For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ కీరకాయ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!

|

ప్రతి రోజూ మనం తినడానికి ఎన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కలనే ఎందుకు తింటారు? ఇది ఆరోగ్యానికి చక్కని ఔషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. ఊబకాయలకు బద్ధ శత్రువు. అన్నిటికీ మించి కీరకాయ.... వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి భండాగారం. ప్రధానంగా దీన్ని సలాడ్స్ లో, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు.

కాయ.... పండా...? శాస్త్రీయంగా చెప్పాలంటే పండే ... కాని పచ్చిగా ఉండగానే కోసి తింటాం కాబట్టే టొమాటో మాదిరిగా కీర దోసకాయను కూడా తినే కూరగాయగానే చెప్పాలి. అదిగాక దాహాన్ని తీర్చి వంటిని చల్ల బరచడంలో పుచ్చకాయ(కర్భూజాను) మించిన కాయ కీర దోస కాయ. ఇందులో ఉండేది 96% శాతం నీరే. దాహం ఇట్టె తీరిపోతుంది. ముఖ్యంగా ఊబకాయలకు ఆకలి అనిపించగానే కొన్ని కీరకాయ ముక్కలు తింటే పొట్ట ఇట్టె పుల్ అయిపోతుంది. క్యాలరీలు చేరావు. కాబట్టి. ఇది వారి పాలిట ఓ రకముగా అక్షయ పాత్రే. అయితే ఇందులో ఉండే ఫినైల్దియో కార్బైడ్ కారణంగా కీర కాస్త చేదుగా అనిపిస్తుంది. అందుకే చాలామంది తోడిమకి దగ్గరగా ఉన్న ఆ చివర భాగాన్ని కొంత మేరకు తీసేస్తారు.

కీరదోసకాయను సలాడ్స్ రూపంలో తీసుకుంటారు, కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. రోజూ కుకుంబర్ తింటే ఏమవుతుంది? జవాబు మాత్రం చాలా సింపుల్ బాడీ డిటాక్సిఫై చేస్తుంది, హానికరమైన టాక్సిన్స్ ను బాడీ నుండి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అలాగే కీరదోసకాయకు క్యారెట్, ఆపిల్స్, మస్క్ మెలోన్ వంటివి జోడించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. రోజూ కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మేజర్ హెల్త్ సమస్యలను నివారించడంలో కూడా కీరదోస గ్రేట్ గా సహాయపడుతుంది. రోజూ కీర దోస తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1. కిడ్నీ బ్లాడర్ స్టోన్స్ ను కరిగిస్తుంది:

1. కిడ్నీ బ్లాడర్ స్టోన్స్ ను కరిగిస్తుంది:

కీరదోసకాయ కిడ్నీని శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ నేచురల్ రెమెడీ. ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, బ్లాడర్ మరియు కిడ్నీ స్టోన్స్ ను కరిగించి బయటకు నెట్టేస్తుంది. కీరదోసకాయను రెగ్యులర్ గా తింటుంటే ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది, దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది,.

2. యాంటీ క్యాన్సర్ :

2. యాంటీ క్యాన్సర్ :

కీరదోసకాయను రోజూ తినడం వల్ల క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కీరలో ఉండే ఔషధగుణాల వల్ల బ్రెస్ట్, యుటేరియన్, ప్రొస్టేట్ వంటి వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

3. స్టొమక్ అల్సర్ తగ్గిస్తుంది:

3. స్టొమక్ అల్సర్ తగ్గిస్తుంది:

రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది,. కీరదోసలో ఉండే ఆల్కనిటి స్టొమక్ అల్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు గ్లాసులు కీరదోస జ్యూస్ తాగడం వల్ల ఇది స్టొమక్ అల్సర్ నివారిస్తుంది.

4.బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

4.బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హైబిపి, లోబిపి రెండింటిని కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

5. బాడీకి రీహైడ్రేట్ అందిస్తుంది:

5. బాడీకి రీహైడ్రేట్ అందిస్తుంది:

కీరదోసకాయలో 95శాతం నీరు ఉండటం వల్ల, వేడి వాతావరణం లేదా హాట్ సమ్మర్ లో శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. కాబట్టి రోజూ ఫ్రెష్ కీరదోసకాయను తినడం మంచిది. హైడ్రేషన్ మాత్రమే కాదు, ఆకలి తగ్గిస్తుంది.

6. తలనొప్పి నివారిస్తుంది:

6. తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పితో బాధపడే వారు ?కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ బి, వాటర్ కంటెంట్, మరియు ఎలక్ట్రోలైట్స్ కారణంగా తలనొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హ్యాంగోవర్ తలనొప్పి కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

7. హెల్తీ స్కిన్ ప్రోత్సహిస్తుంది:

7. హెల్తీ స్కిన్ ప్రోత్సహిస్తుంది:

కీరదోసలో అమేజింగ్ బ్యూటీ స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియ, పొటాషియం, మరియు సిలికాన్ స్కిన్ ఫ్రెండ్లీ మినిరల్స్, ఇది హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ప్రోత్సహిస్తుంది.

8. కళ్ళకు:

8. కళ్ళకు:

రోజు నిద్రపోయేముందు కీరదోసకాయను చక్రల్లా కట్ చేసిన ముక్కలను పెట్టుకుంటే కల్ల కింద నల్లని వలయాలు, వాపులు తగ్గుతాయి. అలసిన కళ్లకు సేద తీరేలగా చేస్తుంది. కళ్ళ దగ్గర చర్మ కాంతి పెంచుతుంది. ఇందులో ఉండే ఆస్కార్బిక్ మరియు కాఫిక్ పుష్కలంగా ఉండటం. ఇంకా కీరదోసకాయ తొక్కు సూర్యరశ్మి వల్ల పాడైన చర్మాన్ని తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కీర ముక్కల్ల్ని కంటిమీద పెడితే మంట తగ్గుతుంది.

9. పళ్ళు మరియు మంచి చిగుళ్ళ ఆరోగ్యానికి:

9. పళ్ళు మరియు మంచి చిగుళ్ళ ఆరోగ్యానికి:

దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి దోసకాయ రసం చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

10 జీర్ణశక్తి పెంచుతుంది:

10 జీర్ణశక్తి పెంచుతుంది:

కీరదోసకాయను తరచూ తినడం వల్ల ఎసిడిటి, గుండెల్లో, పొట్టలో పుండ్లు మరియు పూతల వంటి పలు జీర్ణ అల్సర్లకు కీర దోసకాయ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. కీరదోసకాయలో ఉండే నీరు మరియు డైటరీ ఫైబర్ మనం తినే ఎటువంటి ఆహారాన్నైనా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దోసకాయ కూడా క్రమం తప్పకుండా వినియోగించే ఉంటే, దీర్ఘకాల మలబద్ధకం వ్యతిరేకంగా ఉపయోగకరంగా గుర్తించారు.

11. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

11. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

దోసకాయ మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా మధుమేహం నియంత్రిస్తుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీళ్ళ జబ్బులకు కీర రసంలో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. డయాబెటిస్ వాళ్లకి కూడ ఇది చాల మంచి ఆహారం.

12. కొలెస్ట్రాల్ తగ్గించడానికి:

12. కొలెస్ట్రాల్ తగ్గించడానికి:

కీర దోసకాయలో స్టెరాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాతీ, ఉపిరితిత్తులు , ఉదర వ్యాదులకు కీర ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం బీపిని నియంత్రణలో ఉంచితే మేగ్నీషియం రక్త ప్రసరణకు మెరుగుపరచి నరాలు, కండరాలు కదలికలకు ప్రాణం పోస్తుంది. ఇక కీరలో పీచు కొలస్ట్రాల్ శాతాన్ని నియంత్రిస్తుంది.

ఇలా చెప్పకుంటూ పోతే కీరదోసకాయలో ఎన్నో అందానికి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలున్నాయి. కీరదోసకాయ తినడానికి సమయం సందర్బం ఏవీ అవసరం లేదు, రోజులో ఎప్పుడు తిన్నా అద్భుత ప్రయోజనాలను పొందివచ్చు.

బెస్ట్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ పొందండి

English summary

Have Cucumber Everyday And Get Rid of Several Health Problems

Is it a fruit or a vegetable? Many seem to get confused with this salad ingredient. It is eaten raw, comes with vegetable and is a regular ingredient in salads, but the confusion continues. Well, to clear all your confusions, the refreshing cucumber is a fruit that grows on vines. And did you know the various health benefits of cucumber?
Desktop Bottom Promotion