For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వందేళ్ల జీవితానికి...రోజుకొక్క యాపిల్ చాలు...

|

రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం లేనట్లే...! ఈ సామెత మనందరికి తెలిసన విషయమే, అయితే మనలో ఎంత మంది ఈ విషయాన్ని నమ్మతారు, ఆచరిస్తారు?ఎంత మంది ఆపిల్ ను ప్రతి రోజూ తింటారు? నాకు తెలిసి ప్రతి రోజూ రెగ్యులర్ ఆపిల్ తినే వారు తక్కువే అని చెప్పవచ్చు! అలాంటి వారికోసం ఈ ఆర్టికల్. ఇందులోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుకుంటే చాలు, ఇక ఈ రోజు నుండే ఆపిల్ తినడం మొదలు పెడతారు.

ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మరియు ఎక్కువగా తినగలిగే హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫ్రూట్. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు . ఎందుకంటే యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ గుణాలన్నీ నివారిణులుగా మరియు ఇక్సిడేషన్ డ్యామేజ్ కలగకుండా మరియు శరీరంలోని కణాల పునరుత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఇంకా యాపిల్స్ లో పెక్టిన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉండి. ఈ ఫైబర్ సోలబుల్, ఫెర్మింటబుల్ మరియు విస్కాస్ పైబర్ గా విభజించడం జరిగింది. అందు వల్ల ఇది ఇక హెల్తీ చాయిల్ ఫుడ్ గా ఎంపిక కాబడినది. యాపిల్స్ ఉండే ఫైటో న్యూట్రీషియన్స్ మరియు యాంటా ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను , హైపర్ టెన్షన్, డయాబెటిస్ మరియు హార్ట్ సమస్యలను నివారిస్తుంది. మరి మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

1. తళతళలాడించే తెల్లటి దంతాల కోసం:

1. తళతళలాడించే తెల్లటి దంతాల కోసం:

ఆపిల్ ను తినడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది దంతక్షయాన్ని నివారించడంతో పాటు నోట్లో బ్యాక్టీరియా లెవల్స్ ను తగ్గిస్తుంది.

2. మతిమరుపును నివారిస్తుంది:

2. మతిమరుపును నివారిస్తుంది:

ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల అల్జైమర్స్(మతిమరుపు నివారిస్తుంది). రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం రెగ్యులర్ గా ఆపిల్ జ్యూస్ త్రాగడం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా నివారిస్తుందని వెల్లడి చేశారు.

3. పార్కిసన్స్ కు వ్యతిరేకంగా పోరాడి, రక్షణ కల్పిస్తుంది:

3. పార్కిసన్స్ కు వ్యతిరేకంగా పోరాడి, రక్షణ కల్పిస్తుంది:

కొన్ని పరిశోధన ప్రకారం ఆపిల్స్ తో పాటు, ఇతర ఫైబర్ ఫుడ్స్ ను తినడం వల్ల పార్కిసిన్స్ వ్యాధిని నివారించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ యొక్క ఫ్రీరాడికల్ పవర్ పుష్కలంగా ఉండంటం వల్ల ఇది వ్యాధినిరోధకతగా పనిచేస్తుంది.

4. అన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది:

4. అన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది:

ఆపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ప్యాక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది . ఆపిల్ తొక్కలో ఉండే ట్రైటర్ఫినాయిడ్ కాంపౌడ్స్ లివర్, కోలన్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది . ఆపిల్స్ తినడానికి ఇది ఒక హెల్తీ కారణం.

5. డయాబెటిక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

5. డయాబెటిక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

ముఖ్యంగా మహిళలు ఎవరైతే యాపిల్స్ రెగ్యులర్ గా తింటారో అలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

6. హార్ట్ హెల్త్:

6. హార్ట్ హెల్త్:

ఆపిల్స్ లో అధికంగా సోలబుల్ ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ అధికం కాకుండా నివారిస్తుంది . అలాగే ఆపిల్ తొక్కలో ఉండే పినాలిక్ కాంపౌండ్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది . రక్తనాళాల గోడలమీద కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణను ఆలస్యం చేస్తుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

7. డయోరియా మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది:

7. డయోరియా మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది:

మలబద్దకం మరియు డయోరియా వంటి వాటకి ఆపిల్స్ బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుంది. యాపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ క్లోమంలో వాటర్ శాతాన్ని పెంచడం లేదా తగ్గించడం వల్ల బౌల్ మూమెంట్ జీవక్రియలు సరిగా జరగడానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఒక హెల్తీ చాయిస్ ఫుడ్.

8. బరువును కంట్రోల్ చేస్తుంది:

8. బరువును కంట్రోల్ చేస్తుంది:

హార్ట్ డిసీజ్, నిద్రలేమి, హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ ఇవన్నీ అదనపు బరువు పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. యాపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. యాపిల్స్ లో ఉండే ఫైబర్ ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా చేస్తుంది.

9. కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

9. కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

సాధారణంగా మనం తీసుకొనే ఆహారాల ద్వారా కూడా టాక్సిన్స్ మన శరీరంలో చేరుతాయి. కాలేయం టాక్సిన్స్ ను తొలగించడానికి బాధ్యత వహిస్తుంది . కాబట్టి, రెగ్యులర్ గా ఆపిల్స్ తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయవచ్చు.

10. మెటబాలిజం సిండ్రోమ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

10. మెటబాలిజం సిండ్రోమ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

ఎవరైతే ఆపిల్స్ అధికంగా తింటారో అలాంటి వారిలో మెటాబాలిజం సిండ్రోమ్ తో చాలా తక్కుగా బాధపడుతారు . ఇది హార్ట్ డిసీజ్ కు సంబంధించినది మరియు డయాబెటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆపిల్ తినడం వల్ల ఇది మరో గొప్ప ప్రయోజనం.

English summary

10 Health Benefits Of Eating Apples

An apple a day keeps the doctor away! We all know this proverb but how many of us actually believe in it? How many of us actually make sure to eat an apple every day? Not most of us! So let us convince you by discussing the numerous health benefits of eating apples.
Desktop Bottom Promotion