For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళు, కీళ్ళు, ఆర్థైటిస్ నొప్పులను నివారించే క్యాల్షియం రిచ్ ఫుడ్స్..!

|

కాల్షియం శరీరంను నిర్మించే పోషకాలలో ఒకటి. మన రోజువారీ ఆహారంలో కాల్షియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బలమైన ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి సరైన కాల్షియం తీసుకోవల్సిన అవసరం ఉంది. కాల్షియం మన ఆరోగ్యం కొరకు చాలా చేస్తుంది. కాల్షియం నిస్సందేహంగా మన ఆరోగ్యం కొరకు ఒక అత్యవసర పోషకంగా ఉంది. పోషకాలు మరియు స్థాయిలు తీసుకోవడం అనేది పురుషులు మరియు మహిళలలో మారవచ్చు. కొన్నిసార్లు స్త్రీలకు తమ ఆరోగ్యం నిర్వహించడానికి కొన్ని అదనపు పోషకాలు అవసరం కావచ్చు.

సాధారణంగా మహిళల రుతుస్రావం(మెన్సస్‌) సమయంలో వచ్చే అనేక రుగ్మతలను కాల్షియం తగ్గించగలదు. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గుతుంది. అనేక రకాల నొప్పులకు ఇది దారితీస్తుంది. ఆస్టియో పోరోసిస్‌ కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాల్షియం తక్కువైతే హైబి.పి కి దారితీస్తుంది. పెద్దవారిలో మాదిరే పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. గర్భవతులకు కాల్షియం టాబ్లెట్స్‌ రూపంలో ఇస్తుంటారు. అందువల్ల మనం తినే ఆహారంలో కాల్షియం బాగా లభించే పదార్థాలు సమకూర్చుకోవాలి.

కాల్షియం లోపం కారణంగా వచ్చే సమస్యలు: మానవ లేదా జీవుల శరీరంలో కాల్షియం లోపం వల్ల సమస్యలు ఎదుర్కొనే వారిని, మన పరిసర ప్రాంతాల్లోనే చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎముకుల బలహీనత, ఆస్టియోఫొరోసిస్ ముఖ్యమైంది . చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే కీళ్లనొప్పులు, 40 ఏళ్ళు దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు వైద్య నిపుణులు కూడా. ఎముకలు క్షీణించడానికి కూడా ప్రధాన కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ దరిచేరవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తీసుకొనే ఆహారంలో ఆ ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.

వాస్తవానికి కాల్షియం పురుషుల కంటే కూడా మహిళలకే ఎక్కువగా అవసరం. అ్ందుకు చాలా మంది పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి పాలను, ఇతర డైరీ ప్రొడక్ట్స్ ను ఎక్కుగా తీసుకుంటుంటారు. అయితే శరీరానికి కావల్సినంత కాల్షియం అందాలంటే పాలు ఒక్కటే సరిపోవు. దానికి తోడు కాల్షియం ఉన్నమరొకిన్ని ఆహారాలను కూడా మీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. మరి క్యాల్షియం ఎందులో దొరుకుతుందో తెలుసుకొని వాటి ప్రతి రోజూ మన డైయట్ లిస్ట్ లో చేర్చుకొని ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాం....

నువ్వులు:

నువ్వులు:

సాధారణంగా నువ్వులను మనం వంటల్లో తప్ప విడిగా మనం తినలేం. తినము కూడా. అయితే ఒక చెంచా నువ్వులు తినడం వల్ల మీరు ఒక గ్లాసు పాలు తాగితే లభించేటంత కాల్షియం ఇందులో లభిస్తుంది.

వైట్ బీన్స్ :

వైట్ బీన్స్ :

ఇది కాల్షియం ఉన్న ఆహారాల్లో అంతే ప్రత్యేకమైనది కాకపోయినా, ఒక కప్పు వైట్ బీన్స్ తినడం వల్ల 100mg కాల్షియం శరీరానికి అందుతుంది.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది.

బాదం:

బాదం:

బాదం ‘విటమిన్ ఇ' చాలా ఫేమస్. ప్రతి యొక్క బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందినట్లే.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది,. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ లో 30 మిల్లీగ్రాములు క్యాల్షియం ఉంటుంది. రెగ్యులర్ ఫుడ్స్ లో ఫ్లాక్స్ సీడ్స్ ను చేర్చుకోవడం వల్ల క్యాల్షియం పొందుతారు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

క్యాల్షియం, విటమిన్స్, యాంటీయాక్సిడెంట్ వంటి న్యూట్రీషియన్స్ కు అద్భుతమైన మూలం వెల్లుల్లి. రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం వ్రుద్ది చెందుతుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ కూడా సీ ఫిషే. ఇందులో ఉండే మినిరల్స్ సెలైన్ వాటర్ లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్ ను తరచూ మీ ఆహారంతో పాటు తీసుకోండి.

పుదీనా:

పుదీనా:

పుదీనాలో యాంటీఆక్సిడెంట్స్ మాత్రమే కాదు, క్యాల్షియం కూడా ఎక్కువే. ఇంకా విటమిన్స్, ఐరన్, పొటాషియంలు అత్యధికంగా ఉన్నాయి.

ఆవ ఆకులు:

ఆవ ఆకులు:

మస్టర్డ్ లీవ్స్ లో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్ ను డెవలప్ చేస్తుంది. ఇంకా ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్, ఫైబర్స్ యాంటీఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ గుండె ఆరోగ్యాని, మరియు శరీరానికి కావల్సిన ఫైబర్ ను ఎక్కువగా అంధించడానికి ఇది చాలా సహయాపడుతుంది. అంతే కాదు ఇది కొంత వరకూ కాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుంది. ఇది మహిళలకు ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

పాలు, పెరుగు పక్కన పెడితే గ్రీన్ లీఫ్ వెజిటెబుల్స్ లో కూడా అధిక శాతంలో కాల్షియం నిల్వ ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరలు, బ్రొకోలీ ఎక్కువ.

బ్రొకోలి:

బ్రొకోలి:

బ్రొకోలీ హెల్తీ బోన్ ఫుడ్. ఎందుకంటే ఇందులో అద్భుతమైన క్యాల్షియం, విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బోన్ హెల్త్ కు చాలా అవసవరం. ఓస్టిరోయోఫోసిస్ ను నివారిస్తుంది.

English summary

If Not Milk, What Are The Other Sources Of Calcium For Women?

If Not Milk, What Are The Other Sources Of Calcium For Women?,As soon as we learn that there is a calcium deficit in the body among women, the first thing that comes to our mind is milk as the richest source of calcium. But there are a few women who are allergic to milk and cannot stand milk. So how do they g
Story first published: Saturday, October 8, 2016, 16:59 [IST]
Desktop Bottom Promotion