For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

|

కాఫీ త్రాగడం వల్ల మనం కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందవచ్చని మీకు తెలుసా?కాఫీ అంటే చాలా మంది అమితమైన ఇష్టం.ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. ఉదయమేనా? బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. చాలామంది సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు. దీనికి కారణం బహుశ అందులో వుండే, కెఫైన్ అనే మత్తు పదార్ధం అయివుండవచ్చు. కాఫీ అధికంగా తాగితే అనారోగ్యమే. కేఫైన్ నిద్రను తగ్గిస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది.

కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, ఇవి ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది . కాఫీ తాగడం మంచిదని మీకు తెలుసా? ఈ కాఫీ ప్రయోజనాల గురించి అనేక చర్చలు జరిగాయి, కానీ దీనిని మితంగా తీసుకుంటేనే మంచి చెడుని అధికమిస్తుంది. కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంది, ఇది ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు, సహజ ఆరోగ్య జీవన శైలి అని అర్ధంచేసుకోవడం ముఖ్యం. ఇది కేవలం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం, అనేకమందికి ఆనందాన్ని అందించేదని అర్ధం. ఏ ఇతర ఆహరం లాగానే, కాఫీ ని కూడా మితంగా తీసుకోవాలి, కాఫీని ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. ఈ ఆర్టికల్లో కాఫీ త్రాగడం వల్ల మనం పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించడం జరిగినది . అవేంటో మనం తెలుసుకుందాం...

మిమ్మల్ని మేల్కొపుతుంది

మిమ్మల్ని మేల్కొపుతుంది

కాఫీ కొన్ని బ్రెయిన్ ఫంక్షన్స్ ను అంటే మూడ్, మెమరీ, అలర్ట్నెస్ మరియు రియాక్షన్ టైమ్ వంటి విషయాల్లో చురుకుగా ఉంటుంది. అందువల్లే పనిచేసే వారు సహజంగా కాఫీని ఎక్కువగా తీసుకుంటుంటారు.

ఎనర్జీలెవల్స్ పెరుగుతుంది

ఎనర్జీలెవల్స్ పెరుగుతుంది

ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల మీలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయన్న విషయం మీకు తెలుసా? మీ శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి, తక్షణం ఎనర్జీని పెంచడానికి ఒక కప్పు కాఫీగా గ్రేట్ గా సహాయపడుతుంది.

అలసటను తగ్గిస్తుంది

అలసటను తగ్గిస్తుంది

మీలో ఉన్న అలసటను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది . కాఫీలో ఉండే కెఫిన్ అనే అంశం అలసటను దూరం చేసి ఎనర్జిటిక్ గా పనిచేయడానికి సమాయపడుతుంది. కెఫిన్ ఒక సారిగా రక్తంలో కలిసినప్పుడు వెంటనే బ్రెయిన్ కు చేరుతుంది. మెదడు చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తుంది.

నరాలను ఉత్తేజపరుస్తుంది

నరాలను ఉత్తేజపరుస్తుంది

కాఫీలో ఉండే కెఫిన్ బ్లాక్ అయిన నరాలను తెరచుకొనేలా చేసి నరాలను ఉత్తేజ పరుస్తుంది.

కాలేయంకు రక్షణ కల్పిస్తుంది

కాలేయంకు రక్షణ కల్పిస్తుంది

మితంగా తీసుకొనే కాఫీ వల్ల కాలేయంకు రక్షణగా కూడా ఉంటుందని నమ్మతారు.

డిప్రెషన్ తగ్గిస్తుంది

డిప్రెషన్ తగ్గిస్తుంది

ఒక కప్పు కాఫీ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. డిప్రెషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కాఫీ వల్ల ఇది ఒక గ్రేట్ బెనిఫిట్.

బరువు తగ్గడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది

బరువు తగ్గడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది

కాఫీ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఎందుకంటే కాఫీ ఫ్యాట్ బర్నింగ్ ప్రొడక్ట్. కాఫీలోని కెఫిన్ శరీరంలో వేడి పుట్టించి, శరీరంలోని జీవక్రియలు వేగవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కొవ్వు విచ్చిన చేయడానికి సహాయపడి, త్వరగా కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. త్వరగా స్లిమ్ గా మారాలని ఎక్కువ కాఫీ తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలి.

జీవితకాలంను పెంచుతుంది.

జీవితకాలంను పెంచుతుంది.

కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది . కొన్ని ప్రత్యేమైన జీవనశైలి విధానాలు ద్వారా కాఫీ కూడా జీవితకాలాన్ని పెంచుతుందని కనుగొన్నారు.

క్యాన్సర్ నివారిణి

క్యాన్సర్ నివారిణి

కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్లు అనేక రకాల కాన్సార్లను నిరోధించడానికి సహాయపడతాయి, రోజూ కాఫీ తాగేవారు సాధారణంగా రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడడం తక్కువ. ఇది కాఫీలోని అధిక ఆక్సీకరణ కంటెంట్ కారణమని చెప్పవచ్చు.

యాంటీఆక్సిడెంట్స్

యాంటీఆక్సిడెంట్స్

కాఫీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది . అందువల్ల, కాఫీని ఎక్కువగా తీసుకోకుండా, పరిమితంగా తీసుకొంటే ఇది ఒక హెల్తీ డ్రింక్ అవుతుంది. పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాఫీ వల్ల ఇది మరో న్యూట్రీషినల్ బెనిఫిట్.

స్ట్రోక్ నివారిస్తుంది

స్ట్రోక్ నివారిస్తుంది

హార్ట్ స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లెమ్స్ ను కాఫీ తగ్గిస్తుంది. కాఫీ వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.

శరీరంలో రద్దీ పెంచుతుంది

శరీరంలో రద్దీ పెంచుతుంది

ఇది శరీరంలో అడ్రినాలిన్ రష్ ను పెంచుతుంది. దాంతో శారీరకంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది . కెఫిన్ వల్ల బ్రెయిన్ కు ఇది మరో ప్రయోజనం.

ఉత్తేజం కలిగిస్తుంది

ఉత్తేజం కలిగిస్తుంది

శరీరంలో నరాలను ఉత్తేజపరుస్తుంది. శారీరకంగా నరాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. పిజికల్ యాక్టివిటీస్ లో మీరు చురుకుగా ఉండాలని కోరుకుంటే, మీరు తప్పనిసరిగా ఒక కప్పు కాఫీ రెగ్యులర్ గా త్రాగాలి.

డెమెంటియా నివారిస్తుంది

డెమెంటియా నివారిస్తుంది

మతిమరుపు మరియు డెమెంటియా వంటి వ్యాధులను తగ్గించడంలో లేదా నివారించడంలో కాఫీ గ్రేట్ గా సహాయపడుతుంది.

న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి

న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి

కాఫీలో కూడా అనేక న్యూట్రీషియన్స్ కలిగి ఉన్నాయి . ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, పాంథోనిక్ యాసి, నియాసిన్, మెగ్నీషియం, మరియు రిబోఫ్లివిన్, వంటి ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయి.

పార్కిన్స్ వ్యాధిని తగ్గిస్తుంది

పార్కిన్స్ వ్యాధిని తగ్గిస్తుంది

దీర్ఘకాలిక వ్యాధులైన పార్కిన్సన్ వంటి జబ్బులను కూడా తగ్గిస్తుంది.

డయాబెటిస్ నివారిస్తుంది

డయాబెటిస్ నివారిస్తుంది

ఎక్కువగా కాఫీ తాగేవారిలో సగంమంది తక్కువ కాఫీ తాగేవారు, అసలు కాఫీ తాగనివారు మధుమేహాన్ని పొందే అవకాశం ఉంది. కాఫీ తక్కువ బ్లడ్ షుగర్ పదార్ధాలని కలిగిఉంటుంది. కాఫీ అలవాటు మధుమేహం అధికమయ్యేటట్లు సహాయపడే విశ్రాంత మెటబాలిజం రేటుని కూడా పెంచడానికి సహాయపడుతుంది.

English summary

17 Health Benefits Of Coffee

Do you know about the health benefits of coffee? Most of us love coffee. Without a cup of coffee, some of us cannot even imagine starting the day. We have been brain washed by our elders who maintain that coffee is unhealthy.
Desktop Bottom Promotion