట్టుకు అవసరం అయ్యే అద్భుతం అయ్యే పనులను చేయడం మాత్రమే కాదు, జీర్ణం అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తాజా పండ్లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బీట్ రూట్ -

బీట్ రూట్ -

ఈ జాబితాలో బీట్ రూట్ లు మంచి ఆరోగ్యకర ఆహారం. ఎర్రగా వుండే బీట్ రూట్ వేసవిలో తింటే శరీరం బాగా శుభ్రమవుతుంది. ఇందులో విటమిన్ సి, బి3, బి6, బేటా కెరోటిన్ లు మలినాలను విసర్జిస్తాయి. బీట్ రూట్ శరీరంలో రక్తం పెంచుతుంది కూడాను. అంతే కాదు కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. లివర్ కు ఒక మంచి డిటాక్సిఫికేషన్ వంటిది. బీట్ రూట్ ను పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు .

 బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన డిటాక్సిఫైడ్ ఫుడ్. ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మెగ్నీషియం, మ్యాంగనీస్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి లివర్ ను శుభ్రం చేస్తుంది. ఇందులో ఉండే సెలీనియం కూడా లివర్ ను ఇతర జబ్బుల నుండి కాపాడుతుంది . కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

English summary

7 popular and effective detox foods

Here are popular detox foods that will help counteract the effects of overindulging in unhealthy foods. Experts say not only does detoxing help you lose those extra pounds, but also makes you feel more energised and boosts your mood.
Desktop Bottom Promotion