For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మలో దాగున్న మహిళల ఆరోగ్య రహస్యాలు

|

గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . చూడ ముచ్చటైన రూపం, లోపల ముత్యాలాంటి గింజలతో ప్రతి ఒక్కరికీ నచ్చే ఫలం ఏదంటే దానిమ్మ అని ఠక్కున చెప్పవచ్చు. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాక మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే ఓ దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.

దానిమ్మ పండులో ఉండే చిన్ని విత్తనాలను అరిల్స్ అని పిలుస్తుంటాము. ఈ అరిల్స్ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ , ఫిల్లెట్, విటమిన్ కె, మరియు షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు అరిల్స్ లో దాదాపు 144 క్యాలరీలు దాగున్నాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అందుకే దానిమ్మ పూర్తి పోషకాలను అందించే ప్యాకేజ్ గా పిలవబడుతున్నాయి.

జ్యూసీ పొమోగ్రనేట్(దానిమ్మ)లో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

దానిమ్మలో వివిధ రకాల న్యూట్రీషియన్లు కలిగి ఉండటం వల్ల దీన్ని వండర్ ఫ్రూట్ గా పిలుచుకొంటున్నాము. వివిధ రకాల న్యూట్రీషియన్స్ వివిధ రకాల ప్రయోజనాలను కలిగి ఉన్నది. దానిమ్మ తినడం వల్ల దీర్ఘకాలం పాటు ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా మహిళ ఆరోగ్యానికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా దానిమ్మలో ఉండే పునికలాజిన్స్ మరియు పునిసిస్ యాసిడ్స్ అనే రెండు కాంపౌండ్స్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి . పునికలజిన్స్ అంటే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. ఇది హానికరమైన ఫ్రీరాడికల్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . అదే విధంగా పునిసిస్ యాసిడ్ లినోలిక్ యాసిడ్ కలిగి ఉండటం వల్ల ఇది స్ట్రాంగ్ హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది.

రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?

మహిళలు తప్పనిసరిగా వారి రెగ్యులర్ డైట్ లో దానిమ్మను చేర్చుకోవడం వల్ల అనేక రకాలా ఫీమేల్ స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది . కాబట్టి దానిమ్మను విత్తనాలుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

 అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా సాధారణ సమస్య. ముఖ్యంగా నెలనెల వచ్చే నెలసరి సమస్య వల్ల చాలా మంది మహిళలు బ్లడ్ ను కోల్పోతుంటారు . రోజూ దానిమ్మ తినడం వల్ల హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎక్కువ తీసుకోవడానికి సిఫారస్ చేయబడినది. అందుకు దానిమ్మ అంటే మహిళ ఆరోగ్యానికి ఒక వరం వంటిది.

ఆరోగ్యమైన చర్మం:

ఆరోగ్యమైన చర్మం:

పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది . ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది . దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది .అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ముఖంలో ముడుతలను, డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది.

 బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతుంది:

బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతుంది:

దానిమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ తో ఎఫెక్ట్ గా పోరాడుతుంది . ఇందులో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడి, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మరియు దానిమ్మను క్యాన్సర్ సెల్స్ ను నేచురల్ గా నాశనం చేసే ఒక ఔషధిగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం కూడా ఈ విషయం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

చాలా వరకూ మహిళలు మోనోపాజ్ దశ చేరుకొన్న తర్వాత ఎక్కువగా హార్ట్ సమస్యలకు గురి అవుతుంటారు . రోజూ ఒక దానిమ్మ తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు . మహిళలు హార్ట్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు ట్రై గ్లిజరైడ్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది.:

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది.:

ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం. . జాయింట్స్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఓస్టిరియోఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.అనేక హెల్త్ ఇష్యులను తగ్గిస్తుంది. దానిమ్మలో అయాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరం యొక్క ఇమ్యునిటీని పెంచుతుంది . అందుకే ఈ మార్గంలో మహిళలకు చాలా మేలు చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

ఈ బిజీ షెడ్యుల్సే జీర్ణ సమస్యలకు కారణం అవుతుందని మీకు తెలుసా? ఈ సమస్యను నివారించడానికి దానిమ్మ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను మరియు బౌల్ మూమెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక దానిమ్మ ఒక సర్వింగ్ కి 45శాతం ఫైబర్ ను రోజుకు అందిస్తుంది.

డెంటల్ హెల్త్:

డెంటల్ హెల్త్:

గర్భధారణ సమస్యలు చాలా మంది మహిళలు దంత క్షయం , మరియు దంత సమస్యలను ఎదుర్కొంటారు . కాబట్టి రోజూ ఒక దానిమ్మ తీసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటిని నివారించుకోవచ్చు . అలాగే దాంతాల మీద పాచీ ఏర్పడకుండా నివారిస్తుంది.

గర్భిణీలకు చాలా ఆరోగ్యకరమైనది:

గర్భిణీలకు చాలా ఆరోగ్యకరమైనది:

గర్భిణీలు గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహారం మీద ఎక్కువ ఏకాగ్రతను పెట్టాలి. తీసుకొనే ఆహారం పూర్తి ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, కలిగి ఉండాలి. గర్భిణీలు రోజూ ఒక దానిమ్మ తినడం ద్వారా తల్లి, బిడ్డ, హెల్తీ ప్రెగ్నెన్సీ పీరియడ్ పొందవచ్చు .

ఇన్ఫెర్టిలిటీని జయిస్తుంది:

ఇన్ఫెర్టిలిటీని జయిస్తుంది:

సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.

ఫోలిక్ యాసిడ్ :

ఫోలిక్ యాసిడ్ :

గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.

English summary

How Pomegranate Is Good For Women

How Pomegranate Is Good For Women,Pomegranate is a rich coloured fruit that makes it a favourite fruit of children. However, do you know that it is a healthy fruit for women as well? Pomegranate is one of the most widely used fruits that can treat many health issues related to women. The small seeds present i
Story first published: Monday, February 1, 2016, 11:44 [IST]
Desktop Bottom Promotion