For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే హెల్తీ ఫుడ్స్

|

వర్షాకాలం చాలా ట్రిక్కీ సీజన్ ఎందుకంటే మనం ఈ సీజన్ లో ఎం తింటామో, ఏమేమీ త్రాగుతామో వాటి మీద ప్రతేక శ్రద్ద కలిగి ఉండాలి . ఈ చల్లని వాతావరణంలో బయట తినే ఆహారాలతో పొట్ట సమస్యలు అనేకం ఇబ్బంది పెడుతాయి.

కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్లో అజీర్తీ, పొట్టలో గ్యాస్ చేరడం మరియు కడు ఉబ్బరం వంటి సమస్యలను నివారించుకోవడానికి మీరు చాలా ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి . ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అన్న విషయం మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. వర్షాకాలంలో పాటించవలసిన 10 ఆరోగ్యం చిట్కాలు

వర్షాకాలంలో శరీరంలో వ్యాధినిరోధకత తగ్గిపోతుంది. దాంతో శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇది కూడా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల మీరు తీసుకొని వర్షాకాల ఆహారం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో శరీరంను ఎనర్జిటిక్ గా మరియు హైడ్రేషన్ లో ఉంచే మంచి న్యూట్రీషియన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. వర్షాకాలంలో బాధించే జబ్బులు-నివారణా చర్యలు

వర్షకాలంలో మన శరీరానికి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవడానికి వ్యాధినిరోధకతను పెంచే ఆహారాల మీద ఎక్కువ ద్రుష్టిని పెట్టాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. జీవక్రియలను చురుకుగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు . కాబట్టి వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే మాన్ సూన్ ఫుడ్స్ ను ఈక్రింది స్లైడ్ ద్వారా అందిస్తున్నాం....

నీళ్ళు:

నీళ్ళు:

చలికాలంలో దాహం వేయలేదని కొంత మంది నీరు త్రాగడమే మానేస్తారు. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది . అలా జరకుండా శరీరంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి మరియు ఇన్ఫెక్షన్స్ భారి నుండి తప్పించుకోవాలంటే నీరు ఎక్కువగా త్రాగాలి. నీరు బాగా మరిగించి, వడపోసిన నీరు మరింత శ్రేయస్కరం.

 ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు:

ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు:

వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు ఆరోగ్యానికి ఉత్తమం. వర్షాకాలంలో ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉత్తమం.

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం:

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం:

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు మరియు ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పోరాడి, ఆరోగ్యంగా ఉంచే ఇమ్యూనిటి ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో క్యాప్సికమ్, బెర్రీస్ మరియు గుమ్మడి ఉత్తమమైనవి.

 జ్యూసులు:

జ్యూసులు:

వేసవి కాలంలోనే కాదు, ఫ్రెష్ జ్యూసులకు వర్షాకాలంలో కూడా మంచిదే. శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వడానికి తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తో తయారుచేసిన జ్యూసులను అధికంగా తీసుకోవాలి.

ఫ్రూట్స్:

ఫ్రూట్స్:

వర్షాకాలంలో వ్యాధినిరోథకను పెంచే విటమిన్ సి ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిలో దానిమ్మ, కివి మరియు ఆరెంజ్ లు ఉత్తమం . మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లైతే నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్ ను తినకుండా ఉండటమే మంచిది.

వెజిటేబుల్స్:

వెజిటేబుల్స్:

వర్షాకాలంలో ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ తినడం ఉత్తమం.. మీరు తీసుకొనే ముందు వీటిని ఖచ్చితంగా ఉడికించినవి తీసుకోవడం ఉత్తమం. . మరియు వాటిని వండే ముందు శుభ్రంగా కడగడం వండటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

.వండిన ఆహారాలు:

.వండిన ఆహారాలు:

మీరు తీసుకొనే ఆహారాలు బాగా ఉడికించినవై ఉండాలి. ఈ సీజన్ లో పచ్చి కూరలు తినడం నివారించాలి. వీటిలో డైరీప్రొడక్ట్స్, వెజిటేబుల్స్, మరియు మీట్ ప్రొడక్ట్స్

మీట్:

మీట్:

వర్షాకాలంలో బాగా ఉడికించిన మాంసాహారాలను తీసుకోవాలి. వర్షాకాలంలో నూనె తక్కువగా వాడే ఆహారాలను తీసుకోవాలి . మాంసాహారాలు ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్ చేసిన లేదా ఉడికించిన ఆహారాలు తీసుకోవడం మంచిది.

వెచ్చని పానియాలు:

వెచ్చని పానియాలు:

వర్షాకాలంలో శరీరంను వెచ్చగా ఉంచుకోవాలి. అందుకు గోరువెచ్చని సూపులు మరియు పానీయాలు ఉత్తమం. అంతే కాదు సూపులు వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అల్లం మరియు లెమన్ లేదా గ్రీన్ టీ తీసుకోవాలి.

English summary

9 Best Foods To Eat In Monsoon

Monsoon season may reduce metabolism and increase fat storage. This again leads to a whole lot of health issues. So you should look for healthy foods for monsoon. Prefer foods that will keep you energetic and hydrated while providing lot of nutrients.
Story first published: Monday, June 15, 2015, 18:25 [IST]
Desktop Bottom Promotion