For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాగ్రత్త ! వంటలకు జీలకర్ర ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!

జీలకర్రను అమితంగా వాడితే దుష్ప్రభావాలు తప్పవు. మరి జీలకర్రను ఎక్కువగా వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం..

|

ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలము నుండీ ఇది వాడుకలో ఉంది . ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒకపదార్ధంగా వాడేవారు. గ్రీకులు, రోమన్లు వాడుకులో ఉందిని అంటారు . హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము .జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి.

9 Unexpected Side Effects Of Cumin Seeds

జీలకర్ర అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum. గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. వేడి వేసవిలో ఒక్క గ్లాసెడు మజ్జిగలో జీర వేసుకు తాగితే ఎంతో హాయినిస్తుంది. కోలిక్, డెస్పిసీయా, ఫ్లాటెన్స్ వంటి సమస్యను నివారించడంలో జీలకర్ర గ్రేట్ గా సహాయపడుతుంది,. జీలకర్ర వేయిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది ఎం సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది. ఇన్ని గుణాలు జీలకర్రను మోతాదుకు మించి ఉపయోగిస్తే మీరు ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

జీలకర్రలోని గొప్ప ఔషధగుణగణాలు --ఆరోగ్య ప్రయోజనాలు

జీలకర్రను అమితంగా వాడితే దుష్ప్రభావాలు తప్పవు. మరి జీలకర్రను ఎక్కువగా వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం..

హార్ట్ బర్న్ :

హార్ట్ బర్న్ :

జీలకర్రలో గ్యాస్ ను నివారించే గుణాలు పుష్లకంగా ఉన్నాయి. అయితే ఇది అత్యంత సాధారణ పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యకు, హార్ట్ బర్న్ కు కారణమవుతుంది. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అదే విధంగా జీలకర్ర కూడా ఓవర్ గా ఉపయోగించడం వల్ల హార్ట్ బర్న్ కు కారణమవుతుంది

 త్రేన్పు:

త్రేన్పు:

జీలకర్రలో ఉండే కార్మినేటివ్ గుణాలు వల్ల ఎక్కువ త్రేన్పులు వస్తాయి. జీలకర్రను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువగా త్రేన్పులకు గురిచేయడం వల్ల నలుగురిలో ఇబ్బంది కరంగా ఉంటుంది. ప్రేగుల్లో , పొట్టలో ఎక్సెస్ గ్యాస్ చేచడం వల్ల అది నోటి ద్వారా బయటకు రావడానికి త్రేన్పుల రూపంలో ఇబ్బంది కలిగిస్తుంది. జీలకర్రను ఎక్కువగా ఉపయోగించడం వల్ల త్రేన్పులతో పాటు, నోట్లో దుర్వాసన కూడా వస్తుంది,. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా ఇబ్బందికరంగా, అసహ్యాంగా ఉంటుంది!

లివర్ డ్యామేజ్ :

లివర్ డ్యామేజ్ :

జీలకర్రలో ఉండే ఆయిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి .ఎక్కువ రోజుల నుండి జీలకర్రను మోతాదుకు మించి ఉపయోగిస్తున్నట్లైతే ఇవి లివర్ మరియు కిడ్నీల డ్యామేజ్ కు కారణమవుతుంది. జంతువుల్లో మజిల్స్ స్పామ్స్ ను నివారించడానకి కుమ్మిన్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అబార్టిఫిషియంట్ ఎఫెక్ట్స్ :

అబార్టిఫిషియంట్ ఎఫెక్ట్స్ :

గర్భం పొందిన మహిళల్లో అబార్షన్ కు గురిచేస్తుంది.. రెగ్యులర్ డైట్ లో జీలకర్రను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల అబార్షన్ లేదా ప్రీమెచ్యుర్ ల్యాబర్ సమస్యలను ఏర్పడుతాయి .

నార్కోటిక్ ఎఫెక్ట్స్ :

నార్కోటిక్ ఎఫెక్ట్స్ :

జీలకర్రలో నార్కోటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల మాదక ద్రవ్యంగా పనిచేస్తుంది. కాబట్టి, దీనికి వ్యసనపరులుగా మారుతారు. మానసికగా సమస్యలు, మగతగా అనిపించడం, వికారానికి గురిచేస్తుంది

హెవీ మెనుష్ట్రువల్ సైకిల్ :

హెవీ మెనుష్ట్రువల్ సైకిల్ :

జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కు కారణమవుతుంది. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుంది. !

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది:

రెగ్యులర్ గా జీలకరను ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఏదైనా సర్జరీ చేయించుకునే వారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్జరీ సమయం బ్లడ్ షుగర్ లెవల్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. కాబట్టి, సర్జరీకి 2 వారాల ముందు నుండే డాక్టర్స్ జీలకర్ర తినకూడదని సూచిస్తుంటారు. సర్జరీ సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండాలి.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళకు సురక్షితం కాదు :

డయాబెటిస్ ఉన్న వాళ్ళకు సురక్షితం కాదు :

డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా కంట్రోల్ చేసుకోవాలి. హెల్త్ ను మెయింటైన్ చేయడానికి నార్మల్ బ్లడ్ షుగర్ ను మెయింటైన్ చేయాలి. బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతలున్నప్పుడు, మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి, జీలకర్ర బ్లడ్ షుగర్ లెవల్స్ ఫ్లక్చ్యువేషన్ కు గురిచేస్తుంది , అందువల్ల జీలకర్ర తినడం మానేయాలి.

అలర్జీకి కారణమవుతుంది:

అలర్జీకి కారణమవుతుంది:

జీలకర్రను ఎక్కువగా తినడం వల్ల స్కిన్ రాషెస్, అలర్జీలు పెరుగుతాయి. కాబట్టి, స్కిన్ అలర్జీ ఉన్నవారు జీలకర్రను తక్కువగా తీసుకోవాలి.!

English summary

9 Unexpected Side Effects Of Cumin Seeds

Cumin seed is a culinary herb that is native to Asia. Cumin seeds are also known as jeera, caraway, kummel, krishnajraka roman cumin, kala jeera, shahi jeera, semences de carvi, haravi and apium carvi. It is in fact a fruit of cumin herb, but it forms seeds once it has dried. Cumin is a valued spice as it has many medical benefits, mainly for digestive conditions like colic, dyspepsia and flatulence. However, consuming cumin seed can have many side effects too, so consult your doctor before you use it for medical purposes.
Desktop Bottom Promotion