For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించే న్యూట్రీషియన్స్ ఫుడ్స్

|

ప్రతి రోజూ నిద్ర లేచినప్పటిపట్టినుండి ఉరుకులు పరుగులతో ఆరోజు మొదలవుతుంది. వ్యాయామం చేసే టైం ఉండదు. ఒక వేళ చేయాలనున్నా దాన్ని కాస్త సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తారు. అయితే ఆఫీస్ నుండి రాగేనే అలసట, చిరాకు, ఇక వీటితో ఏం వ్యాయామం.? రాత్రి అయ్యేసరికి రేపు తెల్లవారికి ఖచ్చితంగా వ్యాయామం మొదలు పెట్టాలనుకొంటారు. అయితే యాధా రాజ తధా ప్రజా అన్నట్లు మళ్ళ మరుసటి రోజు ఇంత ఉదయాన్నే ఎవరు నిద్రలేస్తారు.. మరికొంత సేపు నిద్రపోదామనే బద్దకస్తులు చాలా మందే ఉంటారు. నిద్రకు ఇచ్చే సమయాన్ని ఆరోగ్యం మీద కొంతైనా వెచ్చించరు. ఇలా ఏదో ఒక రకంగా ప్రస్తుతానికి వ్యాయామం గురించి మర్చిపోయినా.. ఏదో ఒక రోజు దాని పర్యవ్యసనం తప్పక అనుభవించక తప్పదు.

ఎందుకంటే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతుంటే, మరికొందరేమో పొట్ట పెంచేస్తున్నారు. తర్వాత ఈ పొట్టను, చిరు బొజ్జలను కరిగించే మార్గమేది? అని చింతిస్తుంటారు. అందుకు సరైన సమయంలో సరైన ఆహారం, వ్యాయామం చేస్తే మీ పొట్ట ఫ్లాట్ గా ఉంటుంది. అందుకు మీరు తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అందువలన, మీ శరీరంలో నీరు నిలుపుదల తగ్గించడానికి మరియు మీ జీవక్రియ వేగవంతం చేయటానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే మీకు ఒక ఫ్లాట్ పొట్ట ఇవ్వాలని లేదు. కానీ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీ పొట్ట ఫ్లాట్ గా ఉండాలన్నా, మీరు స్లిమ్ గా మారాలన్నా, మీ రెగ్యులర్ ఆహారంలో చేర్చవలసిన కొన్ని ఆహార పదార్ధాల జాబితా క్రింద ఇవ్వబడింది. అవేంటో ఒక సారి చూద్దాం...

పెరుగు:

పెరుగు:

మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు అనారోగ్యకరమైన డిజర్ట్స్ కు మీరు దూరంగా ఉండటమే మంచిది. బెల్లీ ప్యాట్ కు కారణం అయ్యే అటువంటి డిజర్ట్స్ కు ప్రత్యామ్నాయంగా పెరగును బాగా సహాయపడుతుంది. ఇందులో చాలా తక్కువ కాలరీలు మరియు పోషకాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం, కనీసం రోజులో ఒకసారైనా గ్రీన్ టీని తాగడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది మరియు త్వరగా ఫ్యాట్ ను కరిగిస్తుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం నిమ్మరసం తాగడం ఒక ఉత్తమమైన మార్గం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి ఉదయం పరకడుపు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

తేనె:

తేనె:

ప్రతి రోజూ మీరు తీసుకొనే షుగర్ కంటెంట్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ రెగ్యులర్ డైట్ నుండి చక్కెర మొత్తం తగ్గించండి. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు చక్కెరకు బదులు తేనె బాగా సహాయపడుతుంది. కాబట్టిమీరు పంచదారకు బదులు తేనెను ఉపయోగించుకోవచ్చు.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్‌ లో ఎక్కువగా ఫైబర్(పీచు పదార్ధాం) ఉన్నందున ఎక్కువ సేపు కడుపులో నిలువుంటుంది. దీనివల్ల ఎక్కువగా ఆకలి ఉండదు. ఓట్స్‌తో పాటు చక్కెరను కాకుండా ప్రకృతి సిద్ధమైన తేనెను ఉపయోగించడం ఎంతో మంచిది. ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశె, పూరీ, చపాతీలాటి వాటికన్నా ఓట్స్ ను తీసుకుంటే మంచిది. ఇది గుండె జబ్బులతో సమర్థవంతంగా పోరాడడమే కాకుండా, అధికబరువును తగ్గిస్తుంది. దీనిలో ఫ్యాటీ ఫైబర్ జీర్ణప్రక్రియను ఎక్కువ చేస్తుంది.

 వీట్ గ్రాస్/గోధుమ గడ్డి:

వీట్ గ్రాస్/గోధుమ గడ్డి:

బరువు తగ్గించడానికి: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరు వును, పొట్టను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒకటి లేదా రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను 15 రోజుల పాటు త్రాగడం వల్ల, శరీర బరువు తగ్గముఖం పడుతుంది. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీరంలోని క్రొవ్వును తగ్గించడానికి సహాయపుడుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

ఆకుకూరలు: ఆకు కూరలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సినటువంటి హెల్తీ ఫుడ్. ముఖ్యంగా మహిళల డైయట్ లిస్ట్ లో గ్రీన్ లీఫ్స్ కు, గ్రీన్ వెజిటేబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రొకోలి, ఆస్పరాగస్ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి లో కాలరీలను కలిగి ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.

నీళ్ళు:

నీళ్ళు:

ప్రతి రోజూ నీళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అందుకు మీరు ప్రతి రోజూ కనీసం 7-8గ్లాసుల నీరు త్రాగడం తప్పని సరి. దీని వల్ల మీ శరీరం ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంటుంది. ప్రతి రోజూ తగినంత మోతాదులో నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి. అంతే కాదు జీవక్రియలు క్రమంగా పనిచేసుందుకు బాగా సహాయపడుతాయి.

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో హెల్తీ ఫ్యాట్ కలిగి ఉండి శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఈ ఫ్యాట్స్ మిమ్మల్ని రోజంతా కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. లోయర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం ఇటువంటి ఆహారాలు తీసుకోవడం ఒక అద్భుతమైన మార్గం.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఇది అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఈ పండ్లతో మీ బరువును సాద్యమైనంత వరకూ తగ్గించుకోవండి. వీటిలో లోక్యాలరీస్ తో పాటు సిట్రస్ యాసిడ్స్ కొవ్వును కరిగించడానికి బాగా సహాపడుతాయి.

English summary

11 Nutrition Foods to Reduce Belly Fat Fast

Overweight does not necessarily equal unhealthy.There are actually plenty of overweight people who are in excellent health .Conversely, many normal weight people have the metabolic problems associated with obesity. If you've been unsuccessful in losing weight around your middle, here's some good news! The key ingredients found in the Flat Belly Diet
Story first published: Tuesday, June 2, 2015, 20:11 [IST]
Desktop Bottom Promotion