For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక లోపాలను, బలహీనతలను పోగొట్టే అంజీర

|

అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడుబండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి.

అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది.

TOP 13 Anjeer Health Benefits

అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుం అందుతాయి. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. టితో పాటు మరికొన్ని గొప్పఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది మరి అవేంటో ఒక సారి చూద్దాం...

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలిని సూచిస్తుంటారు. అజీర పండులో పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది.

MOST READ: 'మూత్రాశయ వ్యాధి' యొక్క లక్షణాలు - దాని నివారణ పద్ధతులు !

ఉబ్బసం:

ఉబ్బసం:

కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటంకష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగాఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.

బలహీనత:

బలహీనత:

చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంటవంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగాఉంటుంది.

శరీరంలో వేడి:

శరీరంలో వేడి:

బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటినిరాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.

గుండె వ్యాధుల నివారణ:

గుండె వ్యాధుల నివారణ:

ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకీతోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలాఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు.

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:

అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు.ఫిగ్స్ ఆకులు ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీ కరించుటలో వీటి పాత్ర అధికం.బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఆకులలో లభిస్తుంది.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

ఇందులోని ట్రిప్టోఫాన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకేనిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ రాత్రిపూట రెండు, మూడు అత్తిపండ్లు తినిపాలు తాగితే మంచి నిద్రపడుతుంది.

MOST READ: అవిసె గింజల గురించి 5 అద్భుతమైన అందమైన వాస్తవాలు

‘లో కొలెస్ట్రాల్’:

‘లో కొలెస్ట్రాల్’:

అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

ఎముకలు పటిష్టం:

ఎముకలు పటిష్టం:

ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీరలో అధిక మోతాదులో ఉంది.

కొలోన్ కాన్సర్:

కొలోన్ కాన్సర్:

ఇందులో లభ్యమయ్యే పీచుపదర్ధం వలన హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధపదార్ధాలుగా బయటకు పంపివేయబడతాయి. దీనివలన ప్రేగులలో ఏర్పడే కొలోన్ కాన్సర్ను నియంత్రించవచ్చు.

బ్రెయిన్ క్యాన్సర్

బ్రెయిన్ క్యాన్సర్

నూతన పరిశోధనలలో వెళ్ళడించిన దాని ప్రకారం, మేడిపండ్ల నుండి తీసిన సారం మెదడులో క్యాన్సర్ కు గురైన కణాలపై శక్తివంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. మేడిపండ్ల సారం, క్యాన్సర్ కు గురైన కణాలలో ప్రవేశపెట్టబడిన తరువాత, క్యాన్సర్ అభివృద్ధి 75 శాతం వరకు అణచబడిందని ఇదే పరిశోధనలలో వెల్లడించబడింది.

కాలేయ క్యాన్సర్

కాలేయ క్యాన్సర్

అత్తిపండ్ల సారం, కాలేయ క్యాన్సర్ కణాలతో వ్యతిరేఖంగా పోరాడుతుందని, అధ్యయనాలలో తెలుపబడింది. ఈ సారం వాడకం వలన క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించబడటమే కాకుండా, ఇతర చికిత్సలో కన్నా, ఈ సారం వాడకం ద్వారా క్యాన్సర్ కణాలు రెట్టింపు అవటం కూడా తగ్గుతుందని అధ్యయనాలలో తెలుపబడింది.

పోస్ట్ మీనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్

పోస్ట్ మీనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్

మేడిపండ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, క్యాన్సర్ ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ముఖ్యంగా, పోస్ట్ మీనోపాజల్ స్త్రీలలో, హార్మోన్ల అసమతల్యతల వలన రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయి.

English summary

TOP 13 Anjeer Health Benefits

Figs are one of the earliest fruits grown by man. Though figs are not available throughout the year, dried figs (popularly known as anjeer in India) are. Not only is dried fig tasty to eat, it has numerous health benefits to offer as well.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more