For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా క్యాలరీలు కరిగించేసి, వేగంగా బరువు తగ్గించేస్తాయి...

|

కొంత మంది మూడు పూటలా ఆహారం తీసుకొన్నా మద్యమద్యలో లేదా తరచూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. నోరు మెదపందే వారికి సంతృప్తి కాదు. కొంత మంది వారికి నచ్చిన ఫేవర్ ఫుడ్స్ ఉంటే చాలు నిరంతరం అవి అయిపోయేదాకా తింటూనే ఉంటారు. అయితే ఇలా తినడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు చేరి అధిక బరువు లేదా ఊబకాయానికి దారితీస్తుంది. అలాంటి వారికి ఒక శుభవార్త ఉంది. వారి తిండిని త్యాగం చేయకుండానే బరువు తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి...

వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించే 20 చిట్కాలు!

కొన్ని వండర్ ఫుల్స్ ఫుడ్స్ ను పరిమితంగా తీసుకొన్నట్లైతే మీరు ఇష్టంగా తిన్నప్పటికి బరువు తగ్గించుకోవచ్చు. ఈ ఆహారాల జీర్ణ అవ్వడానికి ఇతర క్యాలరీ ఫుడ్స్ అవసరం అవుతాయి. మీరు ఇష్టంగా తీసుకొనే ఆహారాలను జీర్ణం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఆహారాల్లోని క్యాలరీలను నిల్వచేసుకుంటాయి.

అంతే కాకుండా...శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్, ఫైబర్ ను పుష్కలంగా అందిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు ఎవరైతే బరువు తగ్గించుకోవాలనుకుంటూ అన్ హెల్తీ డైట్ తీసుకుంటుంటారో ఆహారాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతాయి.

క్యాలరీలు బర్న్ చేయడానికి కొన్ని అసాధారణమైన మార్గాలు

ఈ ఆహారాలను సలాడ్స్, హాఫ్ కుక్కుడ్ మీల్స్ రూపంలో తీసుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు ఆప్రికాట్ మరియు సెలరీ వంటివి హెల్తీ స్నాక్స్ గా తీసుకోవచ్చు . ఈ ఆహారాలు రుచికరంగా ఉండటం వల్ల సలాడ్ డ్రెస్సింగ్ ను జోడించాల్సిన అవసరం ఉండదు . ఈ ఫుడ్స్ సలాడ్ డ్రెస్సింగ్స్ క్యాలరీ కౌంట్ ను పెంచుతాయి . ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఆహారాలు డిజర్ట్స్ మరియు స్నాక్స్ రూపంలో తీసుకుంటూ మీ వెయిట్ లాస్ స్కేల్ ను గమనిస్తుండండి...మరి క్యాలరీలను బర్న్ చేసే ఫుడ్స్ ఏంటో చూద్దాం...

గ్రేఫ్ ఫ్రూట్

గ్రేఫ్ ఫ్రూట్

గ్రేఫ్ ప్రూట్ మీ మెటబాలిజనం వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ క్యాలరీ కరిగిస్తుంది. వీటిని తింటే మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలిగిస్తుంది మరియు ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. దాంతో క్యాలరీలు కరుగటకు సహాయపడుతుంది, ముఖ్యంగా గ్రేఫ్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి, గ్రేప్ ఫ్రూట్ ను మీ సలాడ్స్ లో, స్మూతీస్, డ్రింక్స్ లో చేర్చుకోండి.

పెప్పర్స్:

పెప్పర్స్:

బరువు తగ్గించుకోవాలని చూసే వారు వారి రెగ్యులర్ డైట్ లో పెప్పర్స్ ను తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే హాట్ పెప్పర్స్ శరీరంలో మెటబాలిక్ రేటు పెంచుతుంది దాంతో శరీరంలో అదనపు క్యాలరీలను త్వరగా తగ్గించుకోవడానికి వీలుంటుంది. వంటకాల్లో మరియు డ్రెస్సింగ్ గా వీటిని చేర్చుకోవచ్చు.

లెట్యూస్:

లెట్యూస్:

లెట్యూస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరియు అదనపు క్యాలరీలు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది . లెట్యూస్ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. లెట్యూస్ లో నీరు శాతం అధికంగా ఉండటం వల్ల దీన్ని సలాడ్స్ రూపంలో తీసుకోవడం మంచిది .

సెలరీ

సెలరీ

అదనపు క్యాలరీలను బర్న్ చేసే ఒక సీక్రెట్ ఫుడ్: ఎందుకంటే ఇందులో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇది తినేదానికంటే ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. సెలరీలో ఎక్కువ నీరు ఉంటుంది అందుకు ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే, ఈ ఆహారం సెలరీ డైట్ కు సూటబుల్ కాకపోవచ్చు. మీ శరీరం తగినన్ని న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ అందవు. కాబట్టి, ఇతర పదార్థాల తయారీకి మీరు జోడించుకోవచ్చు.

జుచ్చిని:

జుచ్చిని:

ఇది వర్సిటైల్ ఫ్రూట్ . ఎందుకంటే ఈ ఫ్రూట్ ను వివిధ రకాలుగా తినవచ్చు . సాలడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకోవచ్చు . అందువల్ల బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారు పచ్చిది తినడం మంచిది. దీన్ని తిన్న తర్వాత ఇది జీర్ణం అయ్యే సమయంలో 15 క్యాలరీలను ఉపయోగించుకుంటుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

స్లైస్ గా కట్ చేసిన కీరదోసకాయ మీద, కొద్దిగా ఉప్పు మరియు పెప్పర్ చిలకరించి తినడం వల్ల ఇది పొట్టను ఫుల్ చేస్తుంది, అదే సమయంలో శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. మరియు హెల్తీ స్కిన్ పొందవచ్చు. కీరదోసకాయ న్యూట్రీషియన్స్ అందించి జీవక్రియలు సరిగా జరిగేలా సహాయపడుతాయి.

 ఆపిల్స్:

ఆపిల్స్:

తరచూ స్వీట్స్ తినాలనే కోరికలు కలుగుతుంటే, ఆపిల్స్ తినాలి . వీటిలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరియు జీర్ణం అవ్వడానికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ట్రిక్.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పుచ్చకాయలు 90శాతం నీరు ఉంటుంది. డిజర్ట్ గా క్యాడీస్ లేదా కుక్కీస్ తీసుకోవడానికి బదులుగా కర్బూజాను తినడం మంచిది. అంతే కాకుండా విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

 కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్ ను పచ్చగా లేదా ఉడికించి తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. గ్రీన్ లీవ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి మరియు బరువు తగ్గిస్తాయి .

ఆప్రికాట్:

ఆప్రికాట్:

ఆప్రికాట్ ను క్యాలరీలను బర్న్ చేయడానికి గ్రేట్ గా ఉపయోగపడుతుంది . అదే విధంగా క్యాలరీలను తగ్గించడానికి అవసరమయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ క్యాలరీను అవసరం అవుతాయి. ఈ క్రమంలో ఆప్రికాట్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 లెంటిల్స్:

లెంటిల్స్:

ధాన్యాలు కొన్ని పరిశోధనల ప్రకారం త్రుణ ధాన్యాలు రిఫైండ్ చేసిన వాటికంటే చాలా ఆరోగ్యకరం. ఇది క్రోనిక్ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ ధాన్యాలు డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. త్వరగా ఆకిలి అవ్వదు. త్రుణ ధాన్యాల్లో వివిధ రకాలా విటమిన్స్, మినిరల్స్ మరియు కార్భోహైడ్రేట్స్ మరియు తక్కవు ఫ్యాట్ కలిగి ఉంటాయి.

అవొకాడో

అవొకాడో

అవొకాడో ట్రిపుల్ ఫ్యాట్ బర్నర్. ఇందులో మోనో సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది మెటబాలిజం రేట్ ను పెంచుతుంది మరియు జీవకణాల్లో ఎనర్జీని అంధించి ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను అరికడుతుంది. ముఖ్యంగా అవొకాడో లో అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది మరయు స్ట్రోక్ ను నివారిస్తుంది మరియు చర్మం, జుట్టు, కళ్ళకు చాలా మంచిది. కాబట్టి, సలాడ్స్, స్మూతీస్ లో అవొకాడోను చేర్చుకోండి.

చియా సీడ్స్

చియా సీడ్స్

చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మరియు ఇవి మెటబాలిజం రేటును పెంచుతాయి. ఆకలి కోరికలను తగ్గిస్తాయి. కొన్ని చియా సీడ్స్ ను నీటిలో 15నిముషాలు నానబెట్టి తర్వాత తర్వాత తీసుకోవాలి. ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. క్యాలరీలను బర్న్ చేస్తాయి. వీటని స్మూతీస్, సలాడ్స్, పెరుగు మరియు ఓట్ మీల్ వంటి వాటిలో యాడ్ చేసుకోవచ్చు.

బ్రాజిల్ నట్స్

బ్రాజిల్ నట్స్

ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవడానికి బ్రాజిల్ నట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. ఈ నట్స్ మీ జీవక్రియల రేటును వేగవంతం చేస్తాయి. సాధారణ థైరాయిడ్ హార్మోన్ టి3గా మార్పు చెందేలా చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ యాక్టివ్ గా ఉంచుతాయి . వ్యాధినిరోధకతను పెంచడానికి మరియు సెల్యులైట్స్ తో పోరాడటానికి గ్రేట్ గా సహాయపడుతాయి. అందుకే బ్రాజల్ నట్స్ మిల్క్, యాలకలు, వెనీలా, స్నాక్స్ తో తీసుకోవచ్చు.

ఓమేగా 3

ఓమేగా 3

సైటిఫిక్ గా ఓమేగా 3 మెటబాలిజంను రెగ్యులేట్ చేస్తుందని కనుగొనబడింది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోనల్ లెప్టిప్ లెవల్స్ కొవ్వు ఎంత త్వరగా కరించాలో తెలుపుతుంది . అందుకు ఈ హార్మోన్ సహాయపడుతుంది. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు, కానీ చేపలు తున, హెయిరింగ్, సాల్మన్ వంటి చేపల్లో పుష్కలంగా లభ్యం అవుతుంది.

English summary

15 Foods That Help Burn Calories

There are some wonderful foods that you can eat sufficiently and still lose weight. These foods require more calories to digest them and thus the stored calories are utilised for the digestion of these foods.
Story first published: Thursday, January 7, 2016, 17:44 [IST]
Desktop Bottom Promotion