For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ పెప్పర్లో దాగి ఉన్న ఔషధగుణాలు మీకు తెలుసా...

By Staff
|

నల్ల మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. ముందొచ్చిన చెవులకన్నా... అన్న టైప్‌లో మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం 'పెప్పర్' పేరుతో టేబులెక్కి కేక పుట్టిస్తోంది. పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట.

మిరియంలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక నల్ల మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.

నల్ల మిరియాలలో సమృద్దిగా ఉన్న లక్షణాలు చాలా చిన్నగా ఉండే ఈ నల్ల మసాలాలో ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. దీనిలో మాంగనీస్, పొటాషియం, ఇనుము, పీచు, విటమిన్లు సి మరియు K వంటి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ అద్భుతమైన ఔషధ మసాలాలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. నల్ల మిరియాలు దగ్గు చికిత్సలోనే కాక క్యాన్సర్ మరియు ప్రేగు సమస్యల వంటి ఇతర వ్యాధుల నయంలో కూడా సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.

జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కుదిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచటం, గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా .... ఏ వ్యాధికైనా ఒకే మందు... అదే మిరియం. వేల రకాల వంటకాలకైనా మేలిమిరుచిని తీసుకువచ్చే ఘనాపాఠి మిరియం. కానీ మీకు తెలుసా బ్లాక్ పెప్పర్ ఇచ్చే ఘాటైన వాసన, మరియు రుచి కంటే అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. మరి అవేంటో ఒకసారి చూద్దాం:

దగ్గు నివారిస్తుంది:

దగ్గు నివారిస్తుంది:

చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఒక చిన్న బౌల్లో కొన్ని మిరియాలు తీసుకొని, అందులో జీలకర్ర , కొద్దిగా ఉప్పు వేయాలి . ఈ మూడూ మిక్స్ చేసి నోట్లో ఒక వైపు పెట్టుకోవాలి ఇలా చేస్తే దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది

జ్వరం తగ్గించుకోవచ్చు:

జ్వరం తగ్గించుకోవచ్చు:

ఒక చిన్న బౌల్లో కొన్ని మిరియాలు తీసుకొని, అందులో ఒక చెంచా షుగర్ వేసి, సరిపడా నీళ్ళు సోసి తీసుకోవాలి . ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీస్ జ్వరం త్వరగా నయం అవుతుంది.

జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది:

జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది:

జలుబు మరియు దగ్గుతో బాధపడుతుండే సమయంలో సూప్ లేదా రసంలో కొద్దిగా పెప్పర్ పౌడర్ ను చిలకరించి తీసుకోండి. వెంటనే గొంతు నొప్పి తగ్గించి, ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగించి సులభంగా శ్వాస పీల్చుకొనే విధంగా సహాయపడుతుంది.

దంత సంరక్షణలో గ్రేట్ గా సహాయపడుతుంది:

దంత సంరక్షణలో గ్రేట్ గా సహాయపడుతుంది:

ఒక కప్పు నీటిలో మిరియాల పొడి, ఉప్పు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చిగుళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు.. పలు దంత సమస్యల నుంచి బయటపడవచ్చు.

జ్ఝాన దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది:

జ్ఝాన దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది:

చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. అలాగే ఒక చెంచా పెప్పర్ పౌడర్ ,ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి . నొప్పి ఉన్న దంతాల మీద ఈ మిశ్రమంతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆకలి పెంచుతుంది:

ఆకలి పెంచుతుంది:

బ్లాక్ పెప్పర్ జీర్ణక్రియను మెరుపరచడానికి మరియు టేస్ట్ బడ్స్ ను ఉద్దీపనచేయడానికి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే, బ్లాక్ పెప్పర్ లో ఉండే ఈ లక్షణాల వల్ల ఆకలి లేని వారికి, ఆకలి కలిగించేందుకు సహాయపడుతుంది. ఆహారం తినలేని సందర్భంలో వారి తీసుకొనే ఆహారంలో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ ను కొద్దిగా జోడించడం వల్ల అనొరెక్సియాను పరిష్కరించడంలో సుదీర్ఘంగా వెళతాయి. ఆకలిని పెంచేలా చేస్తాయి.

డ్రై మౌత్ నివారిస్తుంది:

డ్రై మౌత్ నివారిస్తుంది:

అధిక దప్పిక ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. నీటిలోనానబెట్టిన మిరియాలు నమలడం వల్ల డ్రై మౌత్ నివారించుకోవచ్చు మరియు డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

బ్రెయిన్ టానిక్:

బ్రెయిన్ టానిక్:

రెగ్యులర్ డైట్ లో పెప్పర్ కార్న్స్ జోడించడం వల్ల బ్రెయిన్ టానిక్ గా పనిచేస్తుంది . ఇందులో ఉండే ఔషధ గుణాలు బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఏకాగ్రత మరియు మోటార్ స్కిల్స్ పెరుగుతాయి.

కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

అరగ్లాసు పాలలో ఒక చెంచా పెప్పర్ పౌడర్, ఒక చెంచా తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

బ్లాక్ పెప్పర్ లోని పెప్పరిన్ అనే మూలకం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కారణంగా మరింత టేస్ట్ బడ్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం. మరియు అపానవాయువు, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం మరియు ఆమ్లత వీటివల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇందులోని అదనపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈసమస్యలన్నింటిని నిరోధించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకోసం, మీరు తయారు చేసే వంటల్లో ఒక టేబుల్స్ స్పూన్ పెప్పర్ పౌడర్ ను జోడించండి . ఇది వంటలకు ఫ్లేవర్ ను జోడించడంతో పాటు కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

హాట్ మిరియాలు సులభంగా జీవక్రియ ప్రక్రియ పెంచడానికి సహాయపడతాయి. "జీవ రసాయనశాస్త్రం యొక్క జర్నల్" సర్వే ప్రకారం కొవ్వు బర్న్ కు సహాయం చేస్తుందని తెలిసింది. హాట్ మిరియాలలో క్యాప్సైసిన్ ఉంటుంది. వేడి మిరియాలు మన శరీరంలో ఉండే రసాయనాలను వేడిగా ఉంచి కేలరీలను బర్న్ చేస్తుంది. ఒక చిన్న సల్సా తో పాటు గుడ్డు కేవలం ఆరోగ్యకరమైనదే కాదు. అది జీవ క్రియా విధానాన్ని పెంచడానికి లాభపడవచ్చు.

అలర్జీలను నివారిస్తుంది:

అలర్జీలను నివారిస్తుంది:

ఒక గిన్నెలో నీరు బాగా మరిగించి, అందులో కొన్ని మిరియాలు వేసి , వైట్ పెప్పర్ , మరియు షుగర్ కూడా వేసి మరిగించాలి. ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి మరిగించి వడగట్టి త్రాగడం వల్ల కొన్ని రకాల అలర్జీలను తగ్గించుకోవచ్చు

ముక్కుదిబ్బడను నివారిస్తుంది:

ముక్కుదిబ్బడను నివారిస్తుంది:

ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా, జలుబు మరియు దగ్గును నయం చేయడానికి పెప్పర్ ఒక సమర్థవంతంగా పనిచేసే ఒకనేచురల్ రెమడీగా సహాయపడుతుంది. పెప్పర్ కారంగా మరియు పెప్పర్ లోని ఘాటైన ఫ్లేవర్ గొంతునొప్పి మరియు ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

English summary

Do You Know The 13 Health Benefits Of Black Pepper Corns?

Do You Know The 13 Health Benefits Of Black Pepper Corns?,Black pepper corns have more than a handful of health benefits, unlike any other spice. This hot Indian spice should be a must-add ingredient in your daily diet, since it will help to keep you fit and healthy.