For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ ఉల్లిపాయలు తినాలి అనడానికి స్ట్రాంగ్ రీజన్స్..!

By Swathi
|

ఉల్లిపాయను కూరగాయల్లో రారాజు అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఉల్లిపాయ లేని వంటకం అంటూ ఉండదు. ప్రతి వంటలోనూ ఉల్లిరుచి, ఘాటు తగిలితేనే.. ఆ వంటకానికి సరైన ఫ్లేవర్ వస్తుంది. అందుకే.. ఇండియన్స్ చాలా ఎక్కువగా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలేకుండా ఇండియన్స్ ఉండగలరా ? అంటే సాధ్యం కాదు. ఇందులో విభిన్నమైన రుచే కాదు.. అత్యంత ఎక్కువ పోషకాలు.. అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే.. ఉల్లిపాయను పూర్వకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నాం.

ఉల్లిపాయల గురించి మీకు తెలియని వాస్తవాలు ఉల్లిపాయల గురించి మీకు తెలియని వాస్తవాలు

అయితే.. ప్రస్తుత కాలంలో ఉల్లిపాయ అంటే.. కేవలం రుచి కోసం వంటకాల్లో ఉపయోగిస్తాం అనుకుంటారు. కానీ.. మన పూర్వీకులు ఉల్లిపాయను ఔషధంగా ఉపయోగించేవాళ్లు. చిన్న చిన్న గాయాలు, పుండ్లు వంటి సమస్యలను తగ్గించడానికి ఉల్లిపాయనే ఉపయోగించేవాళ్లు. అయితే ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అని నిరూపించే.. బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

హార్ట్ హెల్త్

హార్ట్ హెల్త్

ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. థియోసల్ఫినేట్స్, థియోసల్ఫొనేట్స్, మోనో, డి, త్రై సల్ఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె వ్యాధులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది ఉల్లిపాయ.

డయాబెటిస్

డయాబెటిస్

ఉల్లిపాయల్లో క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇవి.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్.. చాలా తేలికగా తగ్గిస్తాయి. అలాగే ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 1, టైప్ టు డయాబెటిక్ పేషంట్స్ లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించవచ్చు.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

విటమిన్ సి, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. ఉల్లిపాయలు.. ఇమ్యునిటీని పెంచుతాయి. అలాగే.. సాధారణ ఇన్ఫెక్షన్స్ సోకకుండా.. ఉల్లిపాయలు సహాయపడతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

ఉల్లిపాయల్లో ఉండే.. క్వెర్సిటిన్ అనే పదార్థం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ని తగ్గిస్తాయి. ఒకవేళ మీకు మధ్యాహ్నం అంతా.. చాలా వర్క్ ఉంటే.. మీ ఆహారంలో.. పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోండి. అలాగే.. నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

క్యాన్సర్

క్యాన్సర్

యాంటీ ఆక్సిడెంట్స్, హై ఆర్గానోసల్ఫర్ ఉల్లిపాయల్లో ఉండటం వల్ల ప్రొస్టేట్, కిడ్నీ, ఓరల్, బ్రెస్ట్, కొలొరెక్టల్ క్యాన్సర్ల రిస్క్ ని అరికడుతుంది.

స్కిన్ హెల్త్

స్కిన్ హెల్త్

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. ముడతలు.. రాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మీ వయసు కనిపించకుండా.. యంగ్ గా ఉంటారు. అలాగే డాండ్రఫ్ ని కూడా నివారిస్తాయి.

స్పెర్మ్ హెల్త్

స్పెర్మ్ హెల్త్

ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల.. స్పెర్మ్ హెల్త్ మెరుగుపడుతుంది. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్పెర్మ్ హెల్త్ పై కీలకప్రభావం చూపుతాయి. అలాగే స్పెర్మ్ కౌంట్ ని కూడా మెరుగుపరుస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

7 healthy reasons to eat more onions

7 healthy reasons to eat more onions. We Indians cannot really imagine life with onions, can we?
Desktop Bottom Promotion